పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉపన్యాసము 2020-21.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధరల వద్ద 2019-20 సంవత్సరానికి గాను రూ. 9,72,782 కోట్లుగా నమోదయింది. తద్వారా 12.73% వృద్ధి కనిపిస్తున్నది. 2011-12 స్థిర ధరల ప్రకారం 2019-20 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తి రూ. 6,72,018 కోట్లు. ఇది 2018-19 (మొదట సవరించిన అంచనాలు)కు చెందిన రూ. 6,21,301 కోట్లుకన్నా 8.16% ఎక్కువ. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 2018-19 (మొదట సవరించిన అంచనాలు) కి చెందిన రూ.1,51,173 నుంచి 2019-20 లో రూ.1,69,519 కి పెరిగింది. తద్వారా 12.14% పెరుగుదల నమోదయింది.

2018-19 లెక్కలు

107. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు క్రోడీకరించిన ఆర్థిక లెక్కల ప్రకారం 1 ఏప్రిల్ 2018 నుండి 31 మార్చి 2019 మధ్య కాలానికి రూ.13,898.59 కోట్ల మేరకు రెవెన్యూ లోటును, రూ.35,440.87 కోట్ల మేరకు ఆర్థిక లోటును చూపిస్తున్నవి. 1 ఏప్రిల్ 2018 నుంచి 31-3-2019 మధ్య కాలంలో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తిలో వరుసగా 1.51%, 3.86% గా ఉన్నాయి.

సవరించిన అంచనాలు 2019-20

108. సవరించిన అంచనాలు ప్రకారం రెవెన్యూ వ్యయం రూ.1,37,518.07 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.12,845.49 కోట్లు. 2019-20 సంవత్సరానికి రెవెన్యూ లోటు దాదాపుగా రూ.26,646.92 కోట్లు, అదే కాలానికి ఆర్థిక లోటు దాదాపుగా రూ.40,493.46 కోట్లు. ఇవి రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తిలో 2.47%, 3.75% గా ఉన్నాయి.

బడ్జెటు అంచనాలు 2020-21

109. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను నేను రూ.2,24,789.18 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,80,392.65 గా అంచనా వేయడం జరిగింది. ఋణాల చెల్లింపులు, ఇతర కాపిటల్ చెల్లింపుల తో కూడిన క్యాపిటల్ వ్యయం రూ. 44,396.54 అంచనా వేయడం జరిగింది.

40