పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

అష్టాంగయోగసారము

ధౌతికర్మ

గీ. వినుము మృదువస్త్ర మొకనాల్గువ్రేళ్ళవెలుపు
    పొసగఁ బదునైదు హస్తాలపొడవు గలిగి
    నట్టి వస్త్రంబు తేటనీళ్ళందుఁ దడిపి
    మెల్లమెల్లగ లోనికి మ్రింగవలయు.
సీ. అటు మింగ్రి యీవల నతివేగమునఁ దీసి
        యటమీఁద వింశతిహస్తసంఖ్య
    గల వస్త్రమును మెల్లగా దిగమ్రింగుచుఁ
        దీయుచు నుండగా దీపనంబు
    గలుగు నపానము గంఠనాళముగుండ
        వెడలింపఁ బైత్యంబు వెడలిపోవు
    నది యభ్యసింపగా నక్షిరోగములు కా
        నశ్వాసముఖరోగచయము లణఁగు
గీ. గురుముఖంబున నీ మర్మ మరసి ధౌతి
    గజకరణి యన నొప్పు నీకర్మ మొనర
    నభ్యసింపఁగ వాయువు లన్ని తనకు
    వశములై నిల్చుచుండు నో వారిజాక్షి.
వ. ఇక వస్తికర్మం బెట్లన్నను.

వస్తికర్మము

నాభిపర్యంతంబు నీళ్ళయందుఁ జొచ్చి యధోద్వారమందు క్రోవి నుంచి కుక్కుటాసనస్థుండై కూర్చుండి యపానవాయువుచేతను జలమును మీదికి నెగయఁబీల్చి తిరిగి యధోద్వారముగుండా ఆజలమును విడుచుచున్న నిది వస్తికర్మ మనఁబడును. దీనివలన శూలలు, గడ్డలు,