పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్యక్తిగా రాజేంద్రగారు మితభాషి. చేస్తున్న వనిపైన గౌరవమూ, చిత్తశుద్దీవున్న గొవ్చ మానవుడు. సీతులనూ, అదర్శాలూనూ వల్లించకుండా నీతిగా ఆదర్శంగా యెలా జీవించాలో అలాజీవించినవాడు. నిరాడంబరత, ఆత్మస్థైర్యం ఆయన సహజగుణాలు. కర్మయోగిగా తన వనిని తాను నిష్కామకర్మగా చేసుకుపోయాదు.

వేయగలిగేవారు. వార పత్రికలకు కావలసిన నాణ్యతవున్న రచనల్ని కనిపెట్టగలిగేవారు.

“ఇండియాటుడే” వాళ్ళు తెలుగులో పత్రికను ప్రారంభిస్తూ దానికి రాజేంద్రగారినీ సంపాదకుడుగా తీసుకోవడం ఆధునిక సాహిత్య చరిత్రలో పెద్దమార్పుకు నాంది పలికింది. పూర్తిగా రాజకీయ విషయాలకే ప్రాముఖ్యతనిచ్చే ఇండియాటుడే పత్రికను గొప్ప సాహిత్య సాంన్కృతిక వారవత్రికగా ఆయన తీర్చిదిద్దారు. అనేళ సాంన్కృతికాంశాలూ, యాత్రా కథనాలూ, పుస్తకవిమర్శలూ, వైజ్ఞానికరచనలతో ఆయన ఆ పత్రికను తెలుగువారి “ఇలప్టేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా” అంత గొప్పగా తీర్చిదిద్దారు.

ప్రతి సంవత్సరమూ వార్షిక ప్రత్యేక సంచికలు తీసుకొచ్చే సత్సంప్రదాయానికి రాజేంద్రగారు మరిన్ని వన్నెచెన్నెలు చేకూర్చి “ఇండియాటుడే” వార్షిక సంచికలను ఆంధ్రపత్రిక ఉగాదిప్రత్యేక సంచికల స్థాయికి తీసుకొచ్చారు. ఇండియాటుడే వార్షిక సంచికలలో జరిగిన సాహిత్య చర్చలూ, విశేషకథనాలు అంతకుమునుపెన్నడూ జరగలేదు. ఆ తరువాత యెప్పుడూ జరగలేదు.

“కథానీక” (ప్రక్రియకు ఇండియాటుడే గొప్ప ఆలంబనగా తయారయ్యింది. ప్రతి సంచికలో వచ్చిన కథా దేనికదే ప్రత్యేకంగా విశిష్టంగా వుండేది. “ఇండియాటుదేలో వచ్చిన కథానికలతో ఒక సంకలనం తీసుకొస్తే అది తెలుగుకథ అందుకున్న గొప్ప శిఖరాలనంతా చేర్చిన గొవ్చ సంకలనమవుతుంది. తెలుగు పత్రికారంగ చరిత్రలో రాజేంద్రగారి సంపాదకత్వంలో వెలువడిన ఇండియాటుడేలా నీండుగా గొప్పగా రూపొందిన పత్రికలు మరో రెండుమూడయినా లేవు. ఆయన సంపాదకుడుగా వున్నప్పుడు ఆ పత్రిక సర్ములేషన్‌ అరవైవేలను దాటిందని తెలిసింది. రాజేంద్రగారి తర్వాత ఆయన మార్గంలోనే “రాజళశుక”గగారు ఆ వటత్రికను విజయవంతంగా నడిపారు.

“ఇండియాటుడే” పత్రిక ప్రాచుర్యం తగ్గడం దానిలో “కథానిక వచురణను ఆవడంతోనే (ప్రారంభమయ్యింది. _కమంగా ఇండియాటుడే ఆగిపోవడాన్ని గమనించి తెలుగు సాహిత్యాన్ని చిన్నచూపుచూసే పత్రికలన్నీ గుణపాఠాన్ని నేర్చుకోవాలి.

1972 ప్రాంతంలో రాజేంద్రగారు స్వంతంగా "పొలికేక అనే వారవ(తిళకనూ, “జ్యోత్స్న? అనే మానవథత్రికనూ నడిపారు. మూడునాలుగేళ్ళపాటూ ఆ పత్రికలు గొప్పగా వెలువడ్డాయి. అయితే వాణిజ్యదృక్పథమసలులేని రాజేంద్రగారు ఆ పత్రికలనాతర్వాత ఆపేసి మూర్తిగా సంపాదకుడిగానే మిగిలిపోయారు. దినవ(త్రిళకల సంపాదకుడిగా ఆయన (ప్రాపంచికానుభవాన్ని గురించీ, రాజకీయ పరిస్థితుల అవగాహనను గురించీ ఆయన సహసంపాదకులంతా గుర్తు చేసుకుంటూ వుంటారు. కథానికా పక్రియకు ఆయన చేసిన

మేలును తెలుగు కథకులంతా గొప్పగా చెప్పుకుంటూ వుంటారు.

వ్యక్తిగా రాజేంద్రగారు మితభాషి. చేస్తున్న పనిపైన గౌరవమూ, చిత్తశుద్దీ వున్న గొప్ప మానవుడు. నీతులనూ, ఆదర్భాలనూ వల్లించకుండా. నీతిగా ఆదర్శంగా యెలా జీవించాలో అలాజీవించినవాడు. నిఠరాదంబరత, ఆత్మస్టైర్యం ఆయన సహజగుణాలు. “దేనినీ మనసులో వుంచుకోగూదదు. క్షమించేస్తూ ముందుకు పోవాలొ అనీ ఆయన అనేవారట!

హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు “మా తెలుగుతల్లికి మల్లెపూదండ” పాటరాసిన శంకరంబాడి సుందరాచారి గారికి జరిగిన సన్మానం సంగతి అందరికీ తెలుసు. ఆ పాటరాసిందినేనే! నన్ను లోవలికి వెళ్ళనీవ్వండి” అని మొరబెట్టుకున్న బక్కపలచటి మనిషిని తయవకూ పట్టించుకోలేదు. చిత్తూరుజిల్లా వాని అయిన రాజేంద్రగారే ముందుగా ఆయనను గుర్తుపట్టి, ఆయనతో తనకున్న వ్యక్తిగత పరిచయాన్ని జ్ఞాపకం చేసుకుని ముఖ్యమంత్రికి తానే ఆ సమాచారాన్ని చేరవేశాననీ, ఆ తరువాతే శంకరంబాడి సుందరాచారిగారికి సముచితమైన సన్మానం జరిగిందనీ వో పాత్రికేయ మిత్రుడు యిటీవలే రాశారు.

రాజేంద్రగారితో దశాబ్దాలపాటూ పరిచయమున్న మిత్రులకు కూడా ఆయన కులమేమిటో తెలియదు. యెప్పుడో ఆయన వూరినుంచీ ఆయన అన్నగారు చేసిన ఫోన్‌ను ముందుగా అందుకున్న ఆయన మిత్రుదొాకరు ఆయనకు ఆనందం కలుగుతుందేమోనని “రాజేంద్రరెడ్డిగారూ! మీ అన్నగారు ఫోన్‌చేశారు” అన్నారట! ఆమాట వింటూనే తుఫానులా విరుచుకపడిన రాజేంద్రగారు “కులంపేరు వాడుతారా? యిదేం దుర్మార్గం?” అని చీవాట్లేశారట! ఆయన తన “ఆధార్‌” కార్టులోనూ కులానికి (ప్రాధాన్యత నివ్వకుండా తండ్రి పేరులోని కులవాచకాన్ని కావాలని లేకుండా చేసి “గోవిందయ్య?” అనీ రాయించారట! “పురుషులందు పుణ్యపురుషులు వేరయా!” అని వేమన మాటను గుర్తుకుతెచ్చే విషయమిది.

క్షమాగుణం, మనోనిబ్బరం అనే గొప్ప బైరాగుల లక్షణాలు రాజేంద్రగారిలో సహజాతాలు. “వేదభూమి” అని పిలిచే చిత్తూరు జిల్లాకు చెందిన తాందనాదులో వాళప్పుడు ప్రాపంచిక విషయాన్ని పట్టించుకోకుండా తిరిగే ఖైరాగులు విరివిగా కనిపించేవాళ్ళు. రాజేంద్ర గారు పత్రికారంగంలోనూ తామరాకుపైన నీటిబొట్టులా జీవించాడు. కర్మయోగిగా తన వనిని తాను నిష్కామకర్మగా చేసుకుపోయాదడు. లౌకిక సంపదలనూ, పేరు ప్రఖ్య్వాతులనూ పట్టించుకోకుండా తన పనిని తాను చిత్తశుద్దితో చేసి, పని పూర్తవగానే మౌనంగా తప్పుకున్నాడు.

అయన చేసిన పనులపైన ఆయన పేరు కనిపించకపోయినా, వాటి ప్రభావాలు మాత్రం ప్రపంచపు సౌమనస్య సంగీతంతో మృదుమధురంగా శృతి కలుపుతూ కలసిపోయాయి.

విద్యాబోధన, పరిపాలన - ప్రజల భాషలో జరిపిన దేశాలే అభివృద్ద్ధిమార్గంలో త్వరగా ముందుకు సాగుతాయి

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |