పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"శదాంజలి అక ఎ

కణుగుల

ఉత్తమ చదువరి, వీమర్శకుడదు, సాహితీ ప్రియుడు, సమాజ హితాన్ని కోరి నిజాయితీగా నిబద్ధతతో జీవించిన వ్యక్తి ఆదర్శపౌరుడు, “నడుస్తున్న చరిత్రా “అమ్మనుడి | పత్రికల | శ్రేయోభిలాషి | కణుగుల | వేంకటరావుగారు తొంబదేళ్ల వయస్సులో కనుమరుగయ్యారు. ఆయన గురించి సన్నిహిత మిత్రుడు దా॥ అల్లంళెట్టి చంద్రశేఖరరావుగారు క్లుప్తంగా ఇలా తెలియజేశారు: జ. కణుగుల వేంకటరావు గారు 1931 నవంబరు 7వ తేదీన భ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ [గ్రామంలో జన్మించారు. విజయనగరంలో బి.కాం. డిగ్రీ చదివారు. అప్పుడే అతనికి ఎందరో సాహితీవేత్తలతో పరిచయాలు కలిగాయి. తెలుగుసాహిత్యం పై అభిమానం పెరిగింది. సాహిత్యసమావేశాలలో పాల్గొనేవారు. సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌గా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో పనిచేసి 1991లో పదవీ విరమణ అనంతరం శీకాకుళంలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. పుస్తక సేకరణ, పుస్తక పఠనం అతనీ దైనందిన జీవితంలో ఒక భాగం. ఈ అలవాటు అతనికి విద్యార్థి దశ నుంది వుంది.

(శీకాకుళంలో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా వెళ్ళేవారు. సవర భాషా సంఘం శ్రీకాకుళంలోని గిరిజన విద్యార్థి వసతి గృహాలలో నిర్వహిస్తున్న గిడుగు రామమూర్తి జయంతి, వర్థంతి ఉత్సవాలలో సంఖు కార్యదర్శి తా అల్లం సెట్టి చం(్రశేఖరరావుతో కలిసి పాల్గొనేవారు. సనవరలు తము మాతృభాషలో రాసుకోవాలని బోధించేవారు. సవరలను అక్షరాస్యులను చేయదం కోసం రామమూర్తిగారు చేసిన కృషిని వివరించారు. అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న సమావేశాలలో వేంకటరావు గారు మాతృభాషాదినోత్సవం గురించి ఒక వ్యాసం రాసి వినీపించారు.

వేంకటరావుగారు 2002 నుండి 2004 వరకు రెండు సంవత్సరాలు చెన్నైలో వుండవలసి వచ్చింది. ఆ కాలంలో ప్రతీదినం అడయారు లైబ్రరీకి వెళ్ళి పాత పత్రికలలోని ముఖ్యమైన విషయాలను



వేంకటరావుగారు కనుమరుగు

రాసుకొనేవారు. జిరాక్సు కాపీలను తీసుకొనేవారు. చాలా జిరాక్సు కాపీలను (శ్రీకాకుళంలోని కథా నిలయానికి అందించారు. అప్పుడే గిడుగు సీతాపతిగారు సవర పాటల పై రాసిన వ్యాసాల కాపీలను సవర భాషా సంఘ కార్యదర్శికి బహూకరించారు. సీతాపతిగారు సవర పాటలకు చేసిన అనువాదం మూలంతో సహా 'సవర బులిటిన్‌” లో ప్రచురించడం జరిగింది.

2005లో వేంకటరావుగారు సవర భాషా సంఘ అధ్యక్షులయారు. గిడుగు రామమూర్తిగారు సోర మాన్యుయల్‌, సోర -ఇంగ్లీష్‌- డిక్షణదీలకు రానిన ముందు మాటలకు అనువాద బాధ్యతను చేపట్టారు. అనువాదం కోసం ఖాషాశా(్తానీకి సంబంధించిన విషయాలు తెలుసుకొన్నారు. సాంకేతిక పదాలకు అనువాదాలు సేకరించారు. అంతర్జాతీయ ధ్వనిలిపిని నేర్చుకొన్నారు. ఈ అనువాదాన్ని “గిడుగు రామ్మూర్తిగారి ముందు మాటలూ అన్న పేరుతో సవర భాషాసంఘం 2007లో ప్రచురించింది. 2012 లో గిడుగు రామమూర్తిగారి 150వ జయంతి సందర్భంగా ప్రారంభ సమావేశం గిడుగువారు పనిచేసిన కళాశాలలో జరిపిస్తే బాగుంటుందని కళాశాల ప్రిన్సీపాల్‌ గారిని సవరభాషా సంఘంవారు అభ్యర్దించగా వారు పర్తాకిమిడిలో కృష్ణవంద్ర గజపతి కళాశాలలో ఆగస్టు 29, 30, రెండు రోజులు యు.జి.సి. నేషనల్‌ సెమినార్‌ నిర్వహించారు. అందులో ౧౭|44600640౧01 ఇ6 616486 గజం జు4గ/ అన్న విషయం పై వేంకటరావుగారు పత్ర సమర్పణ చేశారు. కవేరా కలం - కాలం అన్న సంకలనంలో ఇవన్నీ వున్నాయి. వేంకటరావుగారి రచనా సంకలనం 2017లో వెలువడింది.

వేంకటరావుగారు మంచి సాపొత్యాఖి మాని. కేవలం సాహిత్యాఖిమాని అనుకాంటే పొరపాటే. కాళీపట్నం రామారావు మాస్టరుగారిచేతికందని కథలు గూడ సేకరించి కథా నిలయానికి బహూకరించారు. కథా నిలయం అభివృద్ధికి 20 వేల రూపాయిలు విరాళంగా ఇచ్చారు.

వేంకటరావుగారు ఉత్తమ విమర్శకులు. వారు పుస్తక సమీక్షలు చేసేటప్పుడు పుస్తకాన్ని కూలంకషంగా చదివి నిర్మాగమాటంగా, సాధికారికంగా విమర్శించేవారు. వేంకటరావుగారి ప్రత్యేకత ఏమిటంటే అసాధారణమైన జ్ఞాపకశక్తి. పత్రికలలోని వ్యాసాలను చదివేటప్పుడు ఏకాగ్రతతో (శద్టగా చదివేవారు. ఎక్కడైనా రచయిత తప్పు రాస్తే దానీని వెంటనే రాసుకొని తనదగ్గర ఉన్న పుస్తకాలు వెదికి గానీ లేదా పాత విషయాలు మననం చేసుకొని గానీ ఆ తప్పును ఆ వ్యాస రచయితకు లేదా ఆ పత్రికా సంపాదకునీకి లేఖ రాస్తూ తెలియజేయడం అతనీ అలవాటు. తప్పును సాధికారికంగా నిరూపిస్తూ సనైన పాఠం అందించేవారు. 17-6-2021 తేదీ గురువారం ఉదయం సొంత ఇంటిలో వేడి వేడి కాఫీ తాగి లోకానికి వీడ్కోలు చెప్పేశారు. ....... ఆ ఆదర్శమూర్తికి మా (తద్దాంజలి.

- దా॥ అల్లంసెట్టి చంద్రశఖరరావు. 99496 05141


0౪196, 0౧1116 & 0౮01|9%166 %/ తిజంజ& [జంగ దఖటుం (9440448244) 2౫౮6 ౧౧౧166 4 3॥/ జజ జంగం! ౦గఅ ౧౧౧1౪౩, 16-7-20, 69/౬4 [౧౬౩౧ ఖగ! ౮ 56991 5%జ&06 4248, 16%8౫!, ఆంగ 0౪ &గ౧6 ౧౮౦19166 10౧) 8-386, ఆ౨|౪౬|(4 8౧ఖ/8, శిగంర్రజ జంరం/04 ౧౦౪ 612౫! గ జంజ, 660౧10 050 - 522211. ౬610: 0. 34%ీ%ిఉ ౧4గ1౬3.1 8480 (9848016136), ౫గ౧||-4౧౫౬౬/2015/62362