పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కథను శ్వాసించిన "కారా? మేస్తారు

ఆయన ఒక సాధారణ ఉపాధ్యాయుడు. కానీ అసాధారణమైన

పనులు చేశాడు. ఆయన రాసిన కథల సంఖ్య తక్కువే. కానీ తెలుగు

కథకే దిక్సూచిగా సేరు పొందాడు. 97 ఏళ్ల పాటు సంపూర్ణంగా

జీవించిన కాళీపట్నం రామారావు మేస్టారు ఈ ఏడాది జూన్‌ 4న

వెళ్లిపోయారు. ఆయన గురుతుగా శ్రీకాకుళంలో కథానిలయం తెలుగు

సాహిత్యప్రపంచానికి గొప్ప కానుకగా మిగిలిపోయింది. శ్రీకాకుళం

జిల్లా లావేరు మండలానికి చెందిన మురపాకలో 1924లో నవంబరు

9న ఆయన జన్మించాడు. ఎస్‌ఎస్‌ఎల్‌సి దాకా శీకాకుళంలో చదువుకున్న

ఆయన ఖీమిలీలో ఉపాధ్యాయ శిక్షణ పొందాడు. తొలుత చిన్నా చితకా

పనులేవే చేసినా 1948 నుంచి 1972 దాకా ఉపాధ్యాయుడిగా

పనిచేశారు. 19 ఏళ్ల వయసు నుంచే ఆయన రచనా వ్యాసంగం

మొదలైంది. తీర్చు, ఆర్హి భయం, చావు, హింస, నో రూం, శాంతి,

జీవధార, వీరడు మహావీరుడు వంటి కథలు రాసినా “యజ్ఞం”

కథారచయితగానే ఎక్కువగా ఆయన అందరికీ పరిచయమయ్యారు.

1966లో రాసిన ఈ కథ తెలుగు కథా సాహిత్య చరిత్రలోనే ఒక సంచలనంగా పేరు పొందింది. రంగనాయకమ్మ ఈ కథ మీడ

తుపానులా విరుచుకుపడ్డప్పుడు పెద్ద దుమారమే రేగింది. వేలాది పేజీల చర్చ “యజ్ఞం” అనే ఒక కథ మీద జరగడం అరుదైన

విశేషం. ఈ పెద్ద కథ మీద చర్చలే ర0డు పుస్తకాలుగా వెలువడ్డాయి. భూస్వామ్యం, దళారీ వ్యవస్థ, దోపిడీలను పటంగట్టి

చూపించిన ఈ కథలో ముగింపు మీడే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అనేక భారతీయ భాషలతో పాటూ ఇంగ్లీషు, రష్యా భాషల్లోకి

కూడా ఈ కథ అనువాదం అయ్యింది. 1995లో యజ్ఞంకి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. నిజానికి అంతకు కొన్నేళ్ల

ముండు ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడెమీ అవార్డును ప్రకటించినా విప్లవ రచయితగా ప్రభుత్వ విధానాల పట్ల నిరసన ప్రకటిస్తూ

దానిని తిరస్మరించారు. ఒక బృహత్తర ఆలోచనతో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును స్వీకరించిన ఆయన ఆ పారితోషికంతో

(భీకాకుళంలో కథానిలయం నిర్మాణం ప్రారంభించారు. గురజాడ “దిద్దుబాటు కథ వెలువడిన ఫిబ్రవరి 22న 1997లో కథానిలయం

మొదలైంది. పుట్టిన నాటి నుంచీ ప్రతి తెలుగు కథనూ ఇక్కడ భద్రపరచాలన్నది కారా మేస్టారి లక్ష్యం. ఇందుకోసం భుజానికి

ఒక జోల తగిలించుకుని ఆయన ఊళ్లు తిరిగేవారు. రచయితలను కలిసి వారి కథలు సేకరించేవారు. ఏ ఊరికి వెళ్లినా గోతాల

నిండా పాత కాయితాలు మోసుకు తెచ్చేవారు. ఉపాధ్యాయుడిగా ఆయన పదవీవిరమణ తీసుకున్నాక కథానిలయమే ఆయన

ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. "సేకరించిన కథలను పొందికగా అమర్చడం, కేటలాగులు తయారు చేయడం, దొరకని

కథల కోసం వెతుకులాడడం... రచనా వ్యాసంగం కన్నా ఈ పనిలోనే కారా మేస్టారు పూర్తిగా మునిగిపోయారు. లక్షకు పైగా

కథలు కథానిలయంలో పోగయ్యాయి. దాదాపు వెయ్యి పత్రికల వివరాలు ఇక్కడ లభిస్తాయి. మూడు వేలకు పైగా కథా

సంపుటాలు కథానిలయంలో ఉన్నాయి. వెయ్యి మంది రచయితల వివరాలు లభిస్తాయి. తెలుగుకథకు ఒక ఖజానాగా కథానిలయం

మారిపోయింది. పుస్తకాలు పెరిగేకొద్ది అలమారాల అవసరం పెరిగింది. భవనం విస్తరించాల్సి వచ్చింది. వందలాది మంది

అభిమానుల సహాయ సహకారాలతో ఒక యజ్ఞంలా కారామేస్టారు కథానిలయం నిర్వహించారు. ఒక సాహిత్య ప్రక్రియ కోసమే

ఇంత పెద్ద (గ్రంథాలయం ఏర్చడడం ప్రపంచంలోనే అరుదైన అద్భుతం. కథానిలయంను ఆథునిక అవసరాలకు అనుగుణంగా

డిజిటలీకరణ చేశారు. కథానిలయం డాట్‌ కామ్‌ అని కొడితే చాలు కథానిలయంలోని సమాచారం ఎవరైనా చూడవచ్చు.

హక్కుల వివాదం లేని వేలాది కథలు పీడీఎఫ్‌లుగా ఇక్కడ లభిస్తాయి. తెలుగు కథల మీద పరిశోధనకు ఇదొక పెద్ద నిధి.

తెలుగుకథనే శ్వాసించి జీవించిన కాళీపట్నం రామారావు నెలకొల్చిన కథానిలయాన్ని మరింత పరిపుష్టం చేయడం ఒక్కటే ఆయనకు సాహిత్య ప్రపంచం అర్భించే నిజమైన నివాళి.