పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈమని శివనాగిరెడ్డి

గారాలాలాక అ వా 98485 98446

అదుగుజాదలు ఆనవాళ్తు-9 నా కందూరు - బూరుగుల యాత్ర

ఈసారి తెలంగాణాలో ఒక చారిత్రక ప్రదేశాన్ని చుట్టిరావాలనిపించింది. తెలంగాణాలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు! ఎక్కడికెళ్ళడం! తెలుగువారి తాలిరాజధాని కోటిలింగాల. శాతవాహనుల మలి రాజధాని కొందాపూర్‌. ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొందకు సరితూగిన ఏలేశ్వరం, విష్ణుకుండినుల రాజథానీ కీసరగుట్ట, బాదామి చాళుక్యుల సాంస్కృతిక రాజథానీ అలంపురం, రాష్ట్రకూటుల రాచకార్యాల తర్ఫీదు కేంద్రాలు, కళ్వాణ చాళుక్యుల, ఉపరాజధానులు పట్టణవెరువు, గంగాపురం, సమకాలీనంగా వేములవాడ చాళుక్యుల రాజధానులు బోధన్‌, వేములవాడ, కందూరు, చోళుల కోడూరు, పానగల్లు, రేచర్లరెన్ల పిల్లలమర్రి, కాకతీయుల రాజధానులు హనుమకొండ, వరంగల్లు, వారి సామంతులు గోనవంశపు రెట్ల రాజధాని వర్ణమానపురం, పొలవాస పాలకుల పొలాస, చెజుకురెడ్ల జలాల్‌పురం, మల్యాల వంశీయుల కొండపర్తి, విరియాల వారి కటుకూరు, రేచర్ల వెలమ (పద్మనాయకు)ల ఆమనగల్లు, రాచకొండ, దేవరకొండ... ఇలా కుతుబ్‌షాహీలు వచ్చేంతవరకూ, తెలంగాణాన్నీ ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, సామంతులు, మాందలికులు పాలించిన చారిత్రక స్థావరాలు కోకొల్లలు. అన్నీ కలిపి ఒక్కసారి నా చుట్టూ ముసురుకొన్నాయి. ఏ ఊరు వెళ్లడం, ఏ

ఊరు వెళ్లకపోవడం నిర్ణయం ఊగిసలాడుతోంది. ఊళ్ళన్నీ దోబూచులాడుతున్నాయి.

శషఖీషలమధ్య, తెలంగాణ తెలుగు చోళవంశానీకి చెందిన కందూరు చోళుల పాలనాకేంద్రం కందూరు వైపు మనసు మొగ్గుచూపింది. ప్రముఖ చారిత్రక, శాసన పరిశోధకులు శ్రీ బి.యన్‌. శాస్త్రిగారి “కందూరు చోళుల శాసనాలు చరిత్ర, సంస్కృతి” అన్న పుస్తకం గుర్తొచ్చింది. కందూరు పోవటానికే నిశ్చయించు కొన్నాను.

కందూరుకే ఎందుకెళ్లానంటే...... కావేరీనదీకీరంలోని చోళవంశీకులు, తెలుగు నేలపై సామంతరాజులుగా, వాలించటాన వారినీ తెలుగు చోదు(ళులనీ, పాలించిన రాజధానిపేరున విలిచారు. అలాంటి సామంతరాజులు కందూరు నుంచి పాలించటాన వారిని కందూరు చోళులనీ పిలిచారు. నెల్లూరు నుంచి, కొణిదెణ నుంచి, రేనాడునుంచి, పొత్తపినుంచి, పాలించటాన వారినీ ఆయా పేర్లతో పిలిచారు. కందూరు చోళులు ముందుగా కోడూరు నుంచీ తరువాత కందూరు నుంచి, కందూరు నాడు (నల్గొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాలును క్రీ.శ. 1033నుంచి క్రీ.శ. 1248 వరకూ కళ్యాణ చాళుక్య, కాకతీయులకు సామంతులుగా పాలించారు. వీరి వంశ మూలపురుషుడు ఏరువఖీముడు (క్రీ.శ. 1025-1050). తరువాత వరుసగా తొండ (క్రీ.శ 1050-1075) రెండో భీమచోడ (క్రీ.శ 1075-1090) మల్ల (క్రీ.శ. 1093-1100, ఉదయన

(కీ.శ. 1100-1104 మూడో భీమచోడుడు (క్రీ.శ1104-1125) మొదటిగోకర్ణవోడ (క్రీ.శ. 1125-1128) శ్రీదేవితాండ (క్రీ. శ. 1125-1129) రెండో ఉదయన (కీ. శ. 1136-1176) నాలుగో భీమచోడ (క్రీ. శ 1176-1235) రెండో గోకర్ణ (క్రీ.శ. 1176-1248)లు పాలించారు.

మహబూజ్‌నగర్‌ నుంచి రాయచూరు పోయేదారిలోగల కోడూరులో మొదటకాండపైన కోట కట్టుకొని పాలించారు. బస్సు, రైలులో పోయేవారికి ఇప్పటికీ ఆ కోట కనిపిస్తూ వెయ్యేళ్ల చరిత్రను చకచకా గుర్తు చేస్తుంది. కందూరులో కూడ ఒక కోట ఉంది. నేను 2001-03 మధ్య భూత్‌పూర్‌లో గోనబుద్దారెడ్డి కూతురు కుప్పాంబీక కట్టించిన రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని ఊడదీసి కట్టించినపుడు కందూరు కోటను చూశాను. చెరువు కట్టపైన ఇప్పటికీ చూడొచ్చు. బయలుదేరి షాద్‌నగర్‌ దాటేసరికి నల్లమల చేచర్‌ ఫౌందేషన్‌ అధ్యక్షుడు పట్నం కృష్ణంరాజు ఫోన్‌చేశాడు. నేను కందూరు పోతున్నానని చెప్పగానే తానూ వస్తానన్నాడు. ఆయన కొత్తూరు నుంచి రాగానే కందూరు పోవటానికి కారులో బయలుదేరాం. బాలానగర్‌కు పక్కనే ఉన్న బూరుగుల (హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారి ఊరు) గామ శివారులో ఒక గుడి శిధిలావస్థలో

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

ఉంది, చూద్దామన్నాడు. నాకు శిధిలాలంటే ఇష్టం, పదిలపరచటం మహాఇష్టం. ఎందుకంటే వాటిగురించి ప(త్రికలద్వారా తెలియజేస్తే ఎవరో ఒకదాత ముందుకొచ్చి, బాగుచేయించకపోతాడా అనీ ఒక ఆశ.

పది నిముషాల్లో బూరుగుల గుడి కెళ్ళాం. కారు దిగుతుంటేనే శిధిలాలను చూచి బాధేసింది. కేవలం గోడలు కప్పు పడిపోయి మండపంతో ఉన్న ఒక మొండి గుడి కనిపించింది. దగ్గరకెళ్లి చుట్టూ తిరిగి చూస్తే అది ఒక త్రికూటాలయమని, మూడు వైపుల గర్భాలయ, అర్జమందపాలతో ముందున గుళ్లున్న ఆనవాళ్లు, మధ్యలో చదరంగా 16 స్థంభాల రంగమందపం, నాలుగు వైపులా నాలుగు ద్వారాలు, దక్షిణం వైపు ఒక ప్రవేశద్వారం, (మిగిలిన మూడు ఆలయాల అర్జమందడప ద్వారాలు) కనీవించాయి. పశ్చిమవైపున్న ఆలయం మాత్రం, అర్ధ మండపంలో ఒక శివలింగం ప్రతిష్టించబడి, గర్భాలయ ద్వారంలో ఖైరవునీ విగ్రహముంది. గర్భాలయం పునాది ఉందిగానీ పైన రాళ్ళులేవు. మిగతా రెండు ఆలయాలు గర్భాలయ, అర్ధమండపాలను ఎవరో ఎప్పుడో వలుచుకుపోయారు. మళ్లీ బాధేసింది. ఆలయ వాస్తు, ద్వారబంధాలు 'పైనగల శిల్పాలు మండపంలోనీ నంది, శివలింగం, ఖైరవ శిల్పాలు కాకతీయవాస్తు శైలికి అద్ధం