పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గిరిజన సంప్రదాయ సాహిత్య సేకరణ, విశ్లేషణ ప్రచురణలో, చట్టాల మలులో నేదు. గిరిజనులే పాల్గొంటున్నారు. కానీ ఇది ఒంటరి సోరాటంగా సాగుతున్నది. అరకులోయలో గిరిజనాఖీవృద్దికి కృషి చేసిన కెనడా దేశస్తుడు. గుస్తాఫ్‌ ఆదివాసీ కాలచక్రం-పందుగలు పుస్తకం పాదేరు గిరిజనాఖి వృద్ది సంస్థ 78లో ప్రచురించింది. ఉభయ రాట్ర్రాల సంగమస్థలి అరకులోయ చిత్రణం మనపొరుగున ఒడిశాలోని తెగల పలుకు బదులనును అర్ధం చేసుకోటానికి, ఈ నవల ఎంతవరకూ వాటిని ఉపయోగించుకున్నది తెలుసుకునేందుకు దోహదం సాయపడుతుంది.

“కోదులు అవయవసొష్టవం కలవారు. కట్టూబట్ట వారిది ప్రత్యేకం. ఆడవారు చీరెను మోకాళ్ళు తాకేవరకు కట్టుకొని రెండుచెంగులు ముడి వేస్తారు. మరో చెంగు ఎడమ చంకకిందగా రెందు భుజాలను కలుపుతూ రొమ్ములను బీగిస్తుంది. తమను కోరుకున్న జతగాళ్ళు బహూకరించిన దువ్వెనలను, పిన్నుల నుతలలో తురుముకున్న పదుచులు మిస్‌ యూనివర్స్‌ను తలపిస్తారు.

ఓరగా ముడిచిన కోరకొప్పుకొప్పులో ముడిచిన కొమ్మ సంపెంగిపూలు, ముడిచిన జడకు బదులుగా సాగే నెమలివన్నెబీరెనిలువుటంచు, మీగాళ్ళ పైకి మెదలమీడుగాకట్టినచీర, తలమీద బరువునుదెండు చేతులెత్తి కాసుకుంటే, దారిలో ఎత్తుపల్లాలకు తగినట్లు ఊగే తనూలత-చిలుకుచీర తాకీతాకక చాటే శరీరపు వంపుల, వయ్యారినదకల కోదుపడుచుల (శమ్రైకజీవన సౌందర్యానికి ఎటువంటి సొమ్ములైనా దిగచుదుపులు

వేసవికాలంలో వచ్చే ఇటింపండుగలో పెళ్ళిళ్ళలో కోదులు/సావాతా/సామంతులు ఆదేది నెమలీ ఆట. పిల్లనగోవికి (పరోడిజతగా కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటారు.. తలకు రంగురంగుల సిల్మొగుడ్డల “తాయ్యంగాపాగా చుట్టుకుంటారు. నడుముకు నెమలీకల తోక కట్టుకుని అడతారు. “తల్లి భూబేవత, తండ్రి ఆకాశం, పుట్టించిన బమ్మదేవుడ” అంటూ పాటలతో ఆటలు మొదలౌతాయి. కుడి చేతినీ నోటికి అడ్డుపెట్టుకుని నెమలిలా అరుస్తూ గోలచేస్తారు. ఇక పెళ్ళికూతురు ఇంటిముందు దృశ్యం

కానీ రోజులు మారాయి. తళుకు బెళుకు రాళ్ళకు దూరంగా. నిక్మమైన నీలం వెతుక్కునే వారు, చదువుకుని రాసేవారు రాకపోరు.. మెరుగు పెట్టే

వార్కు ప్రసారం చేసేవారు దొరక్కపోరు.

పిల్లను ఇమ్మనీ బతిమాలి బామాలీి, పిల్ల ఇంటివాళ్ళు ఒప్పుకోకపోతే, పిల్లాడు, తలకిందులుగా నీలబడి మొత్తుకుంటాదు, పిల్లాడి తరపు వారంతా సానుభూతితో గంతులు వేస్తుంటారు. చివరకు పిల్లాడి బాథలు చూసి, పిల్లవచ్చి వాడి కాళ్ళు దింపి, పెళ్ళికి అంగీకరిస్తున్నట్లు తెలుపుతుంది. చివరకు చేతిలో రుమాళ్ళు ఎగరేస్తూ ,ఆట ఆడుతూ పిల్లను పిల్లాడి ఇంటికి తీసుకుపోతారు. దీన్ని నిలాస్వ్‌ అంటారు”..

ఇలా మన పరిశోధకులు చిత్రించిన రసవత్తర దృశ్యాలు. ఈ నవలలో కనిపించవు.

మన గిరిజన సంక్షేమంలో పనిచేసిన రచయితలు, గిరిజనులను పరీక్షలలో పాస్‌ చేసే, పథకాలు అమలు చేసే పనికి పరిమిత మైనారు. వారు కన్న కలలలో, నడిచిన దారులలో రాసే కవితలలో, చెప్పే ముచ్చట్లలో గిరిజన సంస్కృతి మీద శుష్క ప్రియాలు తప్ప, ఇంకేం విశేషాలు కనిపించవు. వీరు ముఖపుస్తకంలో ఈ నవలాపరిచయాన్ని తెగ ప్రోత్సహించారు. ఈ మధ్య గిరిజనరచయితలు వస్తున్నారు కానీ వారు చూసింది రాస్తున్నారు. ఈ సర్మారీ రచయితల ఒరవడిలో కొట్టుకుపోతున్నారు...

(గ్రామనామాల నుండి గేయగాధల దాకా భద్రపరచే జానపదపండితులున్నారు. వారికి ఆ సాహిత్యం చట్టాల అమలులో ఎలా ఉపయోగపతుందీ తెలియదు. ఇక న్యాయవాదులు వాళ్ళు చట్టాలు, తీర్పులు వల్లిస్తారు.. వారికి సంస్కృతి తెలియదు. మానవ శాస్త్రవేత్తలు ప్రాజెక్టులు తెచ్చుకోడం తప్ప గిరిజనులకు సాయపడే చదువు చెప్పటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు.. అధికారులు పథళాలు అమలు తప్ప చట్టం అమలుకు పూబీ పదరు. ఆ మెలకువలు తెలియనీ జనం మీద పెత్తనం చేస్తుంటారు.

ఈ మధ్య ఆం(ధ్రప్రదేశ్‌ప్రభుత్వం, విద్యాశాఖ ఒదిశాలో వేదాంత కంపెనీ సాయంతో నడిచే కళింగ ఇన్నీట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |



టల సంస్థ నడిపేవి ఫ్యాక్టరీ స్కూల్స్‌ అంటారు. అవి గిరిజన సంస్కృతిని కూడా బోధిస్తున్నామనటంలో ఎంత నీజం ఉందో తెలియదుకాని, ఆ చదువు నీయంగిరి సుప్రీం కోర్టు తీర్చు అమలుకావటానికి కావలసిన దేశకాల పరిజ్ఞానాన్ని మాత్రం గుర్తుచేయటంలేదు- అనేది అంతంత మాత్రంగా సాగుతున్న అమలు బట్టి స్పష్టమౌతుంది. కానీ రోజులు మారాయి. తళుకు బెళుకు రాళ్ళకు దూరంగా నీక్మమైన నీలం వెతుక్కునే వారు, చదువుకుని రాసేవారు రాకపోరు.. మెరుగు పెట్టే వారు, ప్రసారం చేసేవారు దొరక్కపోరు. మోదమ్మ కోడలు గంగు విహరించిన “పూలగందువనంి పేరుతో చింతకింది శ్రీనివాసరావు, తన మాతృభూమి చోడవరం, ఒకనాటి, మత్స్వరాజ్యం మీద భక్తితో, గిరిజనులు అల్లుకున్న గేయగాధను నవలగా రాసారు. దీన్నీ విశాఖపట్టణం ఆకాశవాణి ధారావాహికంగా ప్రసారం చేసింది విజయనగరం, గురజాడ, ఉద్యమ సాహిత్యం చుట్టూ తిరిగే, ఉత్తరాంధ్రకు మరిచిపోయిన చరిత్రను గుర్తుచేసింది. కొంతకాలానికి గిరిజనులే తమ ఒకనాటి పాటలు పాడుకుంటూ, ప్రదర్శనలిచ్చే రోజులు వస్తాయి.. పునరుజ్జీవించిన ఆ ఉత్సాహం హక్కుల పోరాటాలను మరో మలుపు తిప్పుతుంది, “ఉదరపోషణ మాత్రాన కుర్విమీద కాకి చిరకాలవబన్న ఏ కార్యమగును!”.