పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేసినారు” అనీ రాణీగారు మా తండ్రిగారిని మెచ్చుకొన్నారు. . ,

కొందరు అసూయావరులు వీరు ఇంగ్లీషు చెప్పుటకు అవలంవీంచిన పద్దతి (ప్రత్వక్ష పద్దతి) మంచిది కాదనీ పెద్దలుచేత చెప్పించారు. ((వత్యక్ష వధద్ధతిలో తరగతి గదిలో ఇంగ్లీషు భాషావాతావరణం కల్పించాలి. మాతృభాష మాట్లాడ కూడదు. చిన్న పిల్లలు సహజమైన రీతిలో వినికిడి ద్వారా మాతృభాష నేర్చుకొంటారు. పరభాష నేర్చుకోవాలంటే ముందుగా ఆ భాష వినాలి. తరవాత ఆ భాషలో పలకాలి. ఈ పద్దతి ద్వారా ప్రామాణిక భాష్క ప్రామాణిక ఉచ్చారణ విద్యార్థులకు అలవడుతుంది. విద్యార్థులు ఇంటివట్ట అభ్యాసం చేసుకోవడానికి భాషను రాసుకోవలసిన అవసరం వుంది. అందుకోసం ఫొనెటిక్‌ ప్రిష్ట నేర్చుకోవాలి) వారు చెప్పిన మాటల్లో ఫొనెటిక్‌ ప్కిష్ట ద్వారా ఇంగ్లీషు మాటలు నేర్చుట వలన పిల్లలు పెద్దవారైనప్పుడు ఎటిమలాజికల్‌ స్పెలింగ్‌ లోపాలు వారికి తప్పవన్న విషయము మాత్రము ఆమెకు నచ్చింది. మామూలు పద్దతుల ననునరించి రామమూర్తిగారు ఎందుకు ఇంగ్లీషు బోధించరాదో తెలినికొనీ తవుకు నివేదిక వంవవలనిందిగా రాణీగారు అప్పారావుగారినీ కోరారు. ఆ విషయము అప్పారావుగారు రామమూర్తిగారికి తెలియజేశారు. “నేనవలంబించిన వధ్ధతి శేష్టమయినది; ఈ పద్దతుల ననుసరించే మేము మా ఛిట్టిబాబుకు (సూర్యనారాయణ), తక్కిన పిల్లలకు ఇంగ్లీషు నేర్చినాము. కనుక ఎవజేమి చెప్పినానరే నేను పాత వద్దతులలో చెప్పను” అనీ రామమూర్తిగారు స్పష్టముగా తెలియజేశారు. రాణీగారికి కోపము వచ్చింది. “వారు పాత పద్దతులలో చెప్పవలెననీ నా యాజ్జు అది పాటించకపోతే ఈ మాసమునుండి వారి ఉద్యోగము మాకక్మరలేదూ అని రాణీగారు 21 వ తేదీని తెలియజేశారు. అది విని “అంతవరకూ వేచిఉండనక్కర లేద్యు నేనీనాడే పని విడిచి పెట్టుకాంటున్నాను. ” అనీ మా తండ్రిగారు తెలియజేశారు.

రావమవూర్తిగారు విజయనగరం రాజావారి వీల్లలకు ఆధునికమైన ప్రత్యక్ష పద్దతిలో ఇంగ్లీషు నేర్పడానికి ప్రయత్నించారు. మనకంటే రామమూర్తిగారు ఎంతో ముందున్నారు. ఈనాటికీ మనం అతనిని అందుకోలేకపోతున్నాం.

అమెరికాలోని హవాయీ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రంలో ప్రొఫెసర్‌గా వున్న స్టాన్లీ స్టరోస్టా సవర భాషమీద పరిశోధన చేసి 1967 లో దాక్టరేటు పట్టా పొందారు. స్టరోస్టా తన సిద్ధాంత (గ్రంథాన్ని రామమూర్తిగారికి అంకితం ఇస్తూ గురువు, మానవచావాది, ముందా లింగ్విస్టిక్స్‌లో మొట్టమొదటి పరిశోధకుడు అని శ్హాఘించాడు.

తెలుగువారు రామమూర్తిగారినీ వ్యావహారిక భాషావాదిగానే చూస్తున్నారు గాని ఆయన అంతరంగాన్ని చూడలేకపోయారు. స్టరోష్టా అన్నట్టు రామమూర్తిగారు గురువు. సవరలకు వారి భాషలోనే విద్య నేర్పాలని వాచకాలు నీఘంటువులు రాసి, సొంత డబ్బుతో సవర పాఠశాలలు నడిపిన మానవతావాది. పేదవాళ్ళనీ, పిల్లలనీ, స్తీలనీ విద్యావంతులను చెయ్యాలంటే వారికి అర్థం అయే భాషలోనే రాయాలన్నది రామమూర్తిగారి అభిప్రాయం. అందుకే ఆయన

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

వ్యావహారిక భాషావాది అయ్యారు. తెలుగు యువరచయితలకు వెన్నువన్నుగా బాలకవి శరణ్యం రభించారు. వ్యావహారిక భాషలో రాయడాన్ని అడ్డుకొంటున్న పండిత ఖిషక్కుల ఖాషాభేషజాన్ని బట్టబయలు చేశారు. వచన రచనా మార్గంలో పండితులు వేసిన ముళ్ళ కంపలను తొలిగించి మార్దాన్నీ సుగమం చేశారు. గిడుగు రామమూర్తి విద్యను ప్రజాపరంచేసిన సమరయోధుడు.

రామమూర్తిగారు తాను హేతువాదినని ఎక్కడా చెప్పుకోలేదు. తాను మానవతావాదినని వేదికలెక్కి ఉపన్వాసాలివ్వలేదు. అతను మూర్తిభవించిన మానవత్వం.

అంభ్యవదేశ్‌ గిరిజన విశ్వవిద్యాలయానికి గిడుగం రానుమూర్తిగారి పేరు పెట్టడం ఉచితమని నా అభిప్రాయం. తన పేరు వద్దని వారించడానికి ఆయన మన మధ్య లేరు కదా. భయం లేదు.

మట్టిదుఃఖం

మాటలతోనో.. మతం ఆసరాతోనో అపరాధాన్ని కప్పిపుచ్చుకుంటాడు ఆయుధాలిన్ని అందిస్తున్నా నినాదాల పూలన్ని పూయిస్తున్నా ఆకలిచావులంత సునాయాసంగా చీకటి కనురెప్పల కొమ్మల్లోంచి మృణ్మయాణువులకు మించిపోతున్నాడు

పట్టుచిక్కని పిరికిపాటలా అన్నవ(స్తాలు అందని ఆకాశమౌతున్నాడు

అంటురోగ అనారోగ్యాల అబద్ధపు వాగ్భానమౌతున్నాడు అసంతృప్త సముద్రమై విద్రోహాగ్నికి ఆజ్యమౌతున్నాడు (ప్రాణవాయువు వెలిసిపోతే రెక్కళ్లెని గాలిపాటవుతున్నాడు చివరి చూపుకు చిక్కకుండా ఛిద్రమయే కన్నీటి చప్పుదవుతున్నాడు భూమిదుఃఖాన్ని ఉప్పెనచేసి విశాలఛత్రాన్ని చీలికలు చేసి మరో (గ్రహాన్ని వెదుక్కుంటున్నాడు

జనాభా పెరుగుదలను చూస్తూ... - డా. సి. భవానీదేవి 9866847000