పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శూద్రులు బొట్టు పెట్టుకోకూడదా? అన్నారు. రామమూర్తిగారికి కులాల మతాల పట్టింపులు లేవు. అతని జీవితంలో వాటికి ప్రాముఖ్యత లేదు. సవరలది ఏ కులం? ఏ మతం? రామమూర్తి గారు జాను కుల మతాలకు అటీతుడనని ఎవరితోనూ చెప్పలేదు. ప్రచారం చేసుకోలేదు.

రామమూర్తిగారికి జ్యోతిష్యం మీద అసలు నమ్మకం లేదు, సీతాపతిగారికి 1900 సంవత్సరంలో 16 వ ఏట జాతకాలు చూడకుండా వివాహం జరిపించారు. వివాహమైన 168 వ రోజున సీతాపతిగారి భార్య విషజ్వరమొచ్చి చనిపోయింది. రామమూర్తిగారి స్నేహితుడైన మామిడన్నం కుమారస్వామిగారు వివాహానికి ముందు సీతాపతిగారి జాతకం తనకు చూపించి వుంటే బాగుందేది అన్నారట. రామమూర్తిగారు సీతాపతిగారి జాతకం ఇచ్చి “ఇప్పుడు చెప్పు! సీతాపతి జాతకంలో ద్వితీయ కళత్ర యోగం వుందేమో” అన్నారట. కువాూరస్వామీగారు జాతకం చూని “ఉంది” అన్నారట. “అలాంటమవమృ్బడు ఈ దుర్చటటన ఎలా తమృ్బతుంది.” అనీ రామమూర్తిగారు అన్నారట. ఈ విషయం గూడ 'ఇద్దరూ ఇద్దరే- గిడుగు విదుగులు-కళా ప్రపూర్జులు” అన్న పుస్తకంలో వుంది.

రామమూర్తిగారు సమాజంలోని మిధ్యా ప్రమాణాలను నిరసించారు. భర్త మరణించిన స్త్రీలు మళ్ళీ పెళ్ళి చేసుకోవడం శాస్త్ర సమ్మతమేనని నిరూపించిన బంకుపల్లి మల్లయ్య శాస్త్రిగారి కంవార్తె వృనర్వివావోనికి రావమువబార్తిగారు కన్యాదాతగా వ్యవహరించారు. 1908 లో గౌతమి కోకిల, వేదుల సత్యనారాయణ గారితో వివాహం జరిగింది. కులంవాళ్ళు వారిని వెలివేశారు.

రామమూర్తిగారు చలించలేదు. కొన్నాళ్ళకు వాళ్ళే దిగివచ్చారు. ఈ సంఘటనతో సనాతన వాదుల పునాదులు కదిలిపోయాయి.

1808 లో రామవమూర్తిగారి శిష్యుడు కన్నేవల్లి వెంకట నరసింహంగారు ఇంగ్లండులో బారిస్టర్‌ పట్టా పుచ్చుకొని వచ్చారు. వారి గౌరవార్థం రామమూర్తిగారు విందు చేశారు. నముద్ర ప్రయాణం చేసినవారు తిరిగి వచ్చాక ప్రాయశ్చిత్తం చేసుకొని శుద్దికావాలి. నరసింహం గారు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. నరసింహంగారితో సహపంక్తిలో భోజనం చేసినందుకు కులంవాళ్ళు రామమూర్తి గారిని వెలివేశారు. వెలి ఎత్తివేయాలంటే కాశీ తీర్థం పుచ్చుకొని వన నంతర్పణ చెయ్యాలన్నారు. రామమూర్తిగారు అంగీకరించలేదు. కొన్నాళ్ళకు రామమూర్తిగారి మీద వెలి అదే తొలిగి పోయింది.

గిడుగు రామమూర్తిగారు తాను నమ్మిన సిద్ధాంజాలకు కట్టుబడే మనిషి. అతనిది రాజీలేని ధోరణి. అయిజే అతని నమ్మకాలు మూధవిశ్వాసాలు కావు. అనుభవపూర్వకంగా, ప్రయోగాలద్వారా తెలుసుకున్న సత్యాలు. వారు తాను తెలుసుకొన్న పద్ధతులు ప్రజోపయోగం కోసం వినియోగించాలనే తపనగలవారు. సిద్దాంతాల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఎంతటివారినైనా ఎదిరిస్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందుచేతనే

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

విజయనగరం మహారాజావారి కొలువులో ఇమడలేక ఉద్యోగం పోగొట్టుకున్నారు. గిడుగు రామమూర్తిగారి జీవితంలో ఇది ఒక ముఖ్యమైన సంఘటన. దీని గురించి 29 ఆగస్టు 1963 నాడు హైదరాబాదు నగరములో జరిగిన సాహిత్యోపన్వాసాలలో జి. వి. సీతాపతిగారు ఈ విధంగా చెప్పారు.

“1919 జనవరి లో మా తండ్రిగారి జీవితంలో ఒక సంఘటన తలవనీ తలంపుగా ఒక మార్పు కలిగించినది. విజయనగరం మహారాజావారి రెండవ కుమారునికి (సర్‌ విజ్ఞి, కుమారికి, ట్యూటర్‌ పదవి వారికి లభించినది. ఆ దినములలో నా కడపటి తమ్ముడు సూర్యనాయణ 11 ఏంద్లవాడు తరుచుగా మా తండ్రిగారితో కలిసి కోటలోకి వెళ్ళి మా తండ్రిగారు పిల్లలకు పాఠములు చేస్తూవుంటే వారికి దగ్గరగా కూర్చుంటూ వుండేవాడు. అప్పటికి వాడు ఇంగ్లీషులో చిన్న చిన్న ప్రసంగాలు చేయగలుగుతూ ఉండేవాడు. అతనిని గూడ తన పిల్లల వలె రాణీగారు ఆదరించేవారు. (కారణం అతని ఇంగ్లీషు త్రసంగాలు, ఇంగ్లీషు ఉచ్చారణ.) ఆ అబ్బాయిని రాణీగారు చేరదీయడము, మా తండ్రిగారిని ఎక్కువగా ఆదరిస్తూ ఉండడమూ చూచి కొందరు ఓర్వలేక పోయినారు. ఆమెకు మాతండ్రిగారి మీద కోపము కలిగించడానికి తగిన సమయము కోసము ఎదురుచూస్తూ ఉందేవారు. రాజువారు అప్పుడప్పుడూ రాత్రులందు కోటలో సంగీత కచేరీలు సమావేశపరుస్తూ వుండేవారు. ఆ కచేరీలకు నలుగురుతో పాటు మా తండ్రిగారిని కూడ ఆహ్వానిస్తూ వుండేవారు. వీరు ఏదో సాకు చెప్పి తప్పించుకుంటూ వుందేవారు. ఒకసారి వెళ్ళక తప్పినది కాదు. సభాసదులందరును నేలపై పరచిన తీవాసీలపై కూర్చున్న తరువాత రాజువారు వేంచేసి ఒక సోఫాలో కూర్చున్నారు. వారితో వచ్చిన వేశ్య వారి పక్మన సోఫాలో కూర్చున్నది. మా తండ్రిగారు ముప్పదేంద్ల నుండి సాని మేళాలు చూడరాదన్న దీక్ష వహించినవారు. కనుక ఈ దృశ్యము చూసి అక్కడ కూర్చుండుటకు ఇష్టముకాక అప్పారావుగారి వ్లైవ్సు తిరిగి నేను వెడలిపోతానన్నట్లు అఖినయించినారు. అప్పారావుగారు వారి ఉద్దేశము తెలుసుకొని ఒక్కక్షణము ఆగు, నేనుగూడ వస్తాను. ఇద్దరము కలిసే వెళ్తామన్నట్లు అఖభినయముతో తెలియజేసి, నిలువబడి “మహారాజా మొన్న తమరు సెలవిచ్చిన రాచ కార్యము ఇప్పుడు చేయవలసి వచ్చినది. ఆవిషయములో గిడుగు రామమూర్తి కూడ తోద్చడవలసి ఉన్నది. కనుక మా ఇద్దరికీ ఏలినవారు అనుజ్ఞ దయచేసిన ఎడల మేము వెళ్తున్నాము అన్నారు. “సరే ” అన్నారు మహారాజావారు. ఆ మర్షాడ్రే నేను విజయనగరము వెళ్ళినప్పుడు మా తండ్రిగారు ఈ ముచ్చట చెప్తూ “రాజుల తృప్తి కోసము ఇటువంటి అబద్దాలు ఆదవలసి వచ్చిందిరా” అన్నారు.

రాత్రి జరిగిన సంథుటననాధారము చేసుకొని కొందరు “రామమూర్తి పంతులు చాలా గర్వము కలవాడు. రాజులను లక్ష్యపెట్టడు.” అనీ రాణీగారితో చాడీలు చెప్పారు. ఈ సంఘటన రాణీగారికి ఇదివరకే తెలినింది. “మంచి చెడ్డలు తెలిసిన విద్వాంసులు ఆ దృశ్యమును చూచి సహించలేరు. మంచి పని