పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాసే భాష ఎట్లా ఉందాలి అనే విషయంలో, శిష్ట వ్యవహార భాషలో రాయాలి అని గిడుగు చెప్పారు. తర్వాతి కాలంలో దీనిమీద ప్రజలను శిష్టులు - అశిష్టులు అని విభజిస్తారా? అంటూ ఒక దుమారం లేపారు కొందరు సామాజిక స్పృహ మాకే ఎక్కువ ఉంది అసి భావించేవారు. ఇక్కడ శిష్టులు అంటే చదువుకున్నవారు అనే అర్ధం. చదువుకున్నవారే కదా రాయగలిగేది!

అన్నీ భాషలలోనూ శిష్ట వ్యావహారికమే రాస్తారు. హిందీ పుస్తకాలలో ఉందే 'హిందీ” ఎవరూ మాట్లాడరు - చదువుకున్నవారు తప్ప. తమిళం అంతే, కన్నడం అంతే. మాట్లాడే భాష రాయాలి అంటే ఎవరు మాట్లాడేది? ఈ మధ్య ఇంటి భాష అనీ ఒక మాట పొడుచుకొచ్చింది. మంఛి నినాదం! బడి చదువులో ఏ భాష వాచాలో చెప్పటానికి వాడిన మాట ఇది. అది ఎవరి ఇంటి భాష? ఎక్కడివారి ఇంటి భాష? కనుక, ఇంటి భాష అంటే ఫలానా వారి ఇంటి భాష అనీ కాదు అతి సామాన్య వ్యక్తుల భాష అనీ. మరి, వ్‌ (ప్రాంతపు సామాన్య వ్యక్తుల భాష? ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే తీసుకొని అక్కడి సామాన్యుల భాష అని (గ్రహించాలి. అట్లాగే శిష్ట వ్యవహారం అనే మాటను కూడా పెద్ద గిరి గీసి (విస్త ఎతార్జంలో) చూడాలి. ఈ విధంగా ఇంటి భాష అంటే చాలా ప్రాంతాల సామాన్య వ్యక్తుల ఇంటి “భాషలు” అని తెలుసుకోవాలి. ఇట్లా భాషలోనీ చాలా “రకాలు” గుర్తించ వలసి వస్తుంది. దీన్ని గురించి తర్వాత ప్రస్తావిస్తాను.

మళ్ళీ గిడుగువారి దగ్గరికి వస్తే ఆయన ఏ భాషలో రాశారో చూడండి. (ఈ వాక్టుభాగాలు గిడుగు వేంకట రామమూర్తి రచనా నర్వస్వుం -ఇకమీదట గిదుగు రచనా సర్వస్వం -లోనించి తీసుకున్నవి. గీ

“... నిర్మాగమాటముగా చెప్పుతాను.” (పు.4ఉు *.. నేను నమ్మజాలను.” న రూపములున్నుు అర్ధములున్నుు కా అట్టే హిందూసానీ మాటలున్ను ఇట్టివి అన్నీ ... తెలుగులో మారుతవి.” (పు. 312); *....అనిన్ని ప్రయోగించినాడు.” థు. 315) ల కనబడుతున్నవి.” (పు. 312% “*... పుట్టినవి”(వు. 87) “.. అనీ అడుగుతాము. ... ఇవి తెలుగులో సాధువు లయినవి. ..... తెలుగులో చట్టన దొరకనప్పుడు... కొందరికి స్ఫురించియుండును.”

| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ఆ ఆగస్టు-2021 |

ఆచార్య పరిమి రామనరసింహం 9849316730

గిడుగు అవసరం మనకు ఇప్పటికీ ఉందా?

అచ్చు యంత్రం వచ్చేదాకా ఏ భాష అయినా *వ్రాతరూపులో తక్కువ వ్యాప్తి కలిగి ఉంటుంది. అడే విధంగా తెలుగు కూడా. జీవద్భాషగా దాని వ్యాప్తి సమాజం అంతటా ఉంటుంది. అయితే ఎంత కాలం అయినా భాష ఒకే విధంగా ఉంటుందా అనేది ఆసక్తి కరమైన ప్రశ్న మన అందరికీ కొద్ది పరిశీలనతోనే తెలివిడిలోకి రాగల అంశం ఒకటి ఉంది: మనం మామూలు వాడుకలో మాట్లాడుతున్నప్పుడు వాక్యాల పొందిక సరిగా ఉండదు పునరుక్తి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉంటుంది. వాక్యాలు పొందికగా ఉంట్రె, పునరుక్తులు ఉండవు. రాయటం అనేది ఒక అలవాటు. ఎంత చదువుకున్నా రాయటానికి కూడా అలవాటు పడాలి. మనం మాట్లాడే భాషే కదా! రాయలేమా? అనుకో కూడదు. అందువల్లనే భాషాబోధనలో వ్యాస రచనను ఒక అభ్యాసంగా నేర్చుతాం.

అదే రాసినప్పుడు తేడా

(వు. ౩10) “*.... శిష్టలోకవేం దేశబాషపై అధికారము చలాయిస్తుంది.” (3100) “ఉపయోగపడుతుంది.” (పు. 87); “కావ్యాలు కాంతా సమ్మితంగా ఉపదేశము చేస్తవని నిర్దారణ చేసినారు.” (పు. 87); *..అపభ్రంశములోనే పుట్టినవి.” (పు. 87); “వస్తున్నవి” (పు. 87) వెళ్ళుతున్నారు (పు. 880 “౬... అలాగే మన దేశంలోనూ కావలె. (పు. 880% *.... పుస్తకాలు వ్రాయవలె.” (వు. 89 “*... కావలెనంటే...” (పు. 89)

ఆయున ఖూతకాల (కియా తూపాలుగా చేనినారా, ప్రయోగించినాడు వెఎదలైన వాటినీ వాదారు. ముగంత నామాలను సున్నతో కాకుందా రూపము, ఉపదేశము అనీ ముగంతాలుగానే వావారు. నిశ్చయార్థకాలను కావలె, వ్రాయవలె అని వాడారు. భూత కాలిక అమహద్చహు వచన రూపాలుగా పుట్టినవి (= పుట్టినై/ పుట్టినాయి), అయినవి (= అయినై/అయినాయి) వంటివాటిని, వర్తమాన అమహద్చమహు వచనంలో వస్తున్నవి (= వస్తున్నై) వంటివాటిని, భవిష్యత్మాల అమహద్బహు వచనంలో మారుతవి వంటి రూపాలను వాదారు. వీటిలో వస్తున్నవి మారుతవి వంటి రూపాలు తవ్బ తక్సినవన్నీ [గగ్రాంథికాలు కావా? చెలాయిన్తుంది, ఉవయోగవడుతుంది వంటి పూర్తి వ్యావహారిక రూపాలు కూదా ఉన్నై అనుకోండి. మరి వీటిలో గ్రాంధికాలు అంటున్నవి పూర్తిగా గ్రాంధికాలేనా? అవును; కానీ, వ్యావహారికాలు కూదా. చేసినాడు, రాసినాడు వంటి రూపాలు ఉత్తరాంధ్రలో ఉన్నై తెలంగాణాలో ఉన్నై రాయలసీమలోనూ ఉన్నై ముగంతాలు రాయలసీమలో ఉన్నై. ఇంతెందుకు? ఇవన్నీ అనాటి శిష్ట వ్యావహారంలో ఉన్నై ఉన్నై కనుకనే ఆయన రాశారు. ఈ సందర్భంలో “విన్నపము” అనే వ్యాసం (గిడుగు రచనా సర్వస్వం, పుటలు 42-53) మొదటి పుటలోని పాదసూచిలో ఆయన రాసినది గుర్తుచేసుకోటం అవసరం:

“ఈ వ్యాసము మేము సనాతన సత్సంప్రదాయాను సారముగా వాడుకలో నున్న తెలుగు ఖాషలో వ్రాసినాము. ఈ సంప్రదాయము అనేక (గ్రంథములలో కనబడుతున్నది. .... ఇందులో మేము వాడిన శబ్బములు నూరేంద్లకు పైగా తెలుగువారిలో పెద్దలు వాడుతూనే ఉన్నారు.”

వచనంలోనే కాకుండా కావ్యాలలోనూ ఈ భాషే వాడాలని కూడా