పుట:అమ్మనుడి మాసపత్రిక ఆగష్టు 2021.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పర్గాకిమిడి రాజు వసూలుచేస్తున్న అక్రమ శిస్తులకు వ్యతిరేకంగా కమిటీ వారు హైకోర్టులో దావా వేశారు. కమిటీ ఓడిపోయింది. ఫెడరల్‌ కోర్టుకు వెళ్ళారు. అక్కడ గూడ జమీందారుకే అనుకూలమైన తీర్చు వచ్చింది. అప్పుడు ప్రీవీ కౌన్సిలుకు అపీలు చేశారు. కమిటీ తరుపున వాదించదానికి సీతాపతిగారు లందను వెళ్ళారు. కాని అక్మడగూడా పేదరైతులకు న్యాయం జరగలేదు.

రామమూర్తిగారు చట్టపరిధిలో న్యాయం జరుగుతుందని ఆశించారు. పర్గాకిమిడి రాజుకు వ్యతిచేకంగా ఒక ఉద్యమాన్ని లేవనెత్తకపోయినా, ఒక పోరాటాన్ని సాగించకపోయినా , అన్యాయాన్ని అ్యక్రమాన్ని ఎదుర్శొనే హక్కు తమకు ఉందనే అవగాహనను ప్రజలలో కలిగించారు.”

వారి ఈ మాటలు విన్న తరవాత గిడుగు రామమూర్తిగారి వ్యక్తిత్వం గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. శిష్యులకు అతను చరిత్ర పాఠాలు బాగా చెప్పిన గురువుగా కనివిస్తారు. (ప్రపంచ భాషాశాస్త్రవేత్తలకు గొప్ప భాషాశాస్త్రవేత్తగా కనిపిస్తారు. వారిలో స్టాన్లీ స్టరోస్టాకు మానవజావాదిగా గూడ కనిపిస్తారు. తెలుగు వారికి వ్యావహారిక భాషావాదిగా కనిపిస్తారు. నాకు మాత్రం అతనిలోని వమానవచ్వం కనిపించింది.

గిడుగు రామమూర్తిగారు సంకలనం చేసిన 32 సవర పాటలున్న సవర సాంగ్స్‌ అన్న పుస్తకంలో రెండు పాటలు రామమూర్తిగారు స్వయంగా రాశారు. ఈ పాటలలో కవిత్వం లేదు. ఉపమలు ఉత్రేక్షలు లేవు. వీటిలో ఒకటి సవర జానపద కథనాధారంగా చేసుకొనీ రాసిన పాట. రెండవది “గుఅర్‌ నేబంజి” అన్న పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పాట. ప్రబోధాత్మకమైనది. చెట్లు తమను నరకవడ్దని మనిషినీ వేడుకొందాం అని తవులో తాము అనుకొంటున్నాయి అన్నట్లు రాసిన పాట. అవి విలపించడం లేదు. తమను నరికితే కలిగే అనర్థం గురించి మనిషినీ హెచ్చరిస్తున్నాయి. మనిషి ఆరోగ్యంగా వుండాలనీ రామమూర్తిగారి కోరిక. చెట్లు నరికితే కలిగే అనర్థం గురించి 120 సంవత్సరాల క్రితమే రామమూర్తిగారు జాగ్రత పదమని ముందుగా హోచ్చరించారు. మనిషి పెడచెవినీ పెట్టాడు. నేడు కష్టాలు అనుభవిస్తున్నాడు.

రామమూర్తిగారి సవర పాటల అనువాదం చదివిన కొందరు పర్యావరణ పరిరక్షణ గురించి ఉపన్యసిస్తున్నప్పుడు ఈ పాటను చదువుతుంటారు.

గిదుగు రామమూర్తిగారు విజయనగరంలో గురజాడ అప్పారావుగారితో కలీసి చదువుకాన్నారు. అప్పారావుగారు గిడుగు రామమూర్తిగారు ఒకేసారి మెట్రిక్‌ పరీక్ష పాసయారు. ఆర్థికమ్రైన ఇబ్బందుల వల్ల గిడుగు రామమూర్తిగారు ఉద్యోగం చేయవలని వచ్చింది. విజయనగరానికి దగ్గరలో ఉన్న కోనాదలో ఐతే నెలకు 25 రూపాయిలు జీతం, పర్గాకిమిడిలో ఐతే 30 రూపాయిలు. 5 రూపాయిలు ఎక్కువ ఇస్తారనే ఆశతో తల్లి కాదన్నా మన్య ప్రదేశం అయిన పర్హాకిమిడిలో పనిచేయడానికి వచ్చిన పద్దెనిమిదేళ్ళ

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ ఆగస్టు-2021 |

యువకుడు గిడుగు రామమూర్తి. రామమూర్తిగారి ఈ నిర్ణయమే అటు సవరజాతికీ, ఇటు తెలుగుజుతికీ ఉపకారం చేనింది. రామమూర్తిగారు 1880లో పర్లాకిమిడి మహారాజావారి హైస్కూలులో ఉపాధ్యాయునిగా ఉద్యోగంలో ప్రవేశించారు.

గిడుగు రామమూర్తిగారు పర్తాకిమిడి శనివారం నంతలో అమాయకులైన సవరలను వ్యాపారులు మోసంతో ఆర్థికంగా దోచుకోవదాన్ని చూని కలత చెందారు. అపురూపమైన కొండ సరుకులు అమ్మి వారికి కావలసిన పూసలు, కంచుపాత్రలు, ముతక నూలు బట్టలు కొనుక్కోవడానికి కొండదిగి వచ్చేవారు. రెండు పొగాకు రెవ్ములకు బుట్టెడు చింతవ౦డు ఇచ్చేవారు. కతుంచెడు పెద్దకందులుఇచ్చి సోలడు ఉప్పు తీసుకొని తృప్తిపదేవారు. సంతలో కొనుగోలు చేనినపుడూ, సరుకులు అమ్మకాలు జరిపినపుదూ వస్తుమార్చిడికే అలవాటు పడి రూపాయిలూ, అణాలూ పైసల విలువలు తెలియక గడసరి స్థానిక వర్తకుల వట్ట నష్టపోయేవారు. వీరు చదువుకొంటే లెక్కా డొక్కా తెలుసుకొని వర్తకుల చేతిలో ఇట్లా మోసపోరుకదా అనీ రామమూర్తిగారు భావించారు. రామమూర్తిగారు పర్గాకిమిడి వెళ్ళక ముందుగూడ శనీవారం సంత ఉంది. సవరలు మోసపోవడమూ ఉంది. గానీ ఎవరూ స్పందించలేదు.

రామమూర్తిగారి మానవత్వం అతనిని మేలుకొలిపింది. సవరల జీవనస్థితి మెరుగుపడాలంటే వారిని విద్యావంతులను వెయ్యాలి. వారికోసం ఐడులు పెట్టాలి అనుకొన్నారు. సవరలకు చదువు చెప్పాలంటే అ భాషలో పృున్త్నకాలు కావాలి. నవరఖాషకు సాంప్రదాయకంగా వస్తున్న లిపి లేదు. తెలుగు లిపిలోనే సవరభాషను రాసుకొనే పరిస్థితి ఏర్పడింది. సవర భాషలో వాచకాలూ నిఘంటువులూ, పాటలూ రచించాలి. అందుకోసం ముందుగా జాను సవరభాష నేర్చుకోవడం ప్రారంభించారు. 1884 నాటికి సవరలతో సంభాషించ గలిగే నేర్చు సంపాదించారు.

1908 లో వెల్ష్‌మన్‌ అటవీశాఖ అధికారిగా పర్లాకిమిడి వచ్చాడు. సవరభాష నేర్చుకొని మధ్యవర్తులు లేకుందా వారితో నేరుగా మాట్లాడితే వారి కష్టసుఖాలు తెలుసుకోవచ్చు అనే అభిప్రాయం అతనికి కలిగింది. అందుచేత సవరభాష నేర్చుకోవాలి అనుకొన్నాడు.

రామమూర్తిగారు సవఠ భాష నేర్చగలరనీ తెలుసుకొని తన బంగళాకు వచ్చి సవర భాష నేర్పాలని, దానీకి తగిన పారితోషికం ఇస్తానని అన్నాడు. “నాకు పారితోషికం అక్కరలేదు. శ్రద్దగా నేర్చుకోవడమే పారితోషికంగా భావిస్తాను. మధ్యాహ్న విరామ సమయంలో కాలేజీకి వస్తే నేర్పుతాను” అన్నారు రామమూర్తిగారు.

సవరభాషకు లివి లేదు. సవరభాషలో వాచకాలు రాయడానికి రామమూర్తిగారు జెలుగు లిపినే వాడుకొన్నారు. వెల్ష్‌మన్‌కు తెలుగు రాదు. భాషా బోధనకు అంతర్జాతీయ ధ్వనిలిపి శ్రేష్టమైనదని జ లిపిలోనే వెల్ష్‌మన్‌కు సవరభాష నేర్చేరు. (ఇంగ్లీషు భాషలో న్పెలింగ్‌కు ఉచ్చారణకూ సంబంధం లేదు. ధ్వని లిపిలో ఇంగ్లీషు అక్షరాలు వాడినా ఒక అక్షరం ఒకే ధ్వని పలుకుతుంది. మన తెలుగులాగ.