పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదం, వ్యాకరణం, స్వరం ఇంకా సందర్భం అనే నాల్షింటిని తీసుకొని అర్థ స్ఫూర్తిని వివరిస్తారు.

11 వ అధ్యాయంలో కావ్యాలలో వాడే భాషను గురించి చర్చిస్తారు. ఒకరకంగా ఇది వ్యాకరణంలో భాగం కాకపోయినా ముందు చర్చించిన వ్యాకరణ ప్రతిపాదనలకు ఇక్కడ ప్రయోగాత్మక పరిశీలన జరిగినట్లుగా చెప్పుకోవాలి. ప్రాభీన రస సిద్ధాంత కర్తబైన ఖామకుడు, విశ్వనాథుడు, జగన్నాథుడు, వామనుడు, ఆనందవర్దనుడు వెొుదలైనవారి సిద్దాంతాలన్నీ చదివేవారికీ వినేవారికీ కలిగే 'పత్యేకానుభూతికి మూలం వ్యంజన, ధ్వని, రీతి, వక్రోక్తి మొదలైనవే అనీ అంటారు. అంటే సాధారణ వ్యాకరణానికి అనుగుణంగా ఉందనీ రచనా సాంప్రదాయం అనుకోవాలి. అయితే ఇవేమీ వ్యాకరణ విరుద్దాలు కావుగానీ అసాధారణ వ్యాకరణ ప్రయోగాలుగా చూడాలి. చేరాగారు అప్పుడప్పుడు అంటుందేవారు అందరూ చెప్పినట్లు చెబితే కవి ఎందుకవుతాడు అని. ఇందులో అసలు విషయం ఏమిటంటే వ్యాకరణం నడ్డి వంచుతాదే తప్ప వ్యాకరణ భంగం కానివ్వరు. ఇట్లాంటి వంగిన వ్యాకరణం కావ్వానీకి రసపోషణకు తోద్బ్చడుతుంది. దీనినే వ్యాకరణ సమత (సమ్మతి) అంటూ దానితోపాటు వర్ణ సమత, పదసమత, స్వరసమత మొదలైనవన్నీ కలిసే సంపూర్ణ సమత చేకూరి వాత్యభావానీకి దారితీస్తుందంటారు.

లేఖన సమస్యలనే మరో అధ్యాయంలో తెలుగు లేఖనంలో సమస్యలుగా గుర్తించిన కొన్ని వ్యాకరణ అంశాలను గురించి చర్చిస్తారు. వీటిలో కొన్ని అర్థసందిగ్ధతకు అస్పష్టతకూ దారితీసినా మిగిలినవన్నీ కలన శైలిలో భాగమే. ఆధునిక యుగంలో ఎంతో కాంత సొంత మాండలికం రాతలో మాటలో కనబడకపోదు. వాటిని తగ్గించుకోవాలసిన అవనరం నందర్భాన్నిబట్టి ఉండొచ్చు. ఈ అధ్యాయంలో చివరిగా గతి తప్పిన విరామ చిహ్నాల వాడుకను ఉదాహరణలతో ప్రదర్శిస్తారు. ఈ వ్యాకరణంలో చివరి అధ్యాయంలో తెలుగు భాషా బోధన గురించిన చర్చలో భాషాబోధనలో నేర్చుకొనే వ్యక్తికి అవసరమైన భాషాంశం గురించీ, క్షేత పరిథి గురించీ వాటిలో ఉందే ప్రత్యేకతలూ వాటివలన వచ్చే సమస్యలను అధిగమించడం గురించి స్థూలంగా చర్చిస్తారు. చివరికి కాసరుగా విశిష్టభాషగా తెలుగు కావడానికి తెలుగుకు ఉన్న విశిష్టతలను కొన్నీంటినీ చర్చిస్తారు.

వెన్నెలకంటి వ్యాకరణంపేరుతో ఆధునీక తెలుగు వ్యాకరణ వర్ణనలో చాలా వరకూ కౌత్త వరవడిలో రాసినవే. వ్యాకరణంలో ఏమాత్రం ఇష్టం ఉన్నవారైనా దీన్ని తప్పక చదివే ప్రయత్నం చేయాలి. ఖాషాశాస్త్రంలో ప్రవేశం ఉన్నవారికి ఈ శైలి సహజంగా అనిపించినా సాంప్రదాయక వ్యాకరణంతో పరిచయం ఉన్నవారికి ఎంతోకొంత కొత్తగానే ఉంటుంది. ఆధునిక భాషాశాస్త్ర వరవడిలో సమ(గ్ర తెలుగువ్వాకరణం ఇంకా రాలేదనే చెప్పాలి. అయితే ఇలాంటివి భవిష్యత్తులో సమగ్ర తెలుగు వ్యాకరణ రచనకు ఆధారాలు అవుతాయి. రచయిత యార్ము విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రంలో పిహెచ్‌.దీ. పొంది వివిధ విశ్వవిద్యాలయాలలోనూ _ ప్రత్యేకంగా ఇంగ్లీషూ తదితర విదేశీభాషల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా భాషాశాస్త్ర జోధకుడిగానూ గడిచిన ఐదు దశాబ్దాలుగా చేసిన పరిశోధనలలో గడించిన అనుభవంతో కూర్చినది కావడం ఈ వ్యాకరణం ప్రత్యేకత.

కవిత

తెలుగు నుడి

గుండెల్లో ఒదిగిపోయే కమ్మదనం

తెలివిని పెంచుటే తెలుగుకున్న గొప్పగుణం

అమ్మపాలలా ఫౌష్టికం జుంటికేనెలోని తీపిదనం

లే ఎంటదల్లోని చురుకుదనం పున్నమి వెన్నెలలోని చల్లదనం ... తపనపెంచే లోచనం తాజా పూల పరిమళం ....

మనశ్వాసలొ నీలిపి మానవతై

మెరిసేది మన తెలుగు...!

దశదిశలా మల్లెల పరిమళమై. ఎదలో చిలిపితనాన్ని కురిపించేది జాను తెలుగు!

నన్నయకవి ప్రసన్నత పాల్కురికి ప్రావీణ్యత... శివకవుల జానుతెనుగు శివమెత్తిన దేశీయత... తిక్కన రసనైపుణ్యం ఎర్రన నాచన వర్ణన వు శ్రీనాథునిపాండిత్వం పోతనకవి సహజత్వం.. తేటతేట హృదయాలకు వెలుగునింపు దివ్యగుణమే తెలుగు

శతక కవుల చమత్కృతులు పదకీర్తన జావళీలు

కృష్ణరాయ స్వరయుగం కావ్వరసం కమనీయం

అచ్చతెనుగు జిగిబగీలు అతులిత మాధురీ మహిమలు... ముద్దుపలుకు గుంఫనాలు శ్లేష ద్వ్యర్థి చేమ కృతులు... వలపుల వయ్యారి కులుకు నవరస నాట్యపు నదకల నవ్వతెలుగు

ముత్వాలసరులతోగురజాడ

అమలిన శృంగార శోభగా రాయప్రోలు

కందుకూరి సంస్కారం గిడుగుమూర్తి వ్యవహారం... కృష్ణశాస్త్రి విశ్వనాథ శీశీల భావుకతా...

జాషువా దాశరథీ సినారె కాళోజిల మానవతా

సూరి బ్రౌను ప్రతాపరెడ్డి వట్టికోట ఆధునికత దివ్యతెలుగు

వచనకవిత నవల కథల కాల్చనీకత వాస్తవికత....

అతస విరస దిగంబర నయాగరా చేతనత్వ... హేతువాదమనుఖూతి స్రీవాదపు దళిత గీతి..

మణిపూసలు నానీలు పలుకుబళ్ళు హైకూలు...

నీఖార్భైన జానపదం నిత్వనూత్న సుకుమారమే తేటతెలుగు!! ఎదసవ్వడి గుసగుస గుణగణాల మాధుర్యం మాతృభాష.

డా.పాండాల మహేశ్వర్‌

9912180054


జిల్లాస్థాయి వరకు కోర్టుల్లో తీర్పులు తెలుగులో తేవాలి (జి.ఒ.నెం. 485/29.38 1974)

| తెలుగుజాతి పత్రిక ఖవ్చునుతె ఈ 'సెస్టెంబర్‌-2020 |