పుస్తక పరిచయం
పరమపూజనీయ డా. హెడగేవార్
జీవితము-సందేశము
- అనువాదం, వ్యాఖ్యానం
- వెల: రు. 90/-
- ప్రచురణ:
- నవయుగ భారతి ప్రచురణలు
- ప్రతులకు: సాహిత్వనికేతన్,
- హైదరాబాదు: 040 27563236
- విజయవాడ: 94406 43348
ధర్మాన్ని సమాజాన్ని మన సంస్కృతిని రక్షించుకొనటానికి, హిందువులను సక్షమమైన సంఘటనగా తీర్చిదిద్దటమే ఆశయంగా “రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్” ను స్థాపించిన దా॥కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (దాక్టజీ అని, “పరమ పూజనీయ'” అని సంఘ పరివారం) (1889 - 1940) జీవితం-సందేశాలను పేర్చికూర్చిన వ్యాసాల సంకలనం ఇది. ఈ సంకలనాన్ని నాలుగు ప్రధాన అధ్యాయాలుగ విభజించారు. 1925వసం॥ విజయదశమి నాడు స్థాపించబడి, ఈనాడు భారతదేశమంతటా నిస్వార్థ సమాజసేవకు సర్వదా సంసిద్ధంగా (RSS) కార్యక్రమాలు సాగిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక
సంఘం గురించి మాత్రమే తెలిసినవాళ్లకు ఆ సంస్థను స్థాపించి హిందూదేశపు అభ్యుదయానికి కల్చవృక్షంగా ఫలాలను అందించిన “డాక్టర్ జీ " జీవిత సంగ్రహం వారు వివిధ సందర్భాలలో సంఘ కార్యకర్తల నుద్దేశించి చేసిన ప్రసంగాల పాఠం వారి సమాధి ఉన్న నాగపూరులోని రేశమ్ బాగ్ సంఘస్థాన్‌లో “స్మృతి మందిరం” నిర్మాణం - రూపకల్పన - ప్రారంభోత్సవ విశేషాలు ప్రత్యేక అనుబంధంగా సంఘస్థావనకు ముందు “రాజద్రొహం” నేరం ఆరోపింపబడి స్వాతంత్య్ర సాధనకు జైలుయాత్ర చేసిన ఘట్టం మొ౹౹ ముఖ్యమైన ఆసక్తి కరమైన విషయాలతో 'డాక్టర్టీ గురించి తెలుసుకునే
అవకాశం పాఠకులకు కలుగుతుంది.
నాగపూరులో ఒక నిరుపేద సనాతన కుటుంబంలో బలీరామ్ పంత్, రేవతి దంపతులకు తేదీ ౦1-04-1889న జన్మించిన దాక్టర్‌జీ, 12సం॥ల వయస్సులో తల్లిదండ్రులు ప్లేగు వ్యాధితో మరణించగా పెద్దన్న మవోదేవశాస్తి పెంవకంలో బాల్యం, విద్యాభ్యానం గడిచింది. విద్యార్ధి జీవితంలోనే ఆయన చేసిన ప్రతిపనిలోనూ దేశభక్తి, స్వాతంత్రేచ్చ ప్రస్ఫుటంగా కనిపించేవి. “వందేమాతరం " సమస్యపై, దేశాఖిమానాన్ని విద్యార్థులలో మేల్మొలుపుతున్నందుకుగాను రెండు పాఠశాలల నుండి వెడలగొట్టబడి, చివరకు పూనావెళ్లి జాతీయ పాఠశాలలో చదివి మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులవుతారు. తరువాత కొంతకాలంపాటు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసి ఇంట్లో చదువుచెప్పి (ట్యూషన్లు) కొంత ధనం పోగుచేసుకాని, 1910లో కలకత్తాలోని నేషనల్ మెడికల్ కాలేజిలోచేరి, ప్రధమశ్రేణిలో ఎల్ ఎమ్. & ఎస్. పరీక్ష పాసయి డాక్టరు పట్టాను పొందారు. కలకత్తాలో ఉన్న ఆరు సం॥ల కాలంలో స్వదేశీ ఉద్యమంలో పాల్గొని దేశభక్తికి ఒరవడి దిద్దుకున్నారు. అప్పుడే 'గరమ్ దళ్ '(అతివాద) రాజకీయ పక్షంలో చేరారు. బెంగాలీ ప్రజలు ఆరంభించిన ప్రతి ఉద్యమంలోను కార్యక్రమంలోను అత్యంతోత్సాహంగా పాల్టొంటూ ఉండేవారు. రాష్ట్రొద్దరణ, సమాజ సేవలే ప్రధానంగా భావించి ధ్యేయవాద జీవితం గడపాలనే సంకల్పంతో డాక్టరు వృత్తి చేపట్టకుండా వివాహం చేసుకొనకుండా, అంతకంటే పరమ శ్రేస్టమైన కర్తవ్యం తాను చేపట్టాలని సంసారబంధం, తాపత్రయాలకు దూరంగా ఆదర్శాలను వదలుకోవటం యిష్టపడని 'డాక్టరుజీ ' ఆజన్మ బ్రహ్మచారిగా జీవితాన్ని నిర్దేశించుకున్నారు.
1915వ సం॥ నుండీ 1924 వ సం॥ వరకు దేశంలో జరుగుతున్న స్వాతంత్రోద్యమాలలో పాల్గొనటం మాతృదేశ దాస్యవిముక్తికి, సంపూర్ణ దేశస్వాతంత్య్రం కోసం అలమటించి, ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని చూసి సంక్షోఖించిపోయిన డాక్టర్‌జీ 1920లో నాగవూరులో జరిగిన కాంగైన్ సమావేశానంతరం, పాల్గొన్న ప్రతి సభలోను మహోద్రేకంతో ఉపన్యాసాలు యిచ్చేవారు. 1920 అక్టోబరులో కాటోల్‌లోను, భరత్ వాడలోను జరిగిన సభలలో డాక్టర్‌జీ యిచ్చిన ఉపన్యాసాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలుగ రెచ్చగొట్టేలా ఉన్నాయని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వ్యాపింపచేసి తిరుగుబాటుకు పిలుపునిచ్చారని మే1921లో వారిపై రాజద్రోహంగా అభియోగాలు చేసి కేసు దాఖలు చేయబడింది.
న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు కాకపోయినా, డాక్టర్‌జీ కేసు విచారణ పగ్గాలను తన చేతిలోనికి తీసుకుని తానే స్వయంగా సాక్షిని ప్రశ్నించటానికి అనుమతి సొందారు. చివరకు, ఒక భారతీయునిపై జరిగే కేసులో విచారణకు వచ్చే అంశాలను విని నిర్ణయాలను ప్రకటించడంలో బ్రిటీషు న్యాయమూర్తి పనికిరాడని ఫిర్యాదు కూడా చేసి ఇంతకుముందు ఎన్నడూ జరగని విధంగా సంచలనం సృష్టించారు. అయితే బ్రీటీషు ప్రభుత్వం ఈ అర్జీని పక్కకు పెట్టగా, కేసు విచారణ యధాప్రకారం అదేజడ్టితో (న్మెలీ ) విచారణ కొనసాగింది. న్యాయస్థానం ఆగస్టు 21, 1921నాడు తన నిర్ణయాన్ని వినివిస్తూ డాక్టర్‌జీ ఉపన్యాసాలు నిస్సందేహంగా రాజద్రోహంగా ఉన్నాయని, అందుచే ఒక సం॥వరకు ఈ తరహ ఉపన్వాసాలు చెప్పనని హమీ పత్రాన్ని యిస్తూ, జమానతుగా వెయ్యేసి రూపాయలకు ఇరువురినుండి-హామీ పత్రాలను, మరో వెయ్యి రూపాయలకు వ్యక్తిగత హామీపత్రాన్ని వ్రాసి ఇవ్వాలని ఆదేశించింది. జమానతు, హామీ పత్రాలు ఇవ్వడం తనకు అంగీకారం కాదు అని డాక్టర్‌జీ ఖరాఖండిగా చెప్పడంతో, న్యాయమూర్తి వారికి ఒక ఏడాదిపాటు కఠిన కారాగారవాన శిక్ష విధించారు. వలస పాలనకాలంలో సామ్రాజ్యవాదాన్ని సిద్ధాంతపరంగా విరోధింఛిన చరిత్రకు ఇది ఒక దృష్టాంతం. డాక్టర్‌జీ త్వాగం, న్యాయ స్థానంలో చేసిప దేశభక్తిపూరిత వాజ్బలమూ, యువ జాతీయ వాదులకు ఎంతో
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి సెప్టెంబర్-2020
49