శక్తిని ఉత్సాహాన్ని, ప్రేరణను యిచ్చి ఎంతో జనాదరణకు పాత్రుడయ్యారు.
స్వరాజ్యము, జాతీయత, హిందూత్వము, నిజమైన స్వాతంత్య్రమూ అంటే ఏమిటో ప్రచారం చేయడానికి నాగపూరులోనే 'స్వాతంత్య్ర ', అనే దినపత్రికను ప్రారంభించి కొన్నాళ్ళు పత్రిక ద్వారా ప్రచారం సాగించారు. అయితే, ప్రభుత్వం ఈ పత్రికపై ఆంక్షలు విధించి, ఆటంకాలు కలిగించడంతో పత్రికా ప్రచురణ ఆగిపోయింది.
భారత జాతీయ కాంగ్రెసు కార్యక్రమాలలో పాల్గొన్న డాక్టర్‌కి, జాతి నిర్మాణంలో కాం[గైసు అనుసరించిన విధానాలు, రాజకీయాలు నిరాశను కలిగించాయి. 1923లో హిందూ, ముస్లింల మధ్యచోటు చేసుకున్న విద్వేషాలు, అల్లర్లు ఆయనను ఎంతో కలచివేసాయి. లోకమాన్య బాలగంగాధర తిలక్, వినాయక దామోదర సావర్కారు, బాబూరావు సావర్కారు మరియు ప్రధానంగా బీ.ఎస్.మూంజే మొ॥ వారి ప్రభావం వారిపై పడింది. వీరసావర్కారు ప్రతిపాదించిన “హిందూత్వ” సిద్ధాంతం ప్రభావం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం చూపింది. దేశంలో జరుగుతున్న ఉద్యమాలు, సంస్థల కార్యక్రమాలు, రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు అన్నిటినీ అధ్యయనం చేసారు. మాతృభూమియైన భారతవర్షం వైశాల్యంలో, జనసంఖ్యలో, సృష్టి సౌందర్యంలో, ఖనిజసంపత్తిలో, పాడిపంటలలో, యివిగాక వేదాంతం, ధర్మం, సంస్కృతి, చరిత్ర, విద్య, పరాక్రమం, కళాకౌశల్యాదుల్లో ఎంతో ముందుండిన హిందూ రాష్ట్రం ఎందుకు ఈ విధంగా వెనుకబడింది అనే ఆలోచన ఆయనను వేధించసాగింది. ఆవేదన నుంచి ఒక నూతన మార్గాన్ని అన్వేషించాలనే సంకల్చం ఆయనలో చోటు చేసుకుంది. భారత జాతీయత, హిందూ సంస్కృతి మరియు వారసత్వం మూలాధారాలుగ ఉండవలసినదేననీ గాఢంగా నమ్మారు. హిందూత్వమే యధార్ధ భారత జాతీయత” అనే సిద్దాంతం డాక్టర్‌జీ ఆలోచనలలో దృడంగా పాతుకుపోయింది. “హిందూ రాష్ట్రాన్ని సముద్దరించాలని, ఆ ధ్యేయం నెరవేరటానికి నివురుగప్పిన నిప్పులా చేయటానికి " రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్” ను ఒకరాష్ట్రీయ సంఘటనోద్యమంగా ప్రారంభించారు.
మహాపురుషులకు క్రియాసిద్ధి 'సత్త్వ' మనే మహత్తరగుణంతో లభిస్తుంది; ఉపకరణాలవలన కాదు- అని పండితులు చెప్పిన లోకోక్తి డాక్టర్ జి విషయంలో ప్రత్యక్ష ఉదాహరణ. నాగపూరులో బీజమెత్తిన సంఘ వృక్షం, కాలక్రమేణ అన్ని జిల్లాలకు, నెమ్మదిగా దేశం నలుమూలలకు శాఖోపశాఖలుగ విస్తరిల్లింది. సంథు సభ్యులు అందరూ క్రమం తప్పక ప్రతినిత్యమూ నిర్ణీత సమయానికి సంఘ స్థానానికి వచ్చి, సరియైనవేళకు (భగవ) దధ్యజారోహణ (కాషాయ జెండా) చేసి మాతృభూమి ప్రార్ధన చేయాలనే కఠిన నియమం పాటించే సంన్కృతిని పాటించటం సంఘం ప్రత్యేకత. సంఘం ఒక వ్యాయామశాలయని కొందరు, స్వచ్చంద సేవక దళం అని సేవాసమితి అని, కొందరు విప్లవ సంఘమని రకరకాల అపోహలను ఎదుర్కోవలసి వచ్చింది. అన్ని అవరోధాలను, నిషేధాలను, ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొని, స్వీయ సిద్ధాంతాల నుంచి అంగుళం మేరకూడా చలించక, సంఘ కార్యక్రమాలను ముందుకు నడపటంలో డాక్టర్ జీ కృతకృత్యులయారు.
సంఘ్ స్థాపించిన తర్వాత వివిధ కార్యక్రమాలలో, సందర్భాలలో సంఘ కార్యకర్తలతో సమావేశం అయినపుడు, ముఖ్యంగా 1935వ సం॥లో (అప్పటికి సంఘం స్థాపించి పది సం॥లు అయింది) చేసిన ప్రసంగాలు ఎంతో ఉత్తేజకరంగాను, స్ఫూర్తిదాయకంగాను, హిందూ సమాజానికి సంజీవని వలె ఉండటంతోపాటు హిందూత్వ భావోద్వేగాలను రేకెత్తించేవిగా ఉండేవి. హిందూస్థాన్ హిందువులది; శివాజీ నుండి ప్రేరణ పొందుదాం; ఎందుకంటే అతడు హిందూసమాజానీకి ఆదర్శంగా నిలిచే ఏకైక మహాపురుషుడు, హిందూ ధర్మాన్ని ప్రాణం పోయినా, అఖరినెత్తుటి బొట్టు వరకు వదలి పెట్టకూడదు. మనలనుమనం సంరక్షించుకోవాలన్నా, ఇతరులలోని ఆక్రమణ ప్రవృత్తిని తొలగించాలన్నా మనం శక్తిమంతులం కావలసి ఉంటుంది. స్వరాజ్యం బిచ్చమెత్తితే వచ్చేది కాదు, సంపాదించుకునేది; జీవితమంతా సంఘకార్యం చేయదలుచున్న వారు కూడా చదువుకోవడం, తద్వారా సంఘం పనిచేయడానికి యోగ్యతను అధికారాన్ని సంపాదించుకోవడం అవసరమే, యిలా సాగేవి డాక్టర్‌జి ప్రసంగాలు. ఈవిధంగా సంఘకార్యమే జీవిత లక్ష్యంగా, దైనిక జీవితం అంతా ప్రతి నిమిషం సంఘానికే వినియోగించి, నిరాడంబరంగాను, ప్రచారాలకు దూరంగాను, అపారమైన ధీశక్తి అసమానము గంఖీరము అయిన నీతిజ్ఞత, అచంచలమైన ధైర్యం మూర్తీభవించిన డాక్టర్టీ తన జీవితమే ఒక మహాయజ్ఞంగా ఆహుతిచేసి, హిందూ రాష్ట్రానికి ఒక అపూర్వమైన వెలుగుని, నూతన దృష్టిని సృష్టించి- హిందూరాష్ట్రం (భరతఖండం/ఆర్యావర్తం) చరణాలపై కానుకగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ను అర్చించిన డాక్టజీకి 1932 నుండీ ఆరోగ్యం క్షీణించి దీర్జకాలిక చికిత్సలు పొంది, చివరకు 1940సం॥ జూన్ 21నాడు - స్వర్గస్థులైనారు.
1940లో డా॥ హెడ్గేవార్ మరణించిన తర్వాత వారి జీవితాన్ని సంక్షిప్తంగా పరిచయం చేనిన పుస్తకం హిందీలో వెలువడింది. తెలుగులోకి అనువదింపబడిన ఈ పుస్తకం 1971లో మొదటిసారి ముద్రింపబడింది. ఆ తరువాత్త 1935వ సం॥॥లో సంఘం స్థాపించి దశాబ్టి ఉత్సవాలు జరిపినవుడు డాక్టర్ జీ ప్రసంగం, 2003లో హిందీలో ప్రచురితమైన “డా. కేశవబలిరాం హెడ్గేవార్” (నవభారత నిర్మాతలు” గ్రంధావళిలో భాగంగా) గ్రంధంనుండి 'రాజద్రోహానికి నేరవిచారణ” ను ప్రత్యేక అనుబంధంగా తెలుగులోకి 2004లో వడ్డి విజయసారధి అనువాదం చేసారు. ఈ విధంగా 'డాక్టర్” జీవితం- సందేశం, దానితోపాటు చేర్చిన కొత్త అధ్యాయాలతో 2019లో నవయుగ భారతి ప్రచురణలు, హైదరాబాదు వారు తమ ప్రధమ ముద్రణగా వెలువరించారు. దేశభక్తి భావనలను 'ప్రజ్వలింపచేయుటలో ఈ గ్రంధానికి ప్రాముఖ్యం ఉంటుందని తక్కువ ధరకే అందజేస్తున్నారు.
- - ఎం. వి.శాస్త్రి 9441342999