Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉచ్చారణా విధానంగురించీ విపులంగా చర్చించారు. ప్రకాశంగారు ఇంతకుముందు ఇతరులు గమనించని ఒక అంశాన్ని ప్రస్తావిస్తారు. అదేమిటంటే, తెలుగులో సందులు సాధారణంగా స్థానాశ్రిత వర్గీకరణపై ఆధారపడి జరుగుతాయని ఇప్పటివరకూ నమ్ముతున్నాం. ఆయితే త్‌-ల్‌ మధ్య త్‌-న్‌ మధ్య సంధి జరగక పోవడం, భిన్న వర్ణాలకు చెందిన టొ-ల్ డ్-ల్ ట్‌-న్‌, డ్-న్‌ మధ్య జరగడం, అలాగే టొ-చ్‌, ట్‌-జ్‌, డ్‌-చ్‌, డ్-జ్‌ల మధ్య జరగడం, ఇంకా స్‌-త్‌ ల మధ్య సంధి జరగడాన్ని నిశితంగా పరిశీలించి వర్ణాల వర్గీకరణ స్థానాలపై ఆధారపడినాగానీ దానికీ వర్షప్రవర్తనకూ ఎలాంటి సంబంధం లేదంటారు. అందుకని ప్రకాశంగారు కరణాశ్రిత వర్గీకరణపై ఆధారపడి సంధి సూత్రాలను ప్రతిపాదిస్తారు. ఉదాహరణకు, ప, బ, మ, (వ) ఓష్టాలుగానూ, త ద,స, చ, జ(య) లను జిహ్వోపాగ్రాలుగానూ, ట, డ, న, ణ, ల, ళ,ర లను జిహ్వాగ్రాలుగానూ, క, గ లను జహ్వమూలీయాలుగానూ వర్గీకరించి సంధి కార్యాలను సూత్రీకరించటం తేలిక అని సోదాహరణంగా నిరూపిస్తారు. వారు ఇచ్చిన వివరణ ఇప్పటికి ఇదే మొదటిసారి. వారు చెప్పిన సూత్రం: “జివ్వోగ్రాలు సంధికి పూర్వంలో ఉన్నప్పుడు వరంలో ఉన్న జిహ్వోపాగ్రాలతో కరణం విషయంలో సమీకృతమౌతాయి”. ఉదా. చూ.: పాల్‌[+జిహ్వాగ్ర] అ+త్‌[+జిహ్వోపాగ్ర) ఓ= పాల్ష్‌[+జిహ్వోపాగ్ర] అ+త్‌[+జిహ్వోపాగ]) ఓ= ప్లాల్లో

అలాంటిదే, జిహ్వాగ్రాలు పరంలో ఉన్న పరివేష్టిత జిహ్వాగ్రాల కారణంగా పరివేష్టితాలు అవుతాయి. ఉదా. పాలు+డబ్బా = పాళ్దబ్బా.

పై సూత్రం ప్రవర్తిల్లి పరంలో ఉన్న స్పర్శేతర హల్లు ముందుగా పరివేష్టితంగా మారుతుంది. ఆ పైన పూర్వ స్పర్భం వర హల్లు నుండి అనునాసికతనూ పార్చికతనూ పొందుతుంది.

అంటే బడి+ని > బడ్+ణి -> బణ+ణీ అవుతుంది.

తెలుగు సంధి నియమాలకు వర్ణాల స్థానాశ్రిత వర్గీకరణ కంటే కరణాశ్రిత వర్గీకరణ ముఖ్యమా ఉపయోగకరమూ అని మొట్టమొదటిసారి ప్రతిపాదించి సోదాహరణంగా నిరూపిస్తారు.

అలాంటిదే ఏరు, నూరు, మోకాలు లాంటివి ఏటి, నూటి, మోకాటి కావడం కరణాశ్రిత వర్గం కావడమే నంటారు. అలాంటివే నూయి-టనూతి, చేయి-టచేతి కావడంకూడా అంటారు. కారణం, య, త లు జిహ్వోపాగ్రానికి చెందటం అంటారు. కానీ ఈ వివరణ ఇట్లా సంధి జరిగినవాటి గురించి చెబుతుంది సరేగానీ సంధి జరగని వాటిగురించి ఏం చెబుతుంది. నేటి తెలుగులో పదాంతాలలో ను, లు, రు, యి ఉండి సంధిలో ఎలాంటి మార్పు పొందనివే కోకొల్లలు. అంటే చారిత్రికంగా ధ్వనులలో వచ్చిన మార్పులవలనే నేడు సంధి కార్వాలలో విరళంగా కనబడుతున్నవీ సామాన్య సూత్రాలకు లొంగనివీను.

అచ్చులమధ్య జరిగే మార్పులను స్వరమైత్రి అనీ, స్వర సమీకరణం అనీ అనడం ఆనవాయితీ. ఈ రచయిత వీటిని అచ్చుల మమత అంటున్నారు (ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న పారిభాషిక పదాలను వాడక కొత్తపదాల వాడుక ఎందుకో). రెండూ అంతకంటే ఎక్కువ వర్ణాలమధ్య జరిగే సంధి కార్యాలలో “తొడి వర్ణాలను తాకే ధ్వన్యంశాలను” అలా కాని వాటినుంచి వేరుచేసి వర్గీకరిస్తారు. వాటినే చరాంశాలూ స్థిరాంశాలుగా పేర్కొంటారు. అంటే ఒక వర్డానికి సంబంధించిన ధ్వన్యంశాలు మరో వర్షానికి గనక పాకితే వాటిని చరాంశాలు గానూ అట్లా పాకలేని ధ్వన్యంశాలను స్థిరాంశాలుగానూ చూడాలి అంటారు. ఇప్పటివరకూ తెలుగులో జరుగుతున్న స్వరసమీకరణంపై చే. రామారావుగారూ, క.వెం. సుబ్బారావు గారూ, కే నాగమ్మారెడ్డి, జె.వి. శాస్రిగారూ, గా. ఉమామహేశ్వరరావు మొదలైనవారు ఎందరో విపులంగా చర్చించినా చరాంశాల ప్రతిపాదన ఇదే ప్రథమం.

కారక బంధాలు -విభక్తి వాడుకలు అనే ఏడవ అధ్యాయంలో ఇప్పటివరకూ ఎవరూ వాడని పారిభాషిక పదజాలం వాడుతూ తెలుగులో ఐదు రకాల వాక్యాలు ఉన్నాయన్నారు. వాటికి వరుసగా, గుర్తింపు వాక్యాలు (అతను కోపిష్టి, చెందుడు వాక్యాలు (నాకు రెండు కార్లు ఉన్నై, మనోప్రవృత్తి వాక్యాలు (అతనికి ఇడ్లీలంటే ఇష్టం), అస్తిత్వ వాక్యాలు (డాక్టరుగారు ఉన్నారా?) కార్య వాక్యాలు (అతను పరిగెత్తాడు, తలుపు తెరుచుకుంది) అని పేర్లు పెట్టారు. ఇవి పూర్తిగా వక్త అనుభవ పూర్వకమైన వ్యక్తీకరణపై ఆధారపడి చేసిన విభజన. భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు, మొదలైన వ్యాకర్తలు నిర్మితిని ప్రధానంగా తీసుకొని వాక్య విభజన చేశారని చెప్పాలి. అట్లాగే, రచయిత తెలుగు వాక్యాలలో ఉక్తం, ఆభ్యాతాల తేడాను గుర్తించడం ముఖ్యమైనదని చెబుతూ, వివిధ వాక్యాల్లోని తేడాలను ఉద్దేశ్య విధేయాల సంయోజనంగానే గుర్తిస్తారు. అయితే ఇదంతా వాక్యాలలో వివిధ రకాలను గుర్తించడం వరకే. అసలు, వాక్యాల అర్ధావగాహన వాక్యాలలో వాడిన నామబంధాల విభక్తి రూపాలవలన ఏర్పడుతుందని చెబుతూ ఎనభైదాకా ఉన్న విభక్తి ప్రత్యయాలనూ ఉప పదాలనూ మొత్తం 37 రకాల అర్ధపరకమైన నామసంబంధాలు గానూ మళ్లీ వాటిని 14 రకాల కారక సంబంధాలుగానూ విశ్లేషిస్తారు.

ప్రాణం తీయు లేక చంపు అనే క్రియలు సమానార్థకాలు అని మన సాధారణ నమ్మకం. అయితే అవి కావనీ వాటి వాడుక రుజువుపరుస్తోంది అని ఉదాహరణలతో చూపిస్తారు.

{(18) ఆ విషం అతని ప్రాణం తీసింది.

(20) ఆ విషం అతనిని చంపింది.

20 వ వాక్యం బాగుండకపోవటానీకి కారణం చంపు అనే సకర్మక (క్రియా వ్యాపారానికి కర్తృత్వం వహించలేకపోవటంగా కనబడుతోంది. మరి అదే విషం 18 వ వాక్యంలో ఎలా సాధ్యమైంది. ప్రాణం తీయడం, చంపడం రెండూ స్తూలంగా ఒకే అర్ధాన్ని స్ఫురిస్తున్నా వాటి అర్జకాలమధ్య తేడా కనబడుతోంది. ప్రాణంతీయడానికి కర్తృ పదాలు ప్రాణులు కాకపోవచ్చు గానీ చంపడానికి కర్తృ పదాలు 'ప్రాణులైవుండాలనీ నియమం తెలుగులో ఉందనిపిస్తోంది.

క్రియా పదబంధాల గురించి 8 వ అధ్యాయం లో చర్చించారు. దీన్లో, కార్యస్తితీ (aspect) కాలసూచనా (lense) రెండూ ప్రత్యయాలతోనే తెలుస్తాయని చెబుతూ, “తెలుగులో ఉండు అనే క్రియ మాత్రమే కాలాన్ని సూచిస్తుంది” అనీ, ... “మిగతావన్నీ కార్యస్థితిని సూచిస్తాయి” అంటారు. ఇట్లా వీరిదే మొదటి ప్రయత్నం అనుకుంటాను. 97 వ పుటలో ఇచ్చిన పటానికి వివరణ ఇంకా ఉంటే బావుండేది.

ఇక 9వ అధ్యాయంలో నామ్బీకరణాలగురించి చేసిన చర్చ చేకూరి రామారావు (బేరా) గారి వ్రతిపాదనలపై సమీక్షా వ్యాసంలాంటిది. చేరాగారి ప్రతిపాదనలలో ఉన్న కొన్ని సమస్యలను పట్టుకొని చర్చించటం జరిగింది. భావ పరిశీలన అనే పేరుతో 10వ అధ్యాయంకింద తెలుగు వాక్యాల అర్థ స్ఫోటన ఎలా జరుగుతుందో వివరించబూనటం ఒక విధంగా ఈ వ్యాకరణంలో ఉన్న కొత్తదనమే.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి సెప్టెంబర్‌-2020

47