పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పరిచయం

అచార్య గారపాటి ఉమామహేశ్వరరావు ౨8661 28846

ఆధునిక తెలుగు

వెన్నెలకంటి వ్యాకరణం

రచయిత:

వెన్నెలకంటి ప్రకాశం

వెల: రూ. 150/-లు

ప్రతుల కోసం: 5849805675

ఈ-మెయిల్‌: sujatha@nirrvitha.in


వెన్నెలకంటి ప్రకాశంగారు రచించిన “వెన్నెలకంటి వ్యాకరణం” అనే ఆధునిక తెలుగు వ్యాకరణాన్ని 2018 జులై నెలలో నీర్విత ప్రకాశకులు ప్రకటించారు. ఇది 176 పుటలతో 13 అధ్యాయాలతో రచయిత చేతులమీదుగా రాసిన తాలిపలుకూ మలిపలుకులతో ప్రకటించిన ఈ వ్యాకరణం ఇప్పటికి తెలుగులో వచ్చిన వ్యాకరణాల్లా కాక మరో కోణంలో తెలుగు నుడిని పరిశీలించి కూర్చినదిగా కనిపిస్తోంది. ఈ పదమూడు అధ్యాయాలలో ఎనిమిది, అంటే. 3-10. అధ్యాయాలు, శ్రా వాక్యం ఆ వాక్య బంధం-వాక్య సముదాయం, 4 నాదోత్పత్తి; 5. ఉచ్చారణ: వర్ణ వర్గీకరణ; 6. సంధి-అచ్చుల మమత 7. కారక బంధాలు -విభక్తి వాదుకలు & క్రియా పదబంధాలు; 9. నామ్నీకరణాల గురించ్వి. 10. భావ పరిశీలన; వ్యాకరణానికి సంబంధించినవి కాగా మిగిలిన ఐదు, 1. ఖాష-భఖావం-సమాచార వ్యక్తీకరణ, 2. భాష -సమాజం- వ్యాకరణం 11. కావ్య భాష్య 12. లేఖన సమస్యలు 13 భాషా జోధన మొదలైనవి భాషను గురించిన పరిచయమూ, సామాజిక నేపథ్యమూ, దాని అనువర్తనం గురించిన చర్చలతో పూర్తవుతుంది. చివరిగా రచయిత మలిపలుకు ఆపైన ఉపయుక్త రచనావళితో ముగుస్తుంది.

ఒక భాషకు వ్యాకరణాన్ని కూర్చేటప్పుడు ఎవరి భాషకు అనే ప్రశ్న తలెత్తుతుంది. రచయిత తను వాడే భాషక్కా తన ప్రాంతంలోని భాషకా, లేక అధికసంఖ్యాకులు వాడుతున్న భాషకా లేక ఇంకేదైనానా అనే సందేహం రాక మానదు. ముందు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి. భాష ఇట్లా ఉందాలి అనే వ్యాకరణ రచనకంటే భాష ఇట్లా ఉంది అంటూ చేసిన వ్యాకరణ రచనే ఉత్తమం. దానివలన భాష ఎట్లా ఉంది, సమాజంలో ఆ భాషాస్ట్థితి ఏమిటో తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాకరణ రచయిత, మన ప్రాభీన సాహిత్యం నుండి “అట జనీ కాంచె.....”, “వచ్చినవాడు ఫల్టుణుందు....” “ఎవ్వనిచే జనించు......” అనే మూడు పద్యాలను తీసుకొని ఏది ఎవరికి (సగటు తెలుగువాదికి) ఎంత అర్ధమౌతోందో అంటూ బేరీజు వేసుకొంటారు. మొదటిది సంస్కృత భూయిష్టం కాగా రెండవది అచ్చతెనుగు కట్టడితో ఉన్నదీ, ఇక చివరిది మధ్యస్థంగా ఉన్నదీ. అయితే ఈ మూడింటిలోకీ చివరిదే ఎక్కువమందికి అర్థమయ్యే భాషలో ఉన్నది కనుక అట్లాంటి భాషనే వాడాలి, అదే వ్యావహారిక భాషోద్యమానికి ప్రేరణ అంటూ, ఆ ఉద్యమానికి తోడైన కాన్ని మౌలీకాంశాలను ప్రస్తావించారు.

వాటిలో కొన్ని ఇవి: భాష మారుతుంటుంద్వి మాటకూ రాతకూ సామరస్యం ఉందాలి; వ్యాకరణం ప్రయోగమూలం; వాడుక భాష కానిదాన్నీ పుస్తకాలలో వాడటం ప్రయోజనకారి కాదు దురభిమానం కూడదు. ఈ పైన రచయిత పిల్లల పాఠ్య పుస్తకాలలో కొంత వరకూ మాండలికతను ప్రవేశపెట్టితే నష్టమేమిటని ప్రశ్నిస్తున్నారు కూదా. గిరిగిసుకొనీ మనం వాదే తెలుగు ఇట్లాగే ఉందాలి అనే దురభిమానం తగదని రచయిత స్పష్టం చేస్తున్నారు.

మొదటి అధ్యాయంలో, భాషలో భావానికీ దాని వ్యక్తీకరణకూ సంబంధాన్ని పప్రతిపాదించటానీకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలోనీ సారాంశం ఇదిగో చదవండి. భాషకు మూలమూ ఫలమూ రెండూ భావమే. ఇంకా, మూలం, ఫలం ఈ రెంటి మధ్యా ఎలాంటి తేదా లేనప్పుడే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అర్ధవంతం. తేదా ఉంటే. అపార్ణం. అంటే అర్భవంతమ్హాన మాటలు మాట్లాదేందుకూ, రచనలు రాసేందుకూ వ్యాకరణ వాడుక చక్కగా ఉందాలి అంటారు. అలాగే భావ వ్యక్తీకరణ -ప్రక్రియ వక్తకూ (శోతకూ మధ్య జరిగే అనేకానేక ప్రక్రియలద్వారా సాధ్యమౌతోందనీ కొంత విపులంగానే చర్చిస్తారు.

ఇక రెండవ అధ్యాయంలో, వ్యాకరణాన్ని నీర్వదించే ప్రయత్నం చేశారు. వ్యాకరణం, *....పదాల, పదబంధాల, వాక్యాల, వాక్య బంధాల, వాక్య సముదాయాలలో కనిపించే నియమావళి ..... ష్ణ అలాగే, భాష వాడుకలో “సామాజిక జెచిత్యాన్ని” సూభించే నీయమాలనుకూడా వ్యాకరణంలో భాగమంటారు. ఉదాహరణకు అది, ఆమె, ఆవిద, వారు లాంటి సర్వనామాల వాదుకలోని నియమాలు సామాజిక జెచిత్యానికి సంబంధించినవి. ఇవి వమౌలిక(0గా) రూప వ్యాకరణంలో ఖాగం కానీవి అంటారు. ఈ అధ్యాయం చివరలో, _ తెలుగు భాష స్వరూప స్వభావాలగురించిన కొన్నీ లక్షణాలను పేర్కొంటారు: ఉదాహరణకు, క్రియ లేని వాక్యాలూ, పదాలలో 'ఊనిక* (ప్రాముఖ్యత, క్రియాన్వయం ఉన్నవోట కర్తను వాదకుంచటం మొదలైనవి. తర్వాత ఈ చర్చ, తెలుగులో ఖాషావైవిధ్యం అంటూ మాండలికత్క తీరు, శైలి, రీతి అనే తేడాలతో మొత్తం నాలుగు రకాలనీ చెబుతూ సోదాహరణంగా వివరిస్తారు.

మూడవ అధ్యాయంలో వాక్యం ఆ వాత్య బంధం - వాక్య సముదాయం గురించి చర్చించారు. వాక్యాన్ని నీర్వచిస్తూ వాక్యం పలుకు రూపంలో దిగుడు స్వరంతో కూడి ఉంటుంది. రచనలో అయితే చుక్కతోకూడి ఉంటుంది. వాక్యానీకి ముగింపు ఉండాలి అంటారు. ఇక్కడ భావం గురించి చెప్పకపోయినా ముందు చెప్పినట్లు ఖావ సమగ్రత కూదా చెప్పారనుకోవాలి. వాక్య సముదాయాల నిర్మాణంలో సంయోజకత్వాన్ని సూచించే పదాలు ఉంటాయి. నాల్గవ అధ్యాయంలో నాదోత్పత్తిని గురించీ ఆ తరువాత వచ్చే ఐదూ ఆరూ అధ్యాయాలలో వర్దాల వర్గీకరణ, సంధి అచ్చుల సమీకరణాలకు అవసరమైన వివరణ ఉంది.

ఐదో అధ్యాయంలో తెలుగు ధ్వనుల ఉత్పత్తినీ, స్థాన, కరణ,

| తెలుగుజాతి పత్రిక ఖవ్మునుడి సెప్టెంబర్‌-2020 |