పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అది తనకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లు ఆమె అంటుంది. తనకు బొత్తిగా పరిచయం లేని వాళ్లు తన యింటికి రావడం, వాళ్ల యిళ్లకు తాను వెళ్లడం తనకు సుతరామూ యిష్టంలేదు. అయినా, అది యిక్కడ సంప్రదాయం. తన యింటికి వచ్చే వాళ్లలో మిసెస్‌ ఎస్‌ అంటే ఆవెకు చాలా యిష్టం. ఆమె త్వరలో ఇంగ్లండు వెళ్లిపోతుందని, రెండు రోజులు మాత్రమే తనతో గడిపిందని రాసింది. కొత్త రిజిస్ట్రార్‌ హామిల్టన్‌, ఆయన భార్య యిప్పుడు జడ్జిగారి యింట అతిథులుగా వున్నారు. మంచి బంగళా దొరికేదాకా వాళ్లు జడ్జిగారింట్లోనే వుంటారు.

రాజమండ్రిలో క్లర్జిమాన్ లేరు గనక, ఇంగ్లీషు చర్చితో జడ్జిగారే ప్రార్థన జరుపుతున్నారు. ఇది నంవ్రదాయం. ప్రార్థనకు ఇంగ్షీషువారంతా హాజరవుతారు, తక్కిన కులాలకు చెందిన ప్రొటెస్టెంట్లు కూడా వస్తారు. రాజమండ్రిలో చిన్న రోమన్‌ కేథలిక్‌ గుడి కూడా వుంది. దానికి పూజారి లేకపోయినా, సార్టెంట్‌ కీలర్‌ మావు రోజర్‌ మిశ్రజాతి (half cast) దాన్ని సంరక్షిస్తూంటాడు. అతను ఆగుడిని ఎల్లప్పుడు పరిశుభంగా వుంచి, కొవ్వొత్తులు వెలిగించి, పువ్వులతో అలంకరిస్తాడు. అతను డాక్టర్‌కి అసిస్టెంటు (డ్రెసర్)గా పని చేస్తూంటాడు. జడ్జిగారు గుడిలో ప్రార్థనలు జరుపుతారని తెలియగానే, తాను కూడా రావచ్చునా అని రోజర్‌ అడగ బంపించాడు. రావచ్చు నన్నారు కానీ, అతను రాలేదు. “ఏందుకు రాలేదో అని విచారిస్తే పాపం రావాలనీ అతను చాలా ఆశపడ్డాడు కానీ, దురప్రాంతం నుంచి ప్రీస్ట్‌ వస్తే ఏమంటారోనని, భయపడి రాలేదని, సార్జంట్‌ చెప్పారా ఆమె రాస్తుంది.

అక్టోబరు ౩వ తేదీ మొదలు పెట్టి, 15వ తారీకు కొంత రాసి, 27వ తేది పూర్తి చేసిన ఈ ఉత్తరంలో ఆమె రాజమండ్రిలో తన జీవన విధానం కొంత వివరిస్తుంది.

“ఇక్కడి జీవనసరళి, బంట్రోతులు, ఇళ్ల అద్దెలు వగైరా విషయాలు రాయమని నీ వుత్తరంలో కోరావు” అంటూ, ఆ వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెబుతుంది. పెద్దయిల్లు, దానిచుట్టూ రెండెకరాలతోట, ఇంటి అద్దె సంవత్సరానికి 60 పౌనులు. వంట సరుకులు చౌకే, కానీ వేడివల్ల ఏదీ నిలవ వుండక చాలా దుబారా అవుతుందంటుంది. కసాయి వాడికి గిట్టుబాటు కోసం మాంసం అవనరమైన దానికంటే, ఎక్కువే తీసుకోవాల్సి వన్తుంది. బంగాళాదుంపలు రాజమండ్రిలో దొరకవు, మద్రాసు నుంచి తెప్పించుకోవాలి. మిగతా కాయగూరలు జడ్డిగారి తోటలో పండిస్తారు. వాళ్లకి కోళ్లఫారం కూడా వుంది.

నౌకర్లకు జీతబత్వాలు తక్కువే అయినా, వాళ్ల సంఖ్య ఎక్కువ కావడం వల్ల ఖర్చు ఎక్కువగా వుంటుంది. ఎ - పొదుపుగా వుండాలని కొద్దిమంది నౌకర్లను పెట్టుకొన్నాడు. వాళ్ళ జాభీతా యిదీ -

బట్లరు ఒకరు, డ్రెస్ బోయ్‌ (వేలెట్‌) ఒకరు, పాత్రలు కడిగి దీపాలు వెలిగించేందుకొక మాటీ, ఇద్దరు ఆయాలు, ఒక “అమ్మ” (వైట్ నర్స్ - బిడ్డకు పాలు కుడి పేదాది) ఒక వంట మనిషి, ఒకటున్ని కచ్చి, (ఇంటి పని మనిషి), ఇద్దరు తోటమాలీలు, ఆరుగురు బేరర్లు, నీళ్లు తెచ్చేందుకు ఒకడు, ఇద్దరు - గొర్రెల కాపర్లు గడ్డికోసే వాళ్ళు ఇద్దరు, కుక్కను చూచుకొనే మనిషి (డ్రాగ్‌ బోయ్‌) ఒకడు, కోళ్లను సంరక్షించేందుకు ఒకడు, ఒక చాకలి, ఒక దర్జీ, ఒక వేటగాడు, అమ్మకొక వంటమనిషి మొత్తం 27 మంది. చాలా తక్కువ కింద లెక్క మంది ఎక్కువ పని తక్కువ. ఆ పనీ కూడా నచ్చుగా చేస్తారు. ఎవరైనా భోజనానికి వస్తే, వంటవాడు తనకొక మాటీలేనీ, నహాయకుడుకాని కావాలని ఏడుస్తాడు. అప్పుడు ఎవరినైనా కూలికి ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అందరికీ తిండి ఇక్కడే. “ఉన్నత కులాల'వారు మాత్రం ఆ భోజనం ముట్టుకోరు. కానీ, అస్పృశ్వ్యుల (Paraiah)యిన మాటీలు, చిన్ని చిన్ని నౌకర్లు మాత్రం ఏది దొరికినా సంతోషంగా తినేస్తారు. “ఆయా” అగ్రకులన్థురాలు, అందుకోసం ప్రత్యేకంగా ఒక వంట మనిషిని పెట్టాలి. ఇంత చేసినా, ఎప్పుడైనా పొరపాటున ఇతర కులాలవాళ్ళు దగ్గరకు వచ్చారంటే చాలు, ఆవిడ ఆ రోజంతా కడుపు మాడ్చుకొంటుంది. ఆవిడ వంటకుగాను ఆవరణంలో ప్రత్యేకంగా కొబ్బరాకులతో చిన్న యిల్లువేసి, బీడ్డకొక నర్ఫును ఏర్పాటు చేశారు. సాధారణంగా మా పనివాళ్లు తమ తమ బిడ్డల విషయం పట్టించుకోరు కానీ, వాళ్ళకేమ్టైనా జరిగితే మాత్రం, యజమానుల మీద నీిందమోపుతారు. అందువల్ల “ఆయా” బిడ్డ విషయంలో “ఆమె” కూడా అప్రమత్తంగా వుంటుంది.

అలాంటి 'ఆయా” ఒకసారి సారాయి, నల్లమందు సేవిస్తుండగా పట్టుబడ్డ్దదంటే ఆశ్చర్యంగా వుంటుంది. ఆవిడ అప్పుడప్పుడు బయటకు వెళ్ళి పొలికేకలు పెట్టి నానా గొడవా చేస్తుంది. ఆ సమయంలో ఆమె దగ్గరకు వెళ్లేందుకే నౌకర్లు భయపడతారు. పిశాచిలాగా అరుస్తుందని వాళ్లు అంటారు. ఆ పిశాచి కేకలతో అందరూ బెదిరిపోయి, ఎక్కడివాళ్లక్క్మడ దాక్కున్న తర్వాత, ఆమె బంధువులు మెల్లగా బయటకొచ్చి ఆమెకు సారాయి, నల్లమందు యిచ్చి శాంతింపజేశారు.

ఇంటి సామాన్లు కొనడం గురించీ చెబుతూ, తమ బట్లరు రోజూ మార్కెట్లో వస్తువులుకొని, బిల్లులు తెస్తాడని, ఆ బిల్లుల్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేసే కోర్టు గుమాస్తా వస్తువుల పేర్సు చిత్రాతిచిత్రంగా రాస్తాడనీ ఆమె అంటుంది. ఇద్దరూ కలిసి కొన్ని కల్పిస్తారు అంటూ కొన్నీ ఉదాహరించింది. one beef of rump for biled"- "one mutton of line beef for alamoor estoo" meaning a-la-mode stew; - "mutton for curry pups (puffs)," "durkey for stups" (stuffing for turkey); "egg's for saps, snobs, tips, and pups" (chops snipes tipsycake, ana puffs); - "mediation (medicine) for ducks"; - and at the end "ghirand totell" (grand total), and "howl balance".

(తరువాయి వచ్చే సంచికలో...)

సవరణ:

ఆగస్టు సంచిక 4వ పుటలో - పెద్దలు నెమ్మాని వేంకట రమణయ్యగారికి 'శద్ధాంజలి'లో ఆయన జూలై 1వ తేదీన కన్నుమూశారని ముద్రణలో వచ్చింది. ఇది తప్పు. ఆయన జులై 24న మరణించారు. ఈ తప్పు చోటు చేసుకొన్నందుకు మన్నించ గోరుతున్నాము.

- సంపాదకుడు, 'అమ్మనుడి'

| తెలుగుజాతి పత్రిక ఖవ్మునుడి సెప్టెంబర్‌-2020 |