పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఊహించే ప్రయత్నం చేయాలి.

3. తెలుగు పుస్తకాల్లో దర్శనమిచ్చే పదఘటనా వైచిత్రికి క్షణికంగా మురిసిపోయి ఆ తరువాత వాటిని అక్కడికక్కడే మర్చిపోకుండా “అవి ఏ ఆధునిక పద- అవసరాల్ని తీర్చగలవో?” అని ఉత్ప్రేక్షించే ప్రయత్నం చేయాలి.

4. మాండలిక పదాల్ని ఇతోధికంగా అధ్యయనం చేయాలి. అవి కూడా మాండలిక ప్రతిపత్తిని అధిగమించి మఱికొంత ఉన్నతశ్రేణిలో ఏ ఆధునిక పద -అవనరాల్ని తీర్చగలవో అని ఉత్ప్రేక్షించే ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ప్రామాణిక వాఢుకలు చేయజాలని పనిని మాండలిక పదాలు లెస్సగా నెఱవేఱుస్తాయి.

5. పదనిర్మాణ నిమిత్తం తెలుగు -సంస్కృత వ్యాకరణ గ్రంథాల్ని తఱచుగా తిరగేయాలి. వ్యాకరణ పరిజ్ఞానం లేకుండా అర్దవంతమైన, పదునైన పదాల నిష్పాదన సాధ్యం కాదు. ఒక మేస్త్రీ ఎంత గట్టిపనివాడైనప్పటికీ, ఇసుక, ఇటుక, సిమెంటు అనే ఉపచయాలు(inputs) లేకపోతే ఎలాగైతే ఏమీ చెయ్యలేడో, అదే విధంగా పద-ధాతు-ప్రత్యయ పరిజ్ఞానం లోపిస్తే ఇతరత్రా ఎంత మేధావులైనా వారు చేయగలది కూడా శూన్యం. పదనిర్మాణాలకి ఒక తార్మికమైన,హేతుబద్దమైన సుక్రమం (consistency) అవసరం. దాన్ని వ్యాకరణపరిజ్ఞానమ సమకూర్చగలదు. మనం మాట్లాడే భాషలోని పదాలూ, వాక్యాలూ వ్యాకరణమూ ఎంత తార్మికంగా ఉంటే మన జాతి యొక్క మేధాశక్తి కూడా అంత హేతుబద్దంగానూ, నాగరికంగానూ ఉంటుంది. ప్రజలూ, ప్రజా భాష - వీటికి ఆ పరిజ్ఞానం అవసరం లేదనీ, అజ్ఞానమే సుజ్ఞానమనీ, రాచపుండు రాచబాట అని వాదించే మహామేధావులకు దూరం నుంచే ఒక నమస్కారం పెట్టవలసినది. ఎందుకంటే వైజ్ఞానికంగా అభివృద్ది చెందిన ఆంగ్లంలో కూడా ప్రామాణిక శాస్త్ర పదజాలమంతటికీ వ్యాకరణం ఉన్నది. అందు చేత వ్యాకరణం లేకుండా ఆంగ్లం లేదు. తెలుగైనా అంతే !

6. హిందీలాంటి ఇతర భాషల్లో ఇంగ్లీషుకి ప్రతిగా వాడుతున్న సంస్కృత సమార్ధకాల్ని యథాతథంగా తెలుగులోకి దింపుదల చేయడంలో ఉన్న సాంస్కృతికమ్లైన ఇబ్బందుల్ని సమీచీనంగా గుర్తెఱగాలి. వారూ, మనమూ వాడుతున్నది గీర్వాణమే అయినప్పటికీ వారి వాడుకా, మన వాడుకా అచ్చుమచ్చుగా ఒకటి కాదు గనుక ఆ పదాలు తెలుగువారికి సద్యః స్ఫురణ కావని గుర్తించినప్పుడు వాటిని వర్ణించి మనం స్వకీయంగా, సరికొత్తగా పదనిష్పాదన చేయడమే వాంఛనీయం.

(తరువాయి వచ్చే సంచికలొ...) ———————————————————————————————————————————————————————————————————————————————————————————————————— 12వ పుట తరువాయి.......

ఎరుకల భాష-మాతృభాషలో బోధన

అలాంటప్పుడు ప్రాధమిక స్థాయిలో విద్యాబోభన జరుగుతున్నప్పుడు అది తప్పకుండా మాతృభాషలోనే అయి ఉండాలి. అమ్మభాషలో ప్రేమ ఉంటుంది. లాలన ఉంటుంది. కఠినమైన విషయం కూడా సులభంగా అర్ధమౌతుంది. ఉదా॥కు: ఒక పాప/బాబు బడికి వెళ్ళడం ప్రారంభం చేసినపుడు అక్కడ కూచోనని, ఉండనని ఏడుస్తారు. కొద్ది రోజులు అమ్మ, నాన్న లేదా దగ్గరి వాళ్ళెవరైనా కొద్దిగా శిశువుకు బడి పరినరాలు, వ్యక్తులు ఉపాధ్యాయులు అలవాటు పడే వరకు తోడుగా ఉంటారు. తర్వాత క్రమంగా బడి అలవాటటైపోతుంది.

అలాగే ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన తెలియని కొత్త భాషలో జరిగే బదులుగా మాతృభాషను మాధ్యమంగా బోధన జరిగితే అమ్మనే శిశువుని దగ్గర కూచోబెట్టుకుని కథ చెప్పినంత ఆనందంగా పాఠం అవగాహనకు వస్తుంది. ఈ విషయాన్ని అటు తల్లిదండ్రులు, ప్రభుత్వాలు, అధికారులు అద్ధం చేసుకోవాలి. మాతృభాషలో విద్యాబోధన సాగడానికి కృషి చేయాలి.

ఎరుకల భాష వంటి గిరిజన తెగల భాషలను మాట్లాడే ప్రాంతాల్లో తప్పకుండా అ భాషలో బోధన జరిగేలా చూడాలి. ఆ భాషకు లిపి లేకపోయినా ఆ స్థాయిలోని పుస్తకాలను, అయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న ఇతర భాషలో అచ్చువేసినా కూడా, మౌఖికంగా బోధన మాత్రం ఎరుకల భాషలోనే జరగాలి.

పరీక్షించే విదానం కూడా మౌఖికపరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. శిశువు పాఠ్యాంశాలను చక్కగా నేర్చుకోవడమే కాకుండా స్పష్టంగా వ్యక్తీకరించే సామర్ధ్యాన్ని నేర్చుకుంటాడు.

అంతేకాదు. మాతృభాష ద్వారా ఆంగ్లం వంటి ఇతర భాషలను కూడా సులభంగా నేర్చుకుంటాడు. అటు భాషా పరిజ్ఞానం, ఇటు విషయ పరిజ్ఞానం కూడా శిశువుకు చక్మగా అలవడుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:

ఈ స్థాయిలో జోధనకు నియమించే అధ్యాపకులు కచ్చితంగా ఆ భాషా వ్యవహర్తలై ఉండాలి. ఒకవేళ వారికి సరైన అర్హతలు లేకపోయినా, కనీస స్థాయి అంటే డిగ్రీ వరకు చదువుకున్నాా ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ లేకపోయినా కూడా, వారికి తాత్మాలికంగా కొంత శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని అధ్యాపకులుగా నియమించుకోవాలి. ఈ స్థాయిలో జోధనకు మాతృభాషా మాధ్యమం ఎంతో ప్రధానం అనే విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది.

ఈ సందర్భంలో ఎరుకల లాంటి ఎన్నో గిరిజన భాషలను వాటి విశిష్టతను, విజ్ఞానాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిదీ. భాషాశాస్త్రవేత్తలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. గిరిజన సమాజాన్ని ఉత్తేజ పరిచి, వారి ప్రాధాన్యతను భాష ప్రాచీనతను గౌరవించాల్సిన బాధ్యత మనందరిదీ.

డా. పి. వారిజారాణి సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం

డా. వి. ఎం. సుబ్రహ్మణ్య శర్మ సహాయ ఆచార్యులు (C), భాషా శాస్త్రశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం

వినియోగించే కొద్దీ భాష వికసిస్తుంది. వాడనిభాష వాడిపోతుంది.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

25