పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా చెవులను నేనే నమ్మలేకపోయాను. ఆమె తెలుగు మాట్లాడుతోందా? నేను తప్పుగా విన్నానేమోనని మరో మాట కోసం చూస్తూ కూర్చున్నా

“మా అయ్య కదా, తినరా..” అంది కాస్త గోముగా. వాడు వెంటనే నోరు తెరచాడు.

నేను విన్నది నిజమే ఈమె తెలుగే మాట్లాడుతోంది. కానీ వాళ్లను డిష్టర్స్‌ చేయదలచుకోలేదు. ఆమె వాడికి అన్నం తినిపించి, తనూతినే దాకా వేచి ఉండి ఆ తరవాత వాళ్ల దగ్గరికి వెళ్లాను.

“అవ్వా, మీది తెలుగా?

'అవు.. అన్నా మాది తెలుంగే..

“ఇక్కడ ఇంకా మనోళ్లు ఎక్కదెక్కడ ఉన్నారు?”

“మన కుదురు వాళ్లు చానే ఉందారు. అదో అక్కడ పాములాడించేవోడు మన తెలుంగోళ్లే.. అంది.

'అవ్వా. నీ పేరేమిటి?”

'ముత్తుమారి”

“నీ మనవడి పేరు..?”

“విజయ్‌”

“నాకూ జోస్యం చెబుతావా అవ్వా?” ముందుకు చేయి చాచా.

ఆమె నా చేయి చూస్తూ.. “నీకు అన్నదమ్ముల్స్‌ అక్కచెల్లెళ్లు లేరు, నువ్వొక్కడివే. పెద్ద కార్యం పైన ఈ దవ్వు వచ్చినవ్‌. నీవు అనుకున్నది అవుతది. బిరానే..” అంటూ జోస్యం చెప్పింది. ఆమె చేతిలో కొన్ని డబ్బులు పెట్టా.

“మనోళ్ల దగ్గర తీసుకోను. అంది.

“మనవడికి ఏదైనా కొనివ్వు అవ్వా... నేను వస్తా అంటూ ఆమెకు వీడ్కోలు చెబుతూ అక్కడి నుంచి గేటు బయటికి వచ్చా.

గేటుకు ఓ పక్క ఓ పెద్ద పెట్టె పెట్టుకుని ఓ వ్యక్తి కూర్చున్నాడు. అతడి ముందు ఓ బుట్ట ఉంది. అందులో పాము ఉంది. అప్పుడప్పుడు ఆ బుట్టని కదిలిస్తున్నాడు. పాముల ఆటను చూసేందుకు ఎవరైనా వస్తారేమోనని ఆశగా అటూ ఇటూ చూస్తున్నాడు.

అతడి దగ్గరగా వెళ్లి 'మీరు తెలుగా” ప్రశ్నించా.

“అవునన్నా మేం తెలుంగే.

“అన్నా మీ వివరాలన్నీ తెలుసుకోవాలని ఉంది, మీరు ఇండియా నుంచి ఎప్పుడు ఇక్కడికి వచ్చారు'.

“మేం పుట్టిందీ, మా తాతముత్తాతలు పుట్టిందీ ఇక్కడే, మేం ఎప్పుడూ ఇండియా వెళ్లలేదు, మేం లంకోల్లం'

ఆయన మాటలకు ఆశ్చర్యపోతూ .. 'మరి తెలుగు ఎలాగ వచ్చు

“మేం తెలుంగోళ్లం, మా తల్లి బాస తెలుంగే”

“శ్రీలంకలో తెలుంగు వాళ్లు ఉన్నారా”

చాలా మంది, మన కుదుర్లు చానే ఉన్నాయి, మా ఊరు ఇక్కడికి దగ్గరే వస్తావా?”

“తప్పకుండా అన్నా మీ పేరు?”

“మసన్న' అని చెబుతూ 'సోమూ...” గట్టిగా కేకేశాడు దూరంగా కోతిని ఆడిస్తోన్న వ్యక్తిని చూస్తూ.

'నీ పేరు ఏమిటి.. ఎక్కడ నుంచి వచ్చావ్‌?” మసన్న నా వివరాలు అడిగాడు.

“నా పేరు సూర్య, ఇండియా నుంచి వచ్చాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అని ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడంతా తెలుగే మాట్లాడతారు.” నా గురించి వివరించాను. ఇంతలో సోము వచ్చాడు. అతడికి నన్ను పరిచయం చేస్తూ..'మనోదే, ఇండియా నుంచి వచ్చాడు" అని చెప్పాడు.

సోము సంబరంగా నన్ను చూసి నవ్వాడు. అతడు పాను నములుతున్నాడు. పాతికలోపు వయసు ఉంటుంది. మసన్న నలభైకి దగ్గర్లో ఉంటాడు. సోము భుజం మీద కోతి కూర్చుని ఉంది. దాని మెడకు బెల్టు వేసి తాడు కట్టారు. అది అల్లరి చేస్తుంటే కోతి... కోతి అని తెలుగులోనే పిలుస్తున్నాడు. నాకు భలేగా అన్పిస్తోంది.

“సోమూ, నేను సూర్యని మనూరికి తీసుకువెళ్తున్నా నువ్వూ వస్తావా, నీ యవ్వారం చూసుకుని రాత్రికి వస్తావా?

“మీరు వెళ్లండి, నేను రాత్రికి వచ్చి కలుస్తా అన్నాడు.

మసన్న తన పాముల బుట్టల్ని పెట్టెలో పెట్టి తాళం వేశాడు. “నీ సామాను ఎక్కడ సూర్యా, బండి మీద వెళదామా” అడిగాడు.

“అన్నా నా సామాను పక్కనున్న హోటల్లోనే ఉంది. కొలంబో నుంచి టాక్సీలో ఇక్కడికి వచ్చాను. మనం ఊరికి టాక్సీలోనే వెళ్దాం”

“అయితే నువ్వు హోటల్‌ ఖాళీ చేయి, ఇక్కడ ఎన్నాళ్లున్నా మా తావులోనే ఉండాల” ఆర్డర్‌ చేసినట్టుగా చెప్పాడు మసన్న.

కాదనలేకపోయాను. హోటల్‌కి వెళ్లి చెక్‌ అవుట్‌ చేసి మసన్నతో పాటు వాళ్ల ఊరికి టాక్సీలో బయల్లేరా. కొన్ని బంధాలు విచిత్రంగా ఉంటాయి. నిన్నటి వరకూ శ్రీలంకలో తెలుగు వారుంటారన్న సంగతే నాకు తెలియదు. ఈనాడు నాకు ఇక్కడ ఓ అన్న దొరికాడు. మాది రక్త సంబంధం కంటే గొప్పదైన తెలుగు బంధం.

(ప్రయాణం మొదలవగానే ప్రవల్లిక గుర్తుకు వచ్చింది. క్యాండీలో కనబడలేదు, అనురాధపురాలో కనపడలేదు తను. ఇక మగిలినవి సిగీరియా, దంబుల్లా, పొలన్నురువా. ఆరోజు కృష్ణానదిలో లాంచీలో నేను చూసింది ప్రవల్లికేనా. తన కోసం ఇంత దూరం వచ్చాను. తను కన్పించకపోతే ఎలా?

“సూర్యా, నిమ్మకుండిపోయావ్‌.” మసన్న ప్రశ్నకు ఈలోకానికి వచ్చాను. తనకి అంతా చెప్పేద్దామని అనుకున్నా నమ్ముతాడో లేదో అన్న భయం. కానీ ఎక్కడో ఓచోట మొదలుపెట్టాలి కదా?

“అన్నా ఈ మధ్య శ్రీలంక నుంచి ఏదైనా బౌద్ధ బృందం ఇండియా వచ్చారా?

“అవును, ఎవరో కాదు మన జయశ్రీ మహాబోధి కేంద్రం వాళ్లే ఇండియాకి బుద్ధ పాదాల యాత్ర నిర్వహించారు. ఇరవై రోజుల యాత్రలో సుమారు 70 మంది ఇక్కడి నుంచి ఇండియాకు వెళ్లారు”. మసన్న మాటలు నాకు ప్రాణం పోశాయి.

“అన్నా వాళ్లలో నీకెవరైనా తెలుసా” కుతూహలంతో అడిగాను.

“ఎందుకు లేరు సూర్యా, చాలా మంది ఉన్నారు. అంతెందుకు మా అన్న కూతురు కూడా వాళ్లతో వెళ్లింది. మనూరిలోనే ఉంటాది. ఆ యమ్మతో నిన్ను కలుపుతాలే' అన్నాడు.

“నిజంగానా అన్నా ఇంకా ఎంత సేపు ప్రయాణం”

  • పావు గంట పడతాది.

అంతకు మించి తను అడగలేదు, నేను చెప్పలేదు. దేనికైనా సమయం రావాలని అనుకునేవాడిలో నేను ముందుంటా. కానీ ఆ సమయం ఎప్పుడొస్తుందో తెలియక్తతికమకపదేది కూడా నేనే.

(తరువాయి వచ్చే సంచికలో...) | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |