పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంప్రదాయం - సాధికారత

డా॥ పి. శివరామకృష్ణ 'శక్తి'

94414 27977

'నీకోసం, నీ మంచికోసం-సదా నీ అభిమానిగా ఉండిపోతాను'-3

(“దేలెం ఒసం సకుని అసంగ్‌- దోహ్వానం సాయ తాయ” సవర పాట.)

(గత సంచిక తరువాయి...)

మొత్తంమీద, పరస్పర విరుద్ధ మైన దృక్సధాల, నాయకత్వాల, తాపత్రయాల నేపధ్యంలో, ఒకనాటి సవర దేశంలో ఉద్యోగవర్గం మధ్య పెరుగుతున్న మల్లిపురం జగదీశ్‌ వంటి గిరిజన రచయితలు, తమ మూలాలు తెలుసుకొని రాయాలని అతని కధాసంకలనం శిలకోల” ముందు మాటలో అతని సాహిత్యగురువు గంటేడ గౌరునాయుడు ఆశిస్తారు.

గిడసబారిన రోల్‌ మోడళ్ళు

“గిరిజనులకు రోల్‌ మోడళ్ళు లేరు. గిరిజన సాహిత్యం అంటే ఉద్యమ సాహిత్యం అనే పేరు పడిపోయింది, విశాఖ మన్యంలో 'లోల్లోసి' అనే పాటలు ఉండేవట అని 'బముళ లో జగదీశ్‌ అంటుంటే, ఆ వ్యాస సంకలనం సంపాదకుడు, శిలకోలలో ముందుమాట రాసిన జానపద సాహిత్యవేత్త ఏ.కే. ప్రభాకర్‌, అంబేద్మర్‌ సార్వతిక విద్యాలయం జానపద విజ్ఞానంకోర్సులో, తన వ్యాసాలతోపాటు ఉన్న గిరిజన సంస్కృతి మీద వ్యాసాన్ని గుర్తు చేయలేదు. నిజానిక్తి ఆ వ్యాసం, మొదటి తెలుగు (ప్రపంచ మహాసభలు(1976) ఆంగ్లంలో ప్రచురించిన, నాటి గిరిజన పరిశోధనాసంస్థ సంచాలకుడు డి.ఆర్‌. ప్రతాప్‌ చిన్న పుస్తూనికి సంప్రదాయ సాహిత్యగంధం అద్దింది. "నెలనెలా వెన్నెల సి.వి కృష్ణారావు మొదలుకుని నేటి వరకు ఎందరో రచయితలు ఆ కుదురునుంచి వచ్చారు. కాని ఇటువంటి ప్రయత్నం కాదుగద్హా అసలు ఆ జోలికే వెళ్ళలేదు.

ఎలాచూసినా మనకి గిరిజనసాహిత్యం తక్కువదే అనేభావం ఉంది" అంటారు “ఇప్పపూలు' ముందుమాటలో జయధీర్‌ తిరుమల రావు. 91లో విశాఖ ఐటి.డి.ఎ తెలుగు గిరిజన గీతాలు” (పరివర్ధిత ముద్రణ “కొండకోనలలో తెలుగు గిరిజనులు) 200 కాపీలు కొని ఉపాధ్యాయులకు పంచింది. వాటిలో ఆ 'లోల్లోసి్‌ పాటలున్నాయి. 1976లో అరకులోయలో గిరిజనులను అభివృద్ధి చేయటానికి జీవితం అంకితం చేసిన కెనదా దేశీయుడు గుస్తాఫ్‌ 'ఆదివాసీ పండుగలు” ఆ సంస్థ ప్రచురించింది. 'వారి ఆహార సేకరణ , ఉత్పత్తి దశలో సాగే వారి ఆదిమజీవితం లాగ్కే వారి పాట రూపం మార్పు లేకుందా ఉంది” (కే.ముత్యం 38) అంటూ తెలిసి తెలియక చేసే వ్యాఖ్యానాలకు, సవర జాతాపుల ఇటీవలి సంప్రదాయ పాటలను(నీకోసం ,నీ మంచికోసం సదా నీ అభిమానిగా ఉండిపోతాను' 'దేలెం ఒసం సకుని అసంగ్‌- దోహ్వానం సాయ తాయా) పార్వతీపురంలో ఆర్ట్స్‌ సంస్థ ప్రచురణ, బదులిచ్చినట్లుగా భావించ వచ్చు.(సవర జాతాపుజీవన సరాగాలు 2011) సవర రచయిత జగదీశ్‌ ఈ పార్వతీపురం 0% లోనే పనిచేస్తున్నాడు.

ఇస్తినమ్మ వాయనం

తెలుగు గిరిజనుల మాండలికం తెలిస్తేనే మిగిలిన కొండ భాషలలో నుడికారాలు బోధపడతాయి! అని భద్రిరాజు 1960లలోనే స్పష్టం చేశారు. కాని వారి శిష్యులు గిరిజన మాతృభాషలలో విద్యా బోధన అని మొక్కుబడి వాచకాలు తయారు చేసారు. గిరిజన సంక్షేమ శాఖలో సంపాదకులు ముందుమాటలో, ఆసక్తి గలవారు చదవవలసిన పుస్తకాలజాబితా ఇచ్చి, వాటిని సంక్షిప్తంగా పరిచయం చేస్తే బాగుండేది. ఇటువంటి ప్రాజెక్ట్‌లన్నీ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్న ధోరణిలో నడుస్తాయి. విశ్వవిద్యాలయాలలో అంత్రపాలజి శాఖలుకూడా తక్కువతినలేదు. ప్రతీ సంవత్సరం ఆ శాఖలో [౮ విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మార్గదర్శనంలో ఒక గిరిజన గ్రామాన్ని నెల రోజుల పాటు అధ్యయనం చేస్తారు. 2008 నుండి అటవీ హక్కుల గుర్తింపు చట్టం అమలౌతుంటే ఆ అమలుకు పునాది అయిన సంప్రదాయ (గ్రామపటాన్ని ఒక్కచోట వీళ్ళు గీయలేదు. “సంతోష చంద్రశాలొలలో స్థానాచార్యులకు గిరిజనుల పాటలలో “చుక్కల సురిటిపల్లిలో “వెన్నెల వెదురుపల్లిలో *“చూడగల్ల, అడగల్ల బయళ్ళు” కనిపించలేదు. ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రచయితలు, హక్కుల సంఘాలు జనాన్ని ముఖ్యంగా గిరిజనులను నాలుగు స్తంభాలాట ఆడిస్తున్నారు.

1940 లలో సంథాల్‌ పరగణా కలెక్టర్‌ గా ఆంగ్లేయుడు &0౧6వాళ్ళ సాహిత్యం సంప్రదాయాలను గ్రధస్థంచేస్తే, కొంతకాలం గిరిజన శాఖ కమిషనర్‌గా ఫుల్‌ టైట్‌ ఫెలోగా ప్రముఖ ఆంగ్ల రచయిత శితకాంత మహాపాత్ర, 140661019240౧ 01 2౧6 ౧౪౫లో తరువాతి పరిణామాలను 'పేర్యాన్నాడు తప్పు, విశేషమైన కృషి చేయలేదు. అలాగే ఆక్రోశంతో రచనలు చేసి, పనిచేసిన మహాశ్వేతాదేవి, అంతరిస్తున్న సాహిత్యం నిలబెట్టుకుంటూ, మారుతున్న రోజుల్లో భూమి అడవి నీరు దక్కించుకోటానికి కావలసిన లెక్కాడొక్కా దారి చూపించలేదు. ఇలా సాహిత్యగాళ్ళంతా తమ ప్రపంచంలో తాము బతికారు. కానీ రాంచీ విశ్వ విద్యాలయం ఉపకులపతి రామ్‌దయాల్‌ ముండా గురువు రఘునాధ్‌ ముర్ము లు గిరిజనుల సంప్రదాయ సాహిత్యాన్ని నిలబెడుతున్నారు. కాబట్టి ఈ పోకడలలో, రచనలలో పాత్రలలో వైరుధ్యాలను, పరిమితులను తెలుసుకుంటూ ముందుదారి వెతుక్కోవాలి.

గిరిజనుల వారసత్వం

చిరకాలంగా తూర్పు, కనుమలను పాలించిన గిరిజన నాయకులు మధ్య భారతాన్ని అందులో ఉత్తరాంధ్రాని, ముఖ్యంగా, విశాఖనగరం అభివృద్ధి చేసిన (క్రమం వేనోళ్ళ చాటుకుంది. ఆంధ్రవిశ్వ | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |