పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విద్యాలయం కులపతి విక్రమదేవవర్శ, రాణి చంద్రమణిదేవి, కురుపాం మార్కెట్స్‌ తాజ్‌మహల్స్‌ దసపల్లా, గిరిజనులతో వియ్యమందిన అనకాపల్లి జమీందారుల ఏవియన్‌ కళాశాల వగైరాలు, యానాది ఎరుకల విముక్తికి జీవితం ధారపోసిన వెన్నెలకంటి రాఘవయ్య వంటి వారి కృషి ఈ రోల్‌ మోడల్స్‌ ఇవేళ చదువుకున్న గిరిజనులకు తెలియవంటే, అందుకు, చాళ్ళము శమతుట్టు శన్పుకునటున్న బుద్ధిజీవులను, వాళ్ళు చెప్పే చదువులను తప్పు పట్టాలి. దళితులలో జాషువా, నాజర్‌, చీమకుర్తి నాగేశ్వరరావు బడి చదువుల వల్ల కాదు, తమ అధ్యయనంతో, ప్రతిభతో అజరామరమైన ప్రభావం చూపించారు. గిరిజన రచయితలకు, తము వారసత్వం గురించి అధ్యయనం చేయాలనే ఆసక్తి, పరిశ్రమ తక్కువైనా, తమసమస్యలు తెలుసు. వాటిని వ్యక్తీకరించే శిల్పంలో “సహానుభూతి” కనిపిస్తుంది. కానీ వారి కథావస్తువు ఆశ్రమ స్కూళ్ళు, మతం మారటం, నిర్వాసితులు కావటం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సమస్యలు గిరిజనులకే పరిమితం కావు. జగదీశ్‌ “అక్షరాల దారిలో సవర పిల్లడు 'సన్నాయి” పాటలు పాడించే మాస్టారికి దగ్గరౌతాడు. మాస్టారు వాళ్ళ ఊరు వెళ్ళినపుడు వాళ్ళ వాద్యాలు, అందులో సన్నాయిని చూస్తాడు. అది షెహనాయికి మాతృక అనిగమనిస్తాదు. అతన్ని బడిదగ్గరలో సన్నాయి విద్వాంసుడి దగ్గర పెడతాడు. అతడు మరో షేక్‌ చిన మౌలానా సాహెబ్‌, 'బిస్మిల్లాఖాన్‌ అవుతాడు. గిరిజన 'ఘరానా'లకునాంది పలుకుతాడు. లేదా మరో ద్రాయింగ్‌ మాస్టారయికే, వాళ్ళ ఉళ్ళో గోడల మీద బొమ్మలు 'ఇడిసింగ్‌” చూసి, అతదిని పికాసో అంతవాదిని చేస్తాడు అని కధ తిరిగిరాస్తే అది సవర కథ అవుతుంది. ఈ బొమ్మలు వేయటాన్ని పాడేరులో 'గన్నికలు (జలకన్యలు) “వలచటం' ఆవాహన చేయటం, మోహిం చటం అంటారు. ఆ మూలాలు కథల్లోకి తెస్తే పికాసోలు, చిను అబేలు వస్తారు. మన చదువులలో లోపించిన అటువంటి నేటివిటీ రావాలంటే కధ, జనం నోట్లో నలగాలి.

“తనంత తానే వచ్చేది ఏమిలేదు"

ఈ సందర్భంగా త్రిపురనేని, కొ.కు. ఇచ్చిన సలహాలు రచయితలు మరువరానివి. 'అధ్యయనం లేకుందా ఎవరికీ శబ్ద సంపద పెరగదు. తనంతతానే వచ్చేది ఏమిలేదు” (సాహిత్యంలో వస్తు శిల్పాలు. 148) అందునా గిరిజన సాహిత్యం అంగడిలో దొరికే వస్తువు కాదు.

“ఈనాడు రచయితలకు పెద్దగా భాషాజ్ఞానమూ, పాండిత్యము, ప్రాలీన సాహిత్య పరిచయమూ అవసరములేదన్నది ఏనాడో నిర్ణయమయింది. కాని వారికీ జీవితానుభవం, సామాజిక దృక్పధము కూడా అవసరం లేదన్నది రాను రాను రుజువవుతున్నది. ఇతివృత్తాలలో పాత్ర పోషణలో, సన్నివేశాలలో ఎలాటి వాస్త్రవికకా అవసరం లేద” (కవిత్వం చైతన్యం'157).

“సాహిత్యం జీవిత వృక్షానికి పూసే పువ్వు చెట్టుకు పూలు పూస్తాయి గాని పువ్వుకు పూలు పూయవు, సాహిత్యానికి పుట్టే సాహిత్యం నాకు ఆనాడే కృత్రిమంగాను, కాగితం పూవులాగానూ కనిపించింది. (ప్రజాసాహితి.కొ.కు ప్రత్యేక సంచిక. 10) పరిశీలన గమనించాలి. నేటివిటీ లేని రచనలు 'కాగితంపు పూలుగా మిగిలితే - అడవి సంప్రదాయంతో మమేకమైనవి గరికపూలైనా మనసును ఆకట్టుకుంటాయి.

“ప్రభత్వం గుర్తింపు కావాలి" అని రచయితలు అంగలారుస్తుంటేే చెంచులు, కొందరెడ్డు కొండదౌరలు తమ సంప్రదాయ సాహిత్యాన్ని సేకరించి 'గిరిగింజ గిరిమల్లెలు” "నల్లమలలో చెంచు ప్రపంచం “గోదావరి లోయలో కొందరెడ్ల బతుకు కధలు" ప్రచురించారు. నాయక్‌ పోడు పసుల బుచ్చయ్య తన తెగ సంస్కృతీ మీద (ప్రచురణలు తేవటమే కాక, చిత్రకారుడుగా రాణిస్తున్నాడు. గిరిజన సంక్షేమశాఖ తయారు చేయించిన 'గిరిజన సంస్కృతి- ప్రధానోపాధ్యాయులకు కరదీపిక విశాఖగిరిజనసంస్కృతి రెండువాచకాలు, మొజాయిక్‌ రామతీర్ధ గారి కొందరెడ్డి వాచకాలు ఎప్పుడు వెలుగు చూస్తాయో? గిరిజన సంస్కృతి, దోపిడీ-బుద్ధిజీవులను, సామాజికన్యాయం కోసం పనిచేసే ఉత్సాహవంతులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. కానీ సంస్కృతి, చరిత్ర, పలుకుబడి పునాది లేకుందా, నేలవిడిచి సాము చేసేవారు గిరిజనులైనా, పురజనులైనా తొందరగానే వెలిసిపోతారు.

పరిమళము చెడని, వాడని అడవిపూలచెండ్లు

అధ్యయనబలంతో, చింతకింది, గిరిజనులమీద చేసే రచనలు, “ప్రజాశక్తి వర్ణించినట్లు ఏడువారాల నగలుగా మిగిలిపోకుందా, వాటిలో 'సహానుభూతి” రాటుదేలుతూ, గిరిజనుల శ్రమైక జీవన సౌందర్యంలో “గంధ మృదుత్వశైత్యా'లను పుణికి పుచ్చుకుని "పరిమళము చెడని, వాడని” పూలచెండ్లుగా అడవి తల్లి సిగలో ఒదిగిపోవాలి. తనకు ఎంతో దూరంలోలేని, మాడుగుల, వంటలమామిడి సంతలలో గిరిజనులు, వారిలో సంప్రదాయ సాహిత్యం వ్యాఖ్యానించగల వారితో పరిచయం 'పెంచుకోవటంవల్ల, ఈ రచనల పూలకు కాయలు పంధ్సు విత్తనాలు, వాటినుండి చెట్లు వస్తాయి. మళ్ళీ, వాళ్లలోకి వెళ్లి మారాకు తొడుగుతాయి. ఆ పక్మనే కప్పరిమజ్జిలో కొంధులు ఒకప్పుడు (బ్రహ్మాండంగా నాటకాలు ఆడేవారని, పాడేరు దగ్గర అద్జుమండ గిరిజనులు తుంపాడ నాటకపోటిలో మొదటి బహుమతి పొందారని, ఉత్తరాంధ్ర జానపద సంపదను (గ్రంధస్థం చేస్తున్న బద్రి కూర్మారావు 'పేర్కాంటారు. ఆ రోజులు మళ్ళీ రావాలి. ఈ కధలను వాళ్ళు తమకు అనువుగా మార్చుకోవాలి.

గిరిజనోద్యమంలో, వాటిమీద వచ్చే, ఆధునిక సాహిత్యంలో లోపించిన చిత్తశుద్ధి లక్ష్యశుద్ధినీ సరిచేస్తూ వచ్చే రచనలు ముందుతరాలకు దారి చూపించగలవని, సవరపాటలో కోరుకున్నట్లు వాళ్ళ శ్రేయోభిలాషిగా... (నీకోసం, నీ మంచికోసం సదా నీ అభిమానిగా ఉండిపోతాను) రచయితలు మరింత కృషి చేస్తారని గిరిజనుల నుండి చిను అబేలు, బిస్మిల్లా ఖాన్‌లు, పికాసోలు, చట్టాలు అనులు చేయించుకోగల కథానాయకులు రావాలని, “తృణ కాష్ట్ర జలసమృద్ధితో కొండకోనలు మనకు భద్రత నివ్వాలని ఆశిద్దాం.

'తరుప్రసూతి పుష్పాణి మరుద్వహతి సౌరభం!

చెట్లు వూలు వూస్తాయి. గాలి నువాసనను మోనుకుపోతుంది. | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |