పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అక్కడి నుంచి వచ్చేశాను.

హోటల్లో భోజనం కానిచ్చి టాక్సీలో బయళల్డేరా. మన శ్రీకాకుళానికి చెందిన విజయుడు నిర్మించిన అనురాధపుర నా తదుపరి మజిలీ. అదే శ్రీలంక ప్రాచీన రాజధాని నగరం. అంతేకాదు ఆ నగరం ప్రసిద్ధ బౌద్ధక్షేతం. దీనికి కారణం అక్కడి బోధివృక్షం. బుద్ధుడికి జ్నానోదయం కలిగించిన బుద్ధగయలోని రాగిచెట్టు మొలకే ఈ చెట్టు. ఈ జయశ్రీ మహాబోధి రాగి చెట్టును మొలకగా అశోకుడి కూతురు సంధుమిత్ర భారతదేశం నుంచి శ్రీలంకకు తీనుకువచ్చింది. కచ్చితమైన కాలం తెలియడం వల్ల ప్రపంచంలో మానవుడు నాటిన అత్యంత పురాతన రారిచెట్టుగా ఇది పేరు తెచ్చుకుంది.

ప్రవల్లిక కన్పించలేదన్న అసంతృప్తి తప్పిస్తే నా క్యాండీ ప్రయాణం విజయవంతమైందనే చెప్పాలి. మన తెలుగు జాతికి నంబంధించి ఎన్నో ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి. బ్రిటీషర్సు విక్రమరాజనింగతో వ్యవహరించిన తీరు మాత్రం అమానుషం, అమానవీయం.

పైనాపిల్‌ తోటలు ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. రోడ్డు కిరువైపులా రాశుల్లో అమ్ముతున్నారు. ఓ కిలోమీటరు మేరా అవే. రోడ్లు ఇంకా ఇక్కడ అంత పెద్దగా లేవు. అటూ ఇటూ కలిపి నాలుగు దారులే. టూరిస్టు బస్సులు, కాళ్లే ఎక్కువ. చాలా మంది పొలాల్లోనే ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు. మధ్య మధ్యలో ఊర్లు. హోటళ్లతో పాటు బేకరీలూ ఎక్కువే. అప్పుడే చీకటి పడుతోంది. దార్లో భోంచేసి అనురాధపుర వెళ్దామని (డైవర్‌ కి చెప్పా. నగర శివార్లలో ఓ హోటల్లో ఆపాడు. రెండు భోజనాలు చెప్పా (డ్రైవర్తో కలుపుకుని. అన్నం, సాంబారు, రసం, రెండు కూరలు తెచ్చిచ్చాడు. మన వంటలతో అలా పోల్చుకోవడమే కానీ వాటి రంగు 'రుబీ వాసనా వేరేగా ఉన్నాయి. ఇక్కడైనా పెరుగు దొరుకుతుందేమోనని ఆశవడ్డా. దొరికింది. కాకపోతే పెరుగుని కుండతో సహా ఫ్రిజ్లో పెట్టడం కాస్త విడ్డూరంగా అన్సించింది. బీన్స్‌ని పొడవుగా కోసి ఉల్లిపాయలు కలిపి కూరగా చేశారు. బీన్స్‌ కంటే కూడా ఉల్లిపాయలు మూడింతలు ఎక్కువగా ఉన్నాయి. ఓ ప్లేట్‌ నిండా ఇడియప్పాలు తెచ్చి పెట్టాడు సర్వర్‌.

'ఆర్జర్‌ చేయలేదు కదా అంటుంటే...

ఇక్కడ అంతే, ఏం ఆర్డర్‌ చేసినా ఇడియప్పం మాత్రం తప్పకుండా పెడతారని మీకు ఇష్టమైతే తినొచ్చని, లేకపోయినా ఫర్వాలేదని, ఎన్ని తింటే వాటికి మాత్రమే బిల్లు వేస్తారని ' డైవర్‌ చెప్పాడు.

ఇక్కడ హోటళ్లలో అంతా పింగాణీ ప్లేట్లూ పాత్రలూ. గైవర్‌ తన ప్లేట్లో అన్నం, సాంబారు, కూరలు, ఇడియప్పం, పెరుగు అన్నీ వేసుకుని ఒకేసారి కలుపుకుని తింటున్నాడు. పక్కటేబుల్‌ వాళ్లని చూశా. వాళ్లూ అంతే. ఒక్కసారే ప్లేట్లో అన్నీ వేసుకుని కలుపి తింటున్నారు. మన లాగా అన్నంలో ఒక్కోటీ కలుపుకుని తినట్లేదు. ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి. ఇక్కడ ఇంతేనేమో. ఏదేమైనా భోజనం రుచిగా ఉంది. నీళ్ల బాటిల్స్‌ అన్నీ లీటరున్నర సైజులో అమ్ముతున్నారు. అంత పెద్దవి పట్టుకుని తిరగడం కాస్త కష్టమే. అనురాధపురాను చేరుకునేసరికి ఎనిమిది గంటలయ్యింది. జయశ్రీ మహాబోధి సమీపంలో హోటల్‌ తీసుకుని ఆ రాత్రికి విశ్రమించా.

ఉదయమే ఆలయానికి బయల్దేరా. హోటల్‌ నుంచి నడిచి వెళ్లేంత దూరమే. చుట్టూ ప్రాకారం అందంగా ఉంది. ప్రవేశ ద్వారం దగ్గర పూజా ద్రవ్యాలు, పూల దుకాణాలు... అనేక రంగులు, సైజుల్లో కలువ పూలు చూడముచ్చటగా ఉన్నాయి. వందల సంఖ్యల్లో కొబ్బరి మొలకల్ని కూదా అమ్ముతున్నారు. వాటిని చేతుల్లో పట్టుకుని కొందరు లోపలికి వస్తున్నారు. మొక్కులు తీర్చడంలో భాగంగా కొబ్బరి మొలకల్ని ఆలయానికి సమర్పించడం ఇక్కడి ఆచారమట.

అలాగే ముందుకు వెళుతుంటే ధ్యానమందిరం వచ్చింది. బంగారు బుద్ధ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు తాము తెచ్చిన కలువపూలను, అగరువత్తులను అక్కడ సమర్పించి ధ్యానంలో కూర్చుంటున్నారు. నేను కూడా కాసేపు ధ్యానంలో గడిపి బయటకు వచ్చేశాను. పక్శనే కొన్ని మెట్లు... అవి దాటగానే శాఖోపశాఖలుగా ఆకాశమంతా పరచుకున్న పవిత్ర బోధివృక్షం. కొన్నిటి శాఖలకు అక్కడక్కడా కాషాయ వస్త్రాలు చుట్టారు.

క్రీస్తు పూర్వం మూడో శతాబ్దికి చెందిన వృక్షం కావడం వల్ల ఇనుప స్తంభాలతో తోద్చాటు అందించి పరిరక్షిస్తున్నారు. ఆ చెట్టు కాండం అంతా ఓ విశాలమైన ఎత్తైన ప్రదేశంలో ఉంది. దాని చుట్టూ రైలింగ్‌ వేశారు. ఆ ఇనుప చువ్వలకీ బంగారు రంగు పెయింటు వేయడం విశేషం. కొద్ది మందికి మాత్రమే కాండాన్ని తాకే అవకాశాన్ని ఇస్తున్నారు. చుట్టూ ఉన్న విశాలమైన ప్రదేశంలో


బృందాలుగా చేరి భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. గాలి వీచినప్పుడల్లా ఆ పవిత్ర వృక్షం ఆకు రాలిపడుతుందేమోనని ఆశతో చూస్తున్న వారూ లేకపోలేదు. నేను కూడా కాసేపు అలాగే చెట్టునీడలో కూర్చున్నా బోధివృక్ష శాఖలను చూస్తూ ప్రవల్లిక కోసం వెతికాను.

నాకు కాస్త్ర దూరంలో ఓ యువకుడి హస్తరేఖలను చూస్తూ ఓ నడివయసు స్త్రీ జోస్యం చెబుతోంది. ఆమె వస్త్రధారణ అందరిలోకీ భిన్నంగా లంగా జాకెట్టూ, ఓణీ కట్టుకుంది. ఆమె పక్కనే ఓ అయిదేళ్ల పిల్లాడు... బహుశా ఆమె మనవడు అయిఉంటాడు. ఆమె ఎరుక చెప్పడం అయిపోయినట్టుంది. యువకుడు ఆమెకు దబ్బులిచ్చేసి వెళ్లిపోయాడు. ఆమె, మనవడూ గడ్డిపై కూర్చున్నారు. తన జోలెలాంటి సంచిని తీసింది. అందులోంచి అన్నంతీసి వాడికి తినిపించేందుకు ప్రయత్నిస్తోంది. వాడు మారాం చేస్తున్నాడు. కొద్దిగా కోపంతో ...

“కూడు తినరా అయ్యా. అంది... | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. అక్టోబరు-2020 |