పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుసరణీయ-వ్యక్తులు ఎంతమాత్రమూ కారు.

వాడుక ఒక సౌలభ్యం. అంతేతప్ప దానికి ప్రామాణికత లేదు. రెండింటినీ కలిపికొట్టడం, రెండింటికీ అభేదం పాటించడం మాన్‌ రాజకీయమో, వర్గ రాజకీయమో అవుతుంది తప్ప విద్యాపర చర్చ (2026అ10 630య30) అనిపించుకోదు. ఒకలు సోషలైదేషన్‌ అని పలకలేక సోసలైజేసన్‌ అంటారు. అది అతని సౌలభ్యం. నాకు తెలిసిన ఒకాయన తొంభై కి టొంటై అనేవాడు. అది ఆయన సౌలభ్యం. అంతేతప్ప అది ప్రామాణికం కాదు.

ఇది ప్రజాస్వామ్యమైనంత మాత్రాన జనం సర్వజ్ఞులు కారు. జనానికి “ఇది తప్పు, ఇది ఒప్పు” అని చెప్పే హక్కూ బాధ్యతా విషయవరిజ్ఞానులైన మేధావులకి, (ప్రామాణికులకీ తప్పనిసరిగా ఉన్నాయి. అంతేతప్ప వారు తమకంటే తక్కువ తెలినినవారిని అనునరించనక్కణలేదు. ఎందుకంటే విద్యావంత మేధావులు సాంస్కృతిక నాయకులు. సామాన్య ప్రజల తప్పుల్ని సరిదిద్దకపోతే వారు విద్యావ్యవస్థ నుంచి పొందాల్సిన ప్రయోజనాన్ని పొందలేక పోతారు. నమూనా పాత్రలూ (0016 10601), ప్రామాణికాలూ, మార్గదర్శకాలూ లోపించడం చేత వారిలో సృజనాత్మకత కూదా ఎదగాల్సినట్లుగా ఎదగదు.

అర్థం కానిది ఎవఱికి?

శాస్త్రసాంకేతిక సాహిత్యాన్ని తెలుగువారికి తెలుగులో అందించాలని చెప్పినప్పుడు, “తెలుగులో అందుకు తగ్గ సాంకేతిక పదజాలమేది ?” అని ప్రశ్నిస్తారు. “ఇదిగో, ఈ పదాలు మేము సిద్ధం చేశాం అని చూపించినప్పుడు “ఇవి మా కర్ధం కావట్లేదు. ఇవి నద్యఃస్పోరకంగా లేవు. ఇప్పటిదాకా ఇంగ్లీషులో మేము అలవాటుపడ్డ పదజాలం వేలు. వీటిని వింటూంటే మాకు ఆ శాస్త్రం స్ఫురించడం లేదు. (అంటే మాకు స్ఫురించదు కాబట్టి బహుశా దేశంలో ఎవటికీ స్ఫురించకపోవచ్చు” అంటూ ఒక బిక్కమొహాన్ని అభినయిస్తారు. “వీటిని ఈ ఈ అర్భాలలో ఈ క్రమంలో ఈ ఈ సూత్రాల ప్రకారం రూపొందించాం” అని విడమర్చినప్పుడు “మీరు రూపొందించారు సరే! వీటిని వాదేదెవజు ?” అని మళ్లీ ప్రశ్నిస్తారు. “ఇదుగో, ఈ ఈ రచయితలు ఇప్పటికే వాడడం మొదలుపెట్టారు. వీటిని ఇంకా ఇంకా ప్రచురపజచదానికి త్వరలో అధికారుల సహాయం కూదా తీసుకుంటాం” అని చెబుతాం. అంతే! ఆ మాటతో తెలుగువిరోధుల కోపం నషాళానికి అంటు తుంది. చేసేదేమీ లేక అమాంతం అపహాస్యాలకి దిగుతారు.

ఇలాంటివారిని నమ్ముకుంటే పెళ్ళి కుదరదు. పిచ్చీ కుదరదు. “తెలుగుపదాల్ని వాడడానికి ఆటంకంగా ఉన్నవి మానవ కల్పితమైన, లేదా స్వయంకల్పితమైన మానసిక అవరోధాలే తప్ప నిజంగా తెలుగులో పదాల కొత లేదూ అని ఇందు మూలంగా మనకి అవగతమవుతుంది. శాస్త్రసాంకేతిక రంగాలలో తెలుగు వదాలు లేకపోవదానికీ, ఉన్నా వాడకపోవడానికీ కారణం - తెలుగంటే ఉన్న చిన్నచూపూ, ఆంగ్లనుంటే ఉన్న వెట్టివ్యామోహం - ఇవే యథార్థమైన కారణాలు. తమ వ్యక్తిగత ఇష్టానిష్టాలకు ఆచరణాత్మకత ముసుగు వేస్తున్నారనేది సుస్పష్టం.

ఆంగ్ల మాధ్యమాన్ని శతాబ్దాల పాటు జనం మీద రుద్దడం ద్వారా కోట్లాదిమందికి చదువు రాకుండా చేసిన దేశం మనది. ఇక్కడ ఎవజూ మాట్లాడని, ఎవటికీ మాతృభాష కాని ఇంగ్రీషుకి కృత్రిమంగా ఒక సామాజిక విలువని సృష్టించారు.

ఇక్కడ ఈరోజున ఆఖరికి “ఇంగ్లీషే అర్ధమవుతుంది, తెలుగుకా”దనే విడ్డూరవు వాదన ఊపందుకోవడం విచారకరం. మన ప్రజలు అక్షరాస్యులు కాని రోజుల్లో వారికి ఫలానా పదాలు అర్థం కావంటే అందుకొక మంచి కారణం ఉంది.

కానీ జనాలంతా అక్షరాస్యులయ్యే సమయానికల్లా తెలుగు మాధ్యమాన్ని బళ్ళలోంచి బహిష్కరించారు. అందుమూలాన, విదేశాల జనానికి మాతృభాష మీద ఉన్న పట్టు మన జనానికి లేకుందా పోయింది, ఎంత చదువుకున్నా! అదే, మన ప్రజ లందటినీ తెలుగులోనే విద్యావంతుల్ని చేసి ఉంటే, విద్యారంగంలో తెలుగు మీడియం ప్రాముఖ్యం కౌనసాగి ఉంటే అప్పుడు మాతృభాషలో మనవారి పదజాల పరిజ్ఞానం ఇంగ్లీషువారిని మించిపోయి ఉందేది. తమ మాతృభాషాపదాలే తమకర్థం కాకుండాపోయి, వాటికి ఆంగ్లానువాదాన్ని ఇవ్వమని కోరుతున్న విచిత్రజనాభా పుట్టుకొచ్చేది కాదు. రంగులూ, అంకెలూ, జంతువులూ, పిలుపులతో సహా అన్ని పదాల్నీ ఇంగ్లీష్‌ నుంచి అరువుదెచ్చుకుంటూ ఒక నాసిరకం తెలుగు మాట్లాడే పదదారిద్ర్యపు తరం ఉద్భవించేది కాదు. ఈ రకంగ్యా ఒకపక్కన దేశమంతా వేలాది విద్యాలయాలతో దేదీష్యమానమై వెలిగిపోతూండగా, మజోవక్కన విరోధాలంకారంలా మన మాతృభాషానిరక్షరాస్యత మాత్రం యథా పూర్వంగా కొనసాగుతోంది.

మనం ఇవ్పుడు వ్రాస్తున్న తెలుగు చాలావనణకు మన ప్రాచీనులకి (ఈ అర్ధాల్లో) తెలీదు. నిజానికి ఇదొక కొత్త తెలుగు. ఆంగ్లంతో పోటీవదే (వ్రక్రియలో భాగంగా, గత వందా- ఇణవయ్యేళ్ళుగా మనం ఈ తెలుగుకి కొత్తపదాలు కల్పించుకుంటూ వాటిని వ్యావహారికంలోకి జతచేర్చుకుంటూ ఈ స్థాయికి అభివృద్ధి చేశాం. ఆ కృషినే ఇవ్చుడు కూడా కొనసాగించడానికి అభ్యంతరమేముంటుంది? ఇంగ్లీషు పదాలు చాలుననీ, వాటికి తెలుగు సమానార్థకాల్ని సృష్టించే పనిలేదనీ మన ముందుతరాల తెలుగువాళ్ళు అనుకుని ఉంటే ఈపాటికి తెలుగుభాష యావత్తూ మరణించి ఉండేది. ఎందుకంటే ఆంగ్ల పదాల్ని అనువదించకుందా అలాగే వాడితే భాషలో ఏ వాక్యంలోనూ తెలుగు ఉండదు. అలాంటి తెలుగు మాట్లాడ్డం కన్నా ఇంగ్లీషు మాట్లాడ్డమే సులభంగా ఉంటుంది. అందుచేత జనం తెలుగుని పూర్తిగా వదిలేస్తారు. స్వకీయత (0[81- ౨210) లేని భాష ఎవికీ అవసరం లేదు. కొత్త పదాల్ని సృష్టించలేని స్తబ్బావస్థకి చేలుకున్న భాషలు వాడుకలోని పదజాలాన్ని సైతం కోల్పోతాయి. ఎదుగుదలే జీవితం (0౪3 14. ఆ ఎదుగుదల ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే అంతిమక్షణాలు ఆసన్నమవుతాయి.

చనిపోయిన మనిషినైనా (బతికించగలమవేమో గానీ, వ్యవహారదూరమైన భాషల్నీ వాటిల్లోని పదాల్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ వునరుజ్జీవింపజేయలేమనీ, అవి శాశ్వతంగా పోయినట్లేననే కఠోర వాస్తవాన్ని తెలుగువారు గుర్తించే రోజు శీవ్రువే. రావాలి. సమకాలీనంగా సాంకేతిక విద్యలో తెలుగుకు స్థానం లేదు. మన ఎంజినీరింగ్‌ కళాశాలల్లో పాఠాలన్నీ ఇంగ్రీషు లోనే జజుగుతాయి. కనుక ఆ సాంకేతిక పదాలకు తెలుగు సమార్గకాల్ని సృజించాల్సిన

తరువాయి 42వ పుటలో.... | తెలుగుజాతి పత్రిక జువ్మునుడి.. ఈ అక్టోబరు-2020 |