పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-వాచస్పతి

పదనిష్పాదనకళ - 3

(The joy of coining new words!)

(గత సంచిక తరువాయి...)

వ్యావహారికానికి వ్యాకరణం లేదా?

కొన్నికొన్ని అభిప్రాయాలు ఎందుకు, ఏ విధంగా ప్రచారంలోకొస్తాయో అర్ధం కాదు. అలాంటివాటిల్లో ఒకటి - వ్యావహారికమంటే వ్యాకరణంతో వనిలేని భాష అనీ లేదా వ్యావహారికంలో వ్యాకరణ నియమాల్ని పాటించనక్కరలేదనీ, వ్యావవోరికమంటే ఎవథిష్టవెొచ్చినట్లుగా వారు చెలరేగిపోతూ భాషాపరమైన అరాచకాన్ని ఆస్వాదించడమేనని భావించడం. మానవ నాగరికతలోనూ, మానవ కార్యకలాపాల పరిధిలోనూ నియమాలు లేని రంగం ఒకటి కూడా దర్శనీయం కాదు. మనుషుల్ని బ్రతికించడానికీ, చంపడానిక్కూడా కొన్ని నియమాలున్నప్పుడు మేధాజీవి అయిన మనిషి సాలోచనగా మాట్లాడే భాషకి నియమాలు లేవనుకోవడం వివేకవంతం అనిపించుకోదు. కాబట్టీ వ్యావహారికాని క్కూడా తన నియమాలు తనకున్నాయి. మనకు తెలియకుండానే వాటిని అనుసరించి సంభాషిస్తాం. మన సస్పృహ సావధానంలోకి రానంత మాత్రాన అవి లేవనుకోకూడదు. ప్రపంచంలో మనకు సంబంధించిన ప్రతీదీ మనకు తెలిసి జరగదు. మన హృదయ స్పందన, జీర్ణ క్రియల్లాగానే! వ్యావహారిక నియమాలు గ్రాంథిక భాషానియమాల్ని అచ్చుమచ్చుగా అనుసరించేవి కాకపోవచ్చు. కానీ అవీ నియమాలే. ఎవడైనా వాటిని పాటించి తీరాలి. అది తమకోసం, తమ యొక్క ఇతరుల యొక్క సమీచీన అవబోధ కోసం! మనం బళ్ళలో నేర్చుకునే ఇంగ్లీషు నిజానికి ఆ దేశస్థుల అనునిత్య వ్యావహారికమే. మథి దానికో వ్యాకరణం ఉందని నేర్చుకుంటున్నాం గదా! వ్యావహారిక తెలుగైనా అంతే !

నియమాలన్నీ మార్పుకూ, ్రగతికీ అవరోధాలనీ, వాటిని సమర్థించేవారూ, బోధించేవారూ మార్పుకూ, ప్రగతికీ శత్రువులనీ ఖావించే దోరణి నరికాదు. మనం కోరుకునే మార్పులూ, పురోగతులూ అమల్లోకొచ్చిన తరువాత వాటిక్కూడా నియమాలేర్చడ తాయి. నియమాల్ని అనుసరించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? మానవచింతనలోని స్వభావసిద్ధమైన క్రమశిక్షణని గౌరవిస్తున్నాం. ఆ భాష మాట్లాడే ప్రజానీకాన్ని వారి పూర్వీకుల్నీ వారి మేధా వారసత్వాన్ని గౌరవిస్తున్నాం. ఆ భాషలో కాలపరీక్షకు తట్టుకుని నిలబడగల హేతుబద్ధ సంప్రదాయాల్ని బ్రతికిస్తున్నాం.

ప్రామాణికత వేఱు - సౌలభ్యం వేఱు

{c|(Standards and Convenience)}}

“వాడుకభాష అంటే సామాన్యప్రజలు వాదేదేననీ, అందులో వినపడే ప్రతి వాడుకా, పదమూ [ప్రామాణికమే” ననే వాదన. దీనితో ఏకీభవించడం కష్టం. ఎందుకంటే ప్రామాణికత అంటే అందటికీ అనుసరణీయమైనది. అది వ్యక్తిగతం కాదు. కానీ సామాన్యప్రజల వాడుక వ్యక్తిగతం.

ఈ పై వాదన కేవలం ప్రామాణికం. మనుషులు సాహిత్యం నుంచీ, ప్రామాణికులైన మేధావుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరాన్నీ అలా బౌద్ధికంగా ఎదగాల్సిన అవసరాన్నీ ఇది రద్దు చేయబూనుకుంటోంది. ఇది ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని ఆశిస్తోంది. ప్రామాణికాలంటూ ఏమీ లేవని, ఉండవని, ఉండకూడదనీ చెప్పడం దీని అంతరార్థంలా తోస్తోంది.

వాడుకలో ఉన్న ప్రతిదీ ప్రామాణికం కాదు. అదే నిజమైతే ఏ భాషాప్రజలకీ తమ భాషావ్యాకరణం అవసరం లేదు. అలాగే వారికి నిఘంటువులు కూడా అవసరం లేదు. ప్రామాణికం అనేదానికున్న అర్ధం బహులోతైనది. ఒక పదానికి లేదా వాడుకకి ప్రామాణికత ఎలా సిద్ధిస్తుందో అర్ధం చేసుకుంటే ఆ ప్రక్రియ ముందు వాడుక అనేది ఎంత చిన్న విషయమో మనకి అర్ధమవుతుంది. పై అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీనుకుంటే ప్రతివారూ తన ఇష్టమొచ్చినట్లు (వ్రాస్తూ, పలుకుతూ అలాంటి తప్పుల తడిక భాషని తన అధికారబలాన్ని మందబలాన్నీ మందిబలాన్ని ఉపయోగించి తన అజ్ఞానాన్ని వాడుకభాష పేర ఇతరుల నెత్తిన రుద్ధుతూ చెలరేగిపోతారు. (ఇప్పుడు జణుగుతున్నది అదేననుకోండి) ఆ తరువాత కొద్ది వందల సంవత్సరాల అనంతరం ఆ భాషా ప్రజలు వెనక్కితిరిగి తమ భాష వైపు చూసుకున్నప్పుడు వారసత్వం స్థానంలో ఒక అస్తవ్యస్తపు సాంస్కృతిక అరాచకం గోచరిస్తుంది.

పదస్వరూపాలకి ప్రామాణికత సరైన వ్యుత్పత్తుల (అ్వయిం10- ఖల) ద్వారాను, శబ్బార్ధాల యొక్క సమ్యక్‌ సమన్వయం ద్వారాను సిద్ధిస్తుంది. ఒకే పదానికి అనేక వ్యత్పన్నాలు(661ఇ6ఆ) ఉన్నప్పుడు వాటిల్లో ఒకదాన్ని మటుకు బొత్తిగా మిగతా వాటితో సంబంధం లేని అర్ధంలో వాడుతూంటే, అలా ఎంతమంది వాడినా సరే, అది (ప్రామాణికం కాదు. అది సరిచెయ్యదగ్గ పొఅపాటు మాత్రమే. అలాగే పదం యొక్క అసలు వ్యుత్పత్తినే నిర్మూలించే విధంగా కొంతమంది. పలుకుతున్నారనే కారణం చేత ఆ దోషభూయిష్ట ఉచ్చారణ (ప్రామాణికం కాదు. అది సరి చెయ్యదగ్గ పాలపాటు మాత్రమే. అలా అసాధురూపాలు (005601 0%) ప్రామాణికం అవాలంటే ఆ భాషకున్న వేలాది సంవత్సరాల చారిత్రిక నేపథ్యం చాలావణకు (మళ్ళీ లభ్యం కావడానికి వీల్లేని విధంగా) నశించాల్సి ఉంటుంది.

పదస్వరూపాలకి ప్రామాణికత ప్రామాణిక వ్యక్తుల వాడుక ద్వారా వారు రచించిన ప్రామాణిక (గ్రంథాల ద్వారా వ్యాపిస్తుంది. ఒక్కొక్క జీవనరంగంలోను ఒక్కొక్క విధమైన [ప్రామాణికులు ఉంటారు. రాజకీయాల్లో ప్రామాణికుదైన వాడు కళల్లో ప్రామాణికుడు కాడు. కళల్లో ప్రామాణికుదైనవాడు వ్యాపార రంగంలో కాడు. అలాగే భాషాసాహిత్యాలలో ప్రామాణికులైన వ్యక్తులే పదస్వరూపాలకి ప్రామాణికులు. వారు తమ సొంతగొంతుగా, సొంత అభిప్రాయంగా, సొంత కల్పనగా వినిపించినవాటిల్లో ఏయే వాడుకలు చేశారో అవే ప్రామాణికం. అంతేగానీ దారిన పోయే ప్రతి దానయ్యా చేసే వాడుకలు ప్రామాణికం కావు, వారు ఎంతమందున్నా సరే ! భాషాసాహిత్య విషయాల్లో వారు (ప్రామాణికుల్ని అనుసరించాల్సినవారే తప్ప, | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |