పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డి.పి. అనూరాధ 90100 16555






జరిగిన కథ


తెలుగుజాతి ఆనవాళ్ల గురించి అన్వేషిస్తూ మయన్మార్‌ థాయిలాండ్‌, కాంబోడియా వియత్నాం, ఇండోనేషియా దేశాలను నందర్భిస్తాదు సూర్చవర్భ: అయితే అదంతా కలఅని తరవాత తెలుస్తుంది. కానీ కలలో తను వివరించిన ప్రదేశాలతో తెలుగు నేలకు నష్టమైన నంబంధాలు ఉందదం ఆళ్చర్యవరుస్తుంది. తన కలల రాకుమారిని అన్వేషిస్తూ సూర్యవర్థ (ీలంక చేరుకుంటాదు. అక్ళుడ అతడి ప్రయాణం ఏ మలువు తిరిగింది?

క్యాండీ ఆలయాన్ని రెండు అంతస్థులుగా నిర్మించారు. సందర్శకులని ద్వారం దగ్గర మెటల్‌ డిటెక్టర్లతో పరీక్షించారు. ఎక్కడ చూసినా కట్టుదిట్టమైన బందోబస్తు ... రెండుసార్లు ఎల్టీటీయీ బాంబు దాడులకు గురైందట ఈ ఆలయం. అయినా తిరిగి పునరుద్ధరించారు.

అటూ ఇటూ గోడలపై రంగు రంగుల పెయింటింగులు ఉన్న మార్గంలోంచి ఆలయంలోపలికి ప్రవేశించాం. లోపలంతా వేరే 'ప్రపంచంలా ఉంది. ప్రధాన ఆలయంలో బంగారు బుద్ధ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు. పక్కనే పెద్ద గంట. ఆ ఆలయం చుట్టూ కొందరు ప్రదక్షిణలు చేస్తున్నారు. తెల్ల లుంగీ, తెల్ల షర్టు వేసుకున్న ఓ వృద్ధుడు అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణ చేస్తున్నాడు. ఆ మాటకొస్తే చాలా మంది ప్రీపురుషులు తెల్ల దుస్తులే ధరించారు. వాళ్లను చూడగానే ప్రవల్లిక గుర్తొచ్చింది. ఆమె కోసమే ఇంత దూరం వచ్చిన నంగతీ గుర్తొచ్చింది. కానీ నేను ఆ విషయవే మరచిపోయాను. నలువైపులా ఆమె కోసం వెతకడం ప్రారంభించా.

"సూర్యా రా మనం మేడ మీదకు వెళ్లాలి

అనురా మాటలకు నా ప్రయత్నాన్ని పక్కకు పెట్టి ముందుకు వెళ్లా. పై అంతస్తుకు వెళ్లదానికి పాతికలోపు మెట్లున్నాయి. అందరూ ఓ పద్ధతిలో వెళుతున్నారు. ఓ పది మెట్లు ఎక్కగానే గోడ మీద పొడవైన పెయింటింగ్‌ ఆకట్టుకుంది... ఓ వడుచు జంట పెయింటింగ్‌ అది. బహుషా రాజకుటింబీకులై ఉంటారు. అనురా కూదా అదే పెయింటింగ్‌ ను చూపిస్తూ,

“ఈమె పేరు హేమమాలి, కళింగ రాజు గుహసివ కుమార్తె ఇతడు ఆమె భర్త దంతకుమారుడు. వీళ్ల గురించి తెలుసుకునే ముందు దంతపురం అనే గ్రామం గురించి తెలుసుకోవాలి. దానికి మనం బుద్దుడి కాలానికి వెళ్లాలి. బుద్ధుడి నిర్యాణం తరవాత ఆయన ఎడమ కోర దంతాన్ని ఖీమథెరా అనే భిక్షువు సేకరించి, దాన్ని కళింగ రాజు బ్రహ్మదత్తుడికి బహుమతిగా అందజేశాడని బౌద్ధ (గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ బుద్దుడి దంతానికి గౌరవంగా రాజు స్ఫూపాన్ని నిర్మించాడని అదే క్రమంగా దంతవురిగా మారిందని చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఆ దంతం కోసం రాజుల మధ్య నిరంతరం యుద్దాలు జరిగేవి. అది ఎక్కడ ఉంటే అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉండడమే కాదు ఆ రాజుకు ఆధిపత్యం ఉందేది. దంతాన్ని రక్షించేందుకు గుహసివుడు ఓ పథకం ఆలోచించాడు. తన కూతురు, అల్లుడిని దానికి పాత్రధారులుగా చేశాడు. హేమమాలి తండ్రి ఆదేశంమేరకు దంతాన్ని తన కొప్పులో దాచుకుని అతి సామాన్యుల్లా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని శత్రువుల బారిన పదకుండా నౌకలో శ్రీలంకకు చేరుకుంది. ఇక్కడి అనురాధపురాలోని ఆరామంలో బుద్ధదంతాన్ని అందజేనింది. క్రీస్తుశకం మూడో శతాబ్దిలో ఇదంతా జరిగింది. శ్రీలంకకు చెందిన పాలిగ్రంథం దలద వంశం ఈ కథనంతా వివరిస్తోంది. ఆ దంతం ఇక్కడి అనేక ఆరామాల్లో ఉండి ఆఖరుకి క్యాండీ చేరుకుంది. ఈ రాజుల సంరక్షణలో భద్రంగా ఉంది. రోజూ మూడు పూటలా ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి బుధవారం అభిషేకాలు నిర్వహిస్తారు. ఏడాదికి ఓసారి జరిగే పెరిహెరా ఉత్సవాల్లో బుద్ధ దంతాన్ని ఆలయం బయట ఊరేగిస్తారు. ఆ దంతపురం నేటి ఆంధ్రప్రదేశ్‌ లో ఉందని పురావస్తు | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |