పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మా శ్రీలంకకు గట్టి అనుబంధమే ఉండేది.” అనురా మాటలు వింటుంటే ఒళ్లు పులకించిపోయింది.

తెలుగు తోబుట్టువు, సిక్కోలు రాకుమారి హేమమాలి, ఆమె భర్త దంతకుమారుడి చిత్రాలను గర్వంగా చూశాను. 'అమ్మా మీరెవరో, ఆనాడు మీరు ఎంత కష్టపడ్డారో అన్నది నేటి మన తెలుగు గడ్డ మీద తెలియకపోయినా (శ్రీలంకలో మిమ్మల్ని గొప్ప గౌరవంతో చూసుకుంటున్నారు. మీరు ధన్యులు..” అని మనసులోనే నమస్మరించాను.

ఎంతో ఉత్సాహంతో గర్భగుడి దగ్గరకి చేరుకున్నా లోపల బంగారు పేటిక ధగాధగా మెరుస్తోంది. అందులోనే బుద్ధదంతం ఉందని అనురా చెప్పాడు. బౌద్ధ గురువులు పూజలు నిర్వహిస్తున్నారు. స్వదేశీ, విదేశీ భక్తులతో ఆవరణ అంతా నిండిపోయింది. క్యాండీ ఆలయంలో అడుగడుగునా తెలుగుజాతి చరితను మన తాతముత్తాతలు ఇంత పదిలంగా రచిస్తే ఆ విషయం మన దాకా చేరలేదు. కళింగ రాజుకు ఆపదాస్తే శ్రీలంకలోని వాళ్లు సహాయం అందించారంటే ఆనాడు ఈ రెండు ప్రాంతాల మధ్య ఎంతటి అనుబంధం ఉండేదో. విజయుడు, హేమమాలి, క్యాండీ రాజులు వివిధ కాలాలలో తమ ఘనతను చాటారు. ఈనాటికీ బుద్ధ దంతం మన నేల మీదే ఉంటే ప్రపంచ బౌద్దానికి చిరునామాగా ఓ అద్భుత ఆలయాన్ని అభివృద్ధి చేసే వాళ్లమా లేక ఏదో ఓ మ్యూజియంలో అలా ఉంచేసి చేతులు దులుపేసుకునేవాళ్లమూ. (శ్రీలంకలో మాత్రం ఆలయం అద్భుతంగా నిర్వపొన్తున్నారు. కాసేపు అక్కదే కూర్చుండిపోయా. అనురా కూడా నా పక్కనే కూర్చుని ప్రార్ధనలు చేస్తున్నాడు. నా చూపులు ప్రవల్లిక కోసం వెతుకుతున్నాయి. కానీ నిరాశే. బయళల్లేరుదామా అంటూ తను లేచాడు. నేనూ లేచాను.

“అనురా, క్యాండీ రాజుల కోటలు ఎక్కడున్నాయి?”

'ఈ ఆలయానికి ఉత్తరం వైపున నాటి రాజప్రాసాదాలు అలాగే ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మ్యూజియాలుగా తీర్చిదిద్ది నందర్భ్శకులకు అనుమతి ఇస్తున్నారు. వీటిలో క్యాండీ నేషనల్‌ మ్యూజియం చాలా ముఖ్యమైంది. క్యాండీ రాజులకు సంబంధించి అయిదు వేల వస్తువులను సందర్భనకు ఉంచారు. నీకు ఆసక్తి ఉంటే వెళదాం" అన్నాడు.

“ఫర్వాలేదు అనురా.. నువ్వు చాలా సేపటి నుంచీ నీ పనులన్నీ వదులుకుని నాతో ఉన్నావు. నేను వెళతాలే.”

మాటల్లో ఆలయం వెలుపలికి వచ్చాం.

“ఆ కనిపించే ప్రాకారాలే రాజప్రాసాదాలు మరి నాకు సెలవా. ఏదైనా అవసరం అయితే ఫోన్‌ చేయి" అంటూ తన మొబైల్‌ నెంబరు ఇచ్చాడు. సూర్యా, నీతో పరిచయం ఎంతో సంతోషాన్నిచ్చింది. .” అంటూ హత్తుకున్నాడు.

“నాక్కూడా అనురా, నిన్నూ నీ పేరునూ నేనెవ్పుడూ గుర్తుంచుకుంటాను” అంటూ వీడ్కోలు తెలిపాను. తను వెళ్లిపోయాడు.

నేను అమరావతికి చెందిన వాడినని అనురా ఇంతలా గౌరవించడం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. వివిధ దేశాలలో ఈనాటికీ ప్రసిద్ధ బౌద్ధకేం్యద్రంగా అమరావతిని కౌనియాడడం గొప్పవిషయం. మనం ఆ ప్రాచీన నగరాన్ని పూర్తిగా మర్చిపోయాం.

రాజప్రాసాదం దగ్గరికి వచ్చాను. మన భారతీయ కోటలతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇందులో రెండు విభాగాలు ఉన్నాయి. మొదటిది “పల్లె వాహల), ఇది రాజుకు సంబంధించినది. రెండోది. “మేడ వాహలా .. ఇది ఒకప్పటి రాణి అంతఃపుర వాసానికి చెందింది. నేను మొదట పల్లెవాహలకి వెళ్లా. ఇక్కడ ఆయుధాలు, వస్తువులు, ఆభరణాలు, కిరీటాలు, దుస్తులు ఇలా ఎన్నిటినో భద్రపరచారు. అయితే ఓ పొడవాటి అల్మరాలోని గాజు తలుపులలోంచి కన్పిస్తోన్న దున్తులు రక్తనిక్తమై చిరిగిపోయి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే కళ్లల్లో నీళ్లు ఆగలేదు. అవి విక్రమరాజ నింగవి. ప్రజల్లో ఎంతో పేరున్న అతడి రాజ్యాన్ని కబళించాలనే నెపంతో 'బిటీషర్లు తప్పుడు అభియోగం మోపి కోటను స్వాధీనం చేసుకోవడానికి వచ్చారట. వాళ్లకి దొరకకుండా అతడు తప్పించుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెందు కాదు మూడుసార్లు బ్రిటీషర్లు చేసిన ప్రయత్నాలు విఫలమే అయ్యాయి. ఆఖరుకి రాజు అనుయాయులే ఉప్పం దించారు. కొండల మధ్య ఓ ఇంట్లో ఉన్న రాజు రహస్య స్థావరాన్ని చుట్టుముట్టారట. రాజును చేజిక్కించుకుని దుర్భాషలాదారు. అతడిపై చేయిచేసుకున్నారు. కాళ్లూ చేతులను ఓ స్తంభానికి కట్టేని అతి కిరాతకంగా బంధించారు. ఆ పెనుగులాటలో అతడి దుస్తులు చిరిగిపోయాయి, రక్తసిక్రమయ్యాయి. ఆనాటి దుస్తులే ఇవి. చరిత్రలో రాజులను తమ ఆంతరంగికులే వెన్నుపోటు పొడిచిన ఘటనలెన్నో విక్రమరాజ సింగదీ అదే కథ. మనసు బరువెక్కి అక్కడ ఉండ లేకపోయా.

మేడ వాహల ఆనాటి రాణుల అంతఃపురం. ఇక్కడ శ్రీలంక ఆర్మియాలాజికల్‌ డిపార్భవెంట్‌ వారిని తవృకుండా మెచ్చుకోవలసిందే. మన జేజమ్మ వెంకట రంగమ్మ వంటశాలను యథాతథంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పునరుద్ధరించారు. చాలా మంది సింహళ యువతులు ఆనాటి పాత్రల్ని, వంట సామగ్రిని ఆనక్తికరంగా చూన్తున్నారు. సింహళ (వ్రభుత్వానికే కాదు సింహళీయులకు తమ చరిత్ర పట్ల ఉన్న అనురక్తికి జోహార్లు అర్పిస్తూ | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |