పుట:అక్షరశిల్పులు.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

కథలు, కథానికలు, కవితలు, సమీక్షలు, సామాజిక-సమీక్ష వ్యాసాలు ప్రచురితం. గీటురాయి పత్రికలో ధారావాహిక రచన, త్వరలో గ్రంథ రూపం ధారించనున్న 'ఆంధ్రప్రదేశ్‌ అధికార రాజకీయాలు- ముస్లింలు' గుర్తింపు తెచ్చిపెట్టింది. 'తెలంగాణ కవితలు' (కవితా సంకలనం,2010) వెలువరించారు. లక్ష్యం: ప్రగతి దిశగా జాతి జనులు సాగేందుకు అవసరమైన చైతన్యాన్ని కల్గించడం, మత సామరస్యాన్ని మరితంగా పటిష్ట పర్చే సాహిత్యాన్ని రూపొందించడం. చిరునామా : సయ్యద్‌ ఖుర్షీద్‌, ఇంటి నం. 5-5-72, కంకర బోడ్‌, మహబూబాబాద్‌-506101, వరంగల్‌ జిల్లా. సంచారవాణి: 99895 11786. Email: ksyed64@yahoo.com

లాల్‌ షేక్‌
పశ్చిమగోదావరి జిల్లా మల్లిపూడిలో 1944 జూలై 6 న జననం.

తల్లితండ్రులు: షేక్‌ జైనాబీ, షేక్‌ మీరా. చదువు: బి.కామ్‌., ఐసిడబ్లూఏ. వృత్తి: కాస్ట్‌ అకౌంటెంట్‌. 1974లో మద్రాసు కేంద్రాంగా 'స్నేహబాల' (1974-1979) బాలల మాసపత్రిక ఆరంభించారు. తెలుగులో బాలల కోసం పత్రిక నడపాలన్న ఉదేశ్యంతో ఆరంభమైన 'స్నేహబాల'లో పిల్లలకు బాగా అర్దమయ్యే విధంగా నాలుగు సంవత్సరాలు 'మహాభారతం' కథనాన్ని సులభతరంగా రాసి సీరియల్‌గా ప్రచురించారు. లక్ష్యం: పసిబిడ్డల మానసిక వికాసం కోసం కృషి. చిరునామా: షేక్‌ లాల్‌, కాస్ట్‌ అకౌంటెంట్, న్యూనం-33, 2వ అంతస్థు, తిరునగర్‌, రెండవ వీధి, వడపళని, చెన్నయ్‌-600026. సంచారవాణి: 90422 46570.

లతీఫ్‌ సాహెబ్‌ షేక్‌
ప్రకాశం జిల్లా దర్శి మండలం పొతకమూరు గ్రామంలో

1958 డిసెంబర్‌ 4 న జననం. తల్లితండ్రులు: ఖాశింబీ, షేక్‌ బాజీ సాహెబ్‌. కలం పేరు: లతీఫ్‌ కుట్టీ. చదువు: ఎం.ఏ (ఇంగ్లీష్‌). వ్యాపకం: విద్యాబోధన. 1974లో కళాశాల పత్రికలో 'మూఢ నమ్మకాల ఖండనలో వేమన పాత్ర' వ్యాసం రావడంతో రచనా వ్యాసంగం ఆరంభమై వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. ప్రస్తుతం నెల్లూరు నుండి వెలువడుతున్న'విజ్ఞాన జగతి' మాసపత్రికలో 'కాకులు చెప్పిన కథలు' అను ధారావాహిక రచన ప్రచురితమవుతుంది. అవార్డు: గురుమిత్ర (మా తెలుగుతల్లి ఫ్ధండేషన్స్‌, హైదారాబాద్‌, 2003) లక్ష్యం: సమాజాన్ని

96