పుట:అక్షరశిల్పులు.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

మరింతగా మానవీకరించేందుకు తోడ్పాటు. చిరునామా: షేక్‌ లతీఫ్‌ సాహెబ్‌, పావని హోమ్స్‌, 402, బి బ్లాక్‌, టెక్కేమిట్ట, మాగుంట అండర్‌ బ్రిడ్జి వద్ద, నెల్లూరు-522 004, నెల్లూరు జిల్లా. సంచారవాణి: 92964 33371.

మహబూబ్‌ సాహెబ్‌ షేక్‌
గుంటూరు జిల్లా వినుకొండలో 1933 జూలై ఒకిటిన

జన్మించారు. తల్లితండ్రులు: షేక్‌ లాల్‌ అహమ్మద్‌, సుభాన్‌ బీ. చదువు: పియుసి. 1955లో రాష్ట్ర సర్వేయర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి పలు ప్రాంతాలలో పని చేశారు. మంచి చదువరి. తెలుగు భాష, ప్రజాకవి వేమన సాహిత్యం పట్ల వల్లమాలిన అభిమానం. వేమన పద్యాలను అలవోకగా విన్పిసూ, ఆ పద్యాలలో ఇమిడి ఉన్న తాత్విక భావాలను వివరిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన కుమారుడు షేక్‌ కరీముల్లా సహకారంతో 'మేధావుల మదిలో ఇస్లాం' (సంకలనం) పుసకాన్ని 2003లో ప్రచురించారు. 1991లో ఉద్యోగ విరమణ చేసిన షేక్‌ మహబూబ్‌ సాహెబ్‌ 2009 లై 27న వినుకొండలో కన్నుమూశారు.

మహబూబ్‌ జాన్‌ షేక్‌
ప్రకాశం జిల్లా తూర్పు గంగవరంలో 1949 జూలై ఒకిటిన

జననం. తల్లితండ్రులు: ఫాతిమాబీ, షేక్‌ హసన్‌ సాహెబ్‌. చదువు: ఎం.ఏ (హిందీ)., ఎం.ఏ (చరిత్ర)., బి.ఇడి., రాష్ట్రభాషా ప్రవీణ. ఉద్యోగం:

ఉపాధ్యాయులు. విద్యార్థి దశ నుండి రచనా వ్యాసంగం ఆరంభం. తెలుగు, హిందీ భాషల్లో రాసిన కవితలు, కథలు, సాహిత్య వ్యాసాలు, గేయాలు ఆయా భాషా పత్రికల్లో ప్రచురితం. రచనలు: దేశం కోసం (మహాపురుషుల కథలు, 2001), భారతీయ నోబుల్‌ గ్రహితలు (2002), జన్మభూమి (కవితల సంపుటి 2003), రాతిపూలు (కథల సంపుటి, 203), మహానది (కవితల సంపుటి, 2004), జైత్రయాత్ర (రాజశేఖర రెడ్డి చరిత్ర,2005), అభిషిక్తుడు అపొస్తలు (క్రీస్తు చరిత్ర, 2005), క్రీస్తు జననం (నాటిక, 2005), సాహిత్య వ్యాస మందాకిని (వ్యాసాలు,2006), బహుదూరపు బాటసారులు (కవితా సంపుటి,2007), మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ (చరిత్ర,2007), అమ్మ చెప్పిన కమ్మని కథలు (బాల సాహిత్య కథల సంపుటి, 2009), నా హజ్‌ యాత్ర (2010), ప్రాత:స్మరణీయులు (2010), ఒంగోలు కోట వీధి కథలు (2010), మా తెలుగు తల్లికి మల్లెపూదండ (సంపాదకులు, 2009). అవార్డులు -పురస్కారాలు: ఎక్స్‌రే అవార్డు (1998), ఎయిర్‌ ఇండియా బోల్డ్‌ అవార్డు (2001),

97