పుట:అక్షరశిల్పులు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

ఇస్మాయిల్‌ ఉమ్రి షేక్‌
కృష్ణా జిల్లా కొండపల్లిలో జననం.

తల్లితండ్రులు: తస్లీమున్నీసా, షేక్‌ అబ్దుర్రవూఫ్‌. 1995లో గీటురాయి వారపత్రికలో వ్యాసం ప్రచురితమైనప్పటినుండి వివిధ పత్రికలలో ధార్మిక వ్యాసాలు చోటుచేసుకున్నాయి. అరబ్బీ, తెలుగు, ఉర్దూ భాషలో ప్రవేశం. మంగళగిరి నుండి 'కలం సాక్షి' మాసపత్రికను కొంత కాలం నడిపారు. లక్ష్యం: ఇస్లామీయ ధార్మిక సాహిత్యాన్నితెలుగు పాఠకులకు పరిచయం చేయడం. చిరునామా : షేక్‌ ఇస్మాయిల్‌ ఉమ్రి, ఇంటి నం. 9-11, కోిరెడ్డి కాలనీ, స్టేషన్‌ సెంటర్‌, కొండపల్లి-521 228, కృష్ణా జిల్లా. సంచారవాణి: 96423 34787.

జబ్బార్‌ అబ్దుల్‌ గుట్టూరు
అనంతపురం జిల్లా కొత్తచెర్వు గ్రామంలో 1940 ఏప్రిల్‌

20న జననం. తల్లితండ్రులు : జమీలా బి, అబ్దుల్‌ గఫ్పార్‌. చదువు: యస్‌.యస్‌.యల్సీ., టియస్‌ఎల్‌సి. ఉద్యోగం: ప్రస్తుతం విశ్రాంత ఉపాధ్యాయులు.1999లో 'విశ్వ కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స.అ.సం) గ్రంథం రాయడంతో రచనా వ్యాసంగం ఆరంభం. ఆ తరువాత

2002లో ఆంధ్రభూమి దినపత్రికలో 'ఇస్లాం-జాతీయ సమైక్యత'

వ్యాసం ప్రచురితం అయినప్పటి నుండి వివిధ పత్రికల్లో పలు వ్యాసాలు చోటుచేసుకున్నాయి. ఆకాశవాణి (అనంతపురం) నుండి పలు ప్రసంగ వ్యాసాలు ప్రసారం అయ్యాయి. ఉర్దూ, అరబిక్‌ భాషల్లో రాసిన పలు గ్రంథాలను, వ్యాసాలను తెలుగులోకి అనువదించి వెలువరించడం ద్వారా పలు గ్రంథాలు తెచ్చారు. రచనలు: 1.విశ్యకారుణ్యమూర్తి మహమ్మద్‌ (సం.అ.సం), 2. సులభతర హజ్‌ మరియు ఉమ్రాహ్‌, 3. అస్మా-ఉల్‌-హస్నా, 4.క్రెస్తవం యొక్క వాసవికత ఎట్టిది?, 5. మన ప్రవక్త (స.అ.సం), 6. మంచి మాట-స్వర్గానికి బాట (రెండు భాగాలు), 7.జీవితం ఇలా గడపాలి, 8. రంజాన్‌ ఉపవాసాలు, 9. మానజాతి మహిమలు. లక్ష్యం: ఇస్లాం పట్ల ప్రజలలో ప్రచారం చేయబడుతున్నఅపోహలను దూరం చేయడం. చిరునామా: జి. అబ్దుల్‌ జబ్బార్‌, ఇంటి నం. 6-1-914, కోవూరునగర, అనంతపురం-515004, అనంతపురం జిల్లా. సంచారవాణి: 9032218412.

జాఫర్‌ బాబు ఎం.డి
నెల్లూరు జిల్లా నెల్లూరులో 1976 ఆగస్టు 17న జననం. తల్లి

తండ్రులు: నూర్జహాన్‌, ఎండి. సందాని బాషా. చదువు: బి.ఏ., డి.పి.ఆర్‌. వృత్తి: జర్నలిజం. 1993లో ప్రజాశక్తిలో 'శ్రీకృష్ణ కమిషన్‌ నివేదికలో ఏముంది?' వ్యాసం ప్రచురితమైనప్పటి నుండి వివిధ పత్రికలలో సామాజిక-రాజకీయాంశాలతో కూడిన వ్యాసాలు, కవితలు ప్రచురితం. ప్రస్తుతం టివి9లో 'ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్ ఫర్‌ స్టింగ్ ఆపరేషన్స్‌' గా బాధ్యతల

79