పుట:అక్షరశిల్పులు.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నిర్వహణ. రచనలు: 1. ఆపరేషన్‌ రెడ్‌లైన్ (2008), 2. స్టింగ్

ఆపరేషన్స్‌ ఇన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా (2010). మొదటి పుస్తకం ఎలక్ట్రానిక్‌ మీడియాలో సంచలనం సృష్టించింది. లక్ష్యం: సామాజిక రుగ్మతలను రూపు మాపేందుకు అవసరమగు చైతన్యం ప్రజలలో కలగజేయాలన్నది. చిరునామా: ఎండి జాఫర్‌ బాబు, జర్నలిస్ట్‌, ఇంటి నం.21-411 ఏ, దాడివారి వీధి, నెల్లూరు- 524001, నెల్లూరు జిల్లా. సంచారవాణి : 99126 66212, 99482 54519 Email: jaffar.babu@yahoo.com

జాఫర్‌ వలి ఖాన్‌ డాక్టర్‌
కడప జిల్లా రాజంపేట తాలూకా స్వస్థలం. రచనలు:

చంద్ర మండలం విశేషాలు (సైన్సు గ్రంథం) మంచి ఖ్యాతి తెచ్చిప్టిెంది.

జఫ్రుల్లా మహమ్మద్‌
ప్రకాశం జిల్లా కంబంలో 1943లో జన్మించారు. తల్లితండ్రులు:

బీనతున్నీసా, అసదుల్లా సాహెబ్‌. రచనలు: పేదల ఖేదము, కవితా ప్రసూనాలు.

జహంగీర్‌ మహమ్మద్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా గొరిటలో 1947 ఫిబ్రవరి 15న

జననం. తల్లితండ్రులు: హుస్సేన్‌బి, మహమ్మద్‌ అబ్దుల్లా. ఉద్యోగం: హిందీ అధ్యాపకులు.

1964లో 'లహరి' లిఖిత మాసపత్రికలో 'అరుణోదయ' శీర్షికతో

గేయం ప్రచురితం కావడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటి నుండి వివిధ పత్రికలలో కవితలు, గేయాలు, సాహిత్య వ్యాసాలు చోటుచేసుకున్నాయి. రచనలు: 1. శ్రీ బుద్దారం గండి ఆంజనేయ శతకం 2. షాహీన్‌ ప్రబోధ శతకము. బిరుదులు: కవి వతంస (బుద్ధారం 2005). లక్ష్యం: యువతను సన్మార్గం చూపడం. చిరునామా: జహంగీర్‌ మహమ్మద్‌, ఇంటి నం: 11-45, రాంనగర్‌ కాలనీ, నాగర్‌కర్నూలు-509209, మహబూబ్‌నగర్‌ జిల్లా. సంచారవాణి: 97032 32378, దూరవాణి: 08540-226940.

జహీర్‌ అహమ్మద్‌ సయ్యద్‌
కడప జిల్లా ప్రొద్దుటూరులో

1958 ఏప్రిల్‌ 14న జననం. తల్లితండ్రులు: జెహరాబీ, సయ్యద్‌ హుస్సేన్‌ సాహెబ్‌. కలంపేరు: సమీరా. వృత్తి : ప్రింటింగ్ వర్క్‌. మూడు దాశాబ్దాల క్రితం ఆంధ్రపత్రికలో 'బ్రతుకు తీరు' కవిత ప్రచురితం కావడంతో రచనా రంగప్రవేశం. అప్పటి నుండి దాదాపు అన్ని తెలుగు పత్రికలు, వివిధ కవితా సంకలనాలు, కథా సంకలనాలల్లో కవితలు, కథానికలు ప్రచురితం. 1992

80