పుట:అక్షరశిల్పులు.pdf/79

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

ఇస్మాయిల్‌
ఇస్మాయిల్‌ నెల్లూరు జిల్లా కావలిలో 1928 జులై 1న జన్మించారు.
అక్షరశిల్పులు.pdf

1972లో 'ఆదర్శం'తో ఆరంభమై 1976లో మృత్యు వృక్షం,

1980లో చిలుకలు వాలిన చెట్టు, 1987లో చెట్టు, రాత్రి వచ్చిన రహస్యపు వాన, 1989లో ఇస్మాయిల్‌ కవితలు, 1996లో బాల్చీలో చంద్రోదయం, 1997లో కప్పల నిశ్శబ్దం (హైకూలు), 1997లో రెండో ప్రతిపాదన-ఆనువాద కవితలు, 1986లో కవ్వంలో నిశ్శబ్దం (వ్యాసాలు), 1996లో కరుణ ముఖ్యం (వ్యాసాలు) తదితరాలు ఆయన ప్రచురిత రచనలు. ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిన 'చెట్టు' కవితా సంకలనంతో తెలుగు సాహిత్యలోకం ఆయనను 'చెట్టు ఇస్మాయిల్‌' అని పిలుచుకుంది. సాహిత్యలోకంలో ఎనలేని ఖ్యాతిని మూట గట్టుకున్న ఆయన 2003 నవంబరు 11న కన్నుమూశారు.

ఇస్మాయిల్‌ మహమ్మద్‌
తెలుగు సాహిత్య ప్రపంచంలో 'స్మైల్‌' గా విఖ్యాతులైన

మహమ్మద్‌ ఇస్మాయిల్‌ 1942 ఫిబ్రవరి మూడున కృష్ణా జిల్లా తేలప్రోలు గ్రామంలో జన్మించారు. తల్లితండ్రులు: ఖమ్రున్నీసా బేగం, మహమ్మద్‌ ముస్తఫా. చదువు: ఎం.ఏ. 1957లో రాష్ట్రప్రభుత్వ వాణిజ్యశాఖలో ప్రవేశించి డిప్యూటీకమీషనర్‌గా రిటైర్‌ అయ్యారు. 1964లో 'భారతి'లో తొలిసారిగా కవిత ప్రచురితం కావడంతో ఆరంభమైన సాహిత్య

అక్షరశిల్పులు.pdf

ప్రస్థానంలో కవితలు, కథానికలు, నాటకాలు రాశారు. 1965లో

భారతిలో రాసిన 'వల' అను కథానిక సంచలనం సృష్టించింది. ఆంగ్లం నుండి తెలుగులోకి పలు అనువాదాలు చేశారు. 'ఆ' శీర్షికతో రాసిన నాటకం ఆంధ్రజ్యోతి పోటీలలో ప్రథమ బహుమతి అందుకుంది. రాష్ట్రంలో వెలువడిన కథా-కవితా సంకలనాలలో ఆయన కవితగాని, కథగాని తప్పనిస రిగా చోటుచేసుకునేవి. 1998లో ఆయన రాసిన కవితలు, కథానికలు, నాటికలు, అనువాదాలు కలిపి 'ఖాళీ సీసాలు' పుస్తకం ప్రచురించారు. సత్కారాలు-సన్మానాలకు కడు దూరంగా వ్యవహరించిన ఆయన్ను ఎందుకు రాస్తున్నారంటే 'రాయాలని అన్పించింది రాస్తున్నా' అన్నారు. ఆ తరువాత 'సమాజం పట్ల మనకు కలిగే అభిప్రాయాలను పదిమందితో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో రాస్తున్నాను' అన్నారు. పలుమార్లు విదేశ పర్యటనలు గావించిన 'జిజ్ఞాసి-స్నేహ లాలసుడు'. ఉద్యోగ విరమణ తరువాత రాజమండ్రిలో స్థిరపడి చివరి వరకు రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ 2008 డిసెంబరు ఐదున కన్నుమూశారు. (సమాచారం: దూరవాణి ద్వారా ముహమ్మద్‌ ఇస్మాయిల్‌తో సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఇంటర్యూ: 01-09-2008).

78