పుట:అక్షరశిల్పులు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

చేసుకున్నాయి. స్థానికంగా వెలువడిన పలు పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించారు. లక్ష్యం: అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న బాధిత ప్రజానీకం గొంతుకను విన్పించ గల రచనలు చేయాలన్నది. చిరునామా: ఎంజి ఇక్బాల్‌, ఇంటి నం. 8-13-109, 9వ లైను, నెహ్రూనగర్‌, గుంటూరు, గుంటూరు జిల్లా. సంచారవాణి: 99895 51752.

ఇక్బాల్‌ ఎస్‌ఎం. డాక్టర్‌
అనంతపురం జిల్లా అనంతపురంలో 1947 మే 19న

జననం. తల్లితండ్రులు: సయ్యద్‌ ఖాజా హుస్సేని, మహమూదా బేగం. చదువు: ఎం.ఏ, పి.హెచ్‌డి. ఉద్యోగం: విశ్రాంత హిందీ ఉపన్యాసకులు (ఆంధ్రవిశ్వవిద్యాలయం). 'హిందీ+తెలుగు కథానికల తులనాత్మక పరిశీలన' అను అంశాన్ని పరిశోధనకు స్వీకరించి తొలి తెలుగుకదను 1904లో ఆచంట వెంకటరాయ

సాంకృత్యాయ శర్మ రాసినట్టు ప్రకటించడం సంచలనం

సృష్టించింది. ప్రముఖ కవి మౌల్వీఉమర్‌ అలీషా రచనల మీద సమగ్ర పరిశోధన చేయడం మాత్రమేకాకుండా ఆయన రచనలను హిందీలోకి అనువదించారు. 1974లో ఆంగ్లం, హిందీలో వచ్చిన కథలను తెలుగులోకి అనువదించగా అవి ఆంధ్రజ్యోతిలో ప్రచురితం. కవితలు, గేయాలు, వ్యాసాలు, సాహిత్య సమీక్షలు వివిధపత్రికలలో చోటుచేచేసుకున్నాయి. ఆకాశవాణి , దూరదర్శన్‌లలో గేయాలు, ప్రసంగాలు ప్రసారం. 'జన్మభూమి' ప్రధానాంశంగా 2001లో రాసిన గీతమాలిక క్యాస్‌ట్ గా విడుదలయ్యింది. తెలుగులోనే కాకుండ ఆంగ్లం, హిందీ భాషల్లో కూడా రచనలు చేశారు. లక్ష్యం: తెలుగు సాహిత్య ఉన్నత విలువలను జాతీయ స్థాయిలో ఇతరులకు పరిచయం చేయాలి. చిరునామా: డాక్టర్‌ ఎస్‌ఎం ఇక్బాల్‌, ఖాజా హుస్సేని మంజిల్‌, మెంటల్‌ ఆసుపత్రి గేటు కూడలి, చిన్నవాల్తేరు. విశాఖపట్నం -17. దూరవాణి: 0891-279611, సంచారవాణి: 98481 98478.

ఇస్లాం షేక్‌
పశ్చిమగోదావరి జిల్లా ఆరుగొలనులో 1978

ఏప్రిల్‌ 25న జననం. తల్లి తండ్రులు: పకర్‌బీ, అబ్దుల్‌ రహమాన్‌. చదువు: ఎం.ఏ. వృత్తి: జర్నలిజం. 2006లో 'గీటురాయి' వార పత్రికలో 'తెలుగు భాష ప్రాముఖ్యత' శీర్షికన వ్యాసం రాయడం ద్వారా రచనా రంగప్రవేశం. వివిధ పత్రికల్లో ప్రధానంగా గీటురాయిలో వ్యాసాలు, కవితలు చోటు చేసుకున్నాయి. లక్ష్యం: సామాజిక రుగ్మతల తొలిగింపు రచయతగా కృషి చేయాలి. చిరునామా : షేక్‌ ఇస్లాం, తండ్రి: అబ్దుల్‌ రహిమాన్‌, ఆరుగొలను -534146, పశ్చిమ గోదావరి జిల్లా. దూరవాణి: 08818-281813.

77