పుట:అక్షరశిల్పులు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

వృత్తి: గాయకుడు, సామాజికకార్యకర్త. కలంపేరు: గని. 1973 నుండి ప్రజానాట్యమండలి కళాకారుడిగా పాటలు, గేయాలు రాయడం పాడటం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటినుండి పలు కవితలు, గేయాలు, వ్యాసాలు వివిధ

పత్రికలలో, పలు సంకలనాలలో, పాటల పుస్తకాలలో చోటు

చేసుకున్నాయి. ప్రజా ఉద్యమాలను మరింత బలంగా, స్పూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్ళేందుకు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా, దురలవాట్లను రూపుమాపే లక్ష్యంగా గేయాలు రాసి స్వయంగా పాడుతూ మంచి గాయకుడిగా ప్రజల మన్నన పొందారు . పురస్కారాలు: సరసగాన రత్నాకర (బాలభారతి, గుంటూరు, 2003). ప్రజాకళాకారుడిగా పలు ప్రజా సంఘాలచే సత్కారాలు అందుకున్నారు. లక్ష్యం: మనిషిని మనిషిగా గుర్తించే సమాజం కోసం కలం-గళం కలపి పనిచేస్తూ ఆ దిశగా ప్రజానీకాన్ని పురికొల్పుట. చిరునామా: షేక్‌ ఘన్‌ షైదా (గని), ఇంటి నం. 26-11-12, ఇస్లాంపేట, నగరంపాలెం, జెండాచెట్టు వీధి, గుంటూరు-522 004, గుంటూరు జిల్లా. సంచారవాణి: 94414 52819.

గౌస్‌ ఖాన్‌ పి.
కడప జిల్లా రాజంపేటలో 1946 ఏప్రిల్‌ 12న జననం. తల్లితండ్రులు:
పి. ఖైరూన్‌ బి, పి. మహబూబ్‌ ఖాన్‌. ఉద్యోగం
తెలుగుగంగ

ప్రాజెక్టు, కడప. 1975 నుండి రచనావ్యాసంగం ఆరంభం. అప్పటి

నుండి కవితలు, కదలు వివిధ పత్రికలలో ప్రచురితం. దూరదర్శన్‌,

ఆకాశవాణిలో ధార్మిక-సామాజిక అంశాల మీద ప్రసంగాల ప్రసారం. అవార్డులు: కవిమిత్ర (కడప,2000), మిలినియం అవార్డు (2000). లక్ష్యం: మతం ప్రధానం కాదు, మమత ముఖ్యమని పది మందికి రచనల ద్వారా తెలపడం. చిరునామా: పి.గౌస్‌ఖాన్‌, ఇంటి నం.2/270, దేవాలయం వీధి, మారుతీనగర, కడప, కడప జిల్లా. సంచారవాణి: 98484 70358.

గౌస్‌ ఖాన్‌ పియండి.: ప్రకాశం జిల్లా లోఢిఖాన్‌ పేటలో 1973 అక్టోబర్‌ 10న జననం. తల్లితండ్రులు: హఫిజాబి, పి. జాఫర్‌ ఖాన్‌. చదువు: బిఎస్సీ., బి.ఇడి. వృత్తి: ఉపాధ్యాయులు. 1996లో 'గీటురాయి' వారపత్రికలో ధార్మిక వ్యాసం రాయడం దాfiరా రచన వ్యాసంగం ఆరంభమై వివిధా పత్రికలలో ధార్మిక- సామాజిక వ్యాసాలు, కవితలు ప్రచురితం. ఆకాశవాణిలో ధార్మిక ప్రసంగాలు ప్రసారం. బాల బాలికలకు ప్రధానంగా పాఠశాల 68