పుట:అక్షరశిల్పులు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

విద్యార్థులకు ఉపయుక్తమగు నాటికల ప్రదర్శన మాత్రమే కాకుండ ఆకాశవాణి,టివి ఛానెల్స్‌ ద్వారా ప్రసారం అయ్యాయి. ఉర్దూ భాష నుండి పలు గ్రంథాలను తెలుగులోకిఅనువదించారు. అనువాద గ్రంథాలు: 1. ఇస్లామీయ ఉద్యమం-కార్యకర్తలు, 2. ఇస్లామీయవ్యవస్థలో ముస్లిమేతరుల హక్కులు, 3.రమజాను ఉపవాసాలు, 4. ఇస్లామియా నియమ నిబంధనలు, 5. బాల్య వివాహాలు-ఇస్లాం, 6.యువకుల సమస్యలు-పరిష్కార మార్గాలు. లక్ష్యం: సర్వమానవాళి క్షేమం. చిరునామా: పిఎండి గౌస్‌ఖాన్‌, లోఢిఖాన్‌పేట-523 346, బెస్తవారిపేట (మ), ప్రకాశం జిల్లా. సంచారవాణి: 94901 76240, 94901 76239.

గౌస్‌ మొహిద్దీన్‌ ముహమ్మద్‌
నల్గొండ జిల్లా నల్గొండలో 1974 న్‌ 22న జననం.

తల్లితండ్రులు: ఫైజున్నీసా బేగం, ముహమ్మద్‌ షంషుద్దీన్‌. చదువు:

ఎం.ఏ., ఎం.ఫిల్‌., బి.ఇడి. ఉద్యోగం: అధ్యాపకులు. రాష్ట్రంలోని వివిధ పత్రికలలో, పలు కవితా, కథా సంకలనాల్లో కవితలు, కథానికలు సాహిత్య వ్యాసాలు ప్రచురితం. రచనలు: 1. 'గుంజాటన' (ముస్లిం, శాద్రా కవితా సంకలనం, 2006), 2. అత్తరు సీసా (2010). లక్ష్యం: బడుగు బహుజన మైనార్టీ వర్గాలను సాహిత్యం ద్వారా మరింతగా సన్నిహితం చేయడం. చిరునామా: మొహమ్మద్‌ గౌస్‌ మొహిద్దీన్‌, ఇ.నం. 5-11-222, హైదార్‌ఖాన్‌ గూడెం, నల్లగొండ-508001, నల్గొండ జిల్లా. సంచారవాణి: 9985093243.

గౌస్‌ మొహిద్దీన్‌ ఎస్‌.
కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకా వెలవలి గ్రామం. కలం

పేరు: వెలవలి. రచనలు: కాకమ్మ కథలు, కన్నీటి కానుక (నవలలు), జీవితం ఒక జూదం (నాటిక). నటుడు, దర్శకులుగా విఖ్యాతులు.

గులాం గౌస్‌ షేక్‌
కృష్ణా జిల్లా మైలవరం తాలూకా చీమలపాడులో 1955 జూన్‌

10న జననం. తల్లితండ్రులు: హమాత్‌ బీబి, ముహమ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌. అసలు పేరు గులాం గౌస్‌ అయినప్పటికి 'శాతవాహన'

'ఏకెఏ' పేరుతో సుప్రసిద్దులు. చదువు: బి.ఏ (లిట్)., సాహిత్య విశారద. పిజి డిప్లోమా ఇన్‌ జర్నలిజం. ఉద్యోగం: 'ప్రభవ' మాసపత్రికతో ఆరంభమై 'సితార', 'ఉదయం' దినపత్రికలో పలు బాధ్యాతలు నిర్వహించారు. 1974లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో 'మానవత' కవిత రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటినుండి సుమారు వందకు పైగా కథానికలు, ఇతర భాషల్లో నుండి తెలుగులోకి అనువదించిన 40 కథలు, వందకు దాటిన కవితలు వివిధ పత్రికలలో

69