పుట:అక్షరశిల్పులు.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

ప్రాంతాల దయనీయ స్థితిని, ప్రజల దుర్బర జీవితాలు, వారి అవస్థలను సమాజం దృష్టికితీసుకొచ్చేందుకు కృషి. చిరునామా: సిరిసిల్లా గఫూర్‌, హింది పండిట్, ఇంటి నం. 5-8-86, శ్రీరాంనగర్‌ కాలనీ, కామారెడ్డి-503111, నిజామాబాద్‌ జిల్లా. సంచారవాణి: 98490 62038. Email: sirsillagafoor@yahoo.com

గఫూర్‌ బేగ్ ముహమ్మద్‌
ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభంలో జన్మించారు. చిన్నతనం

నుండి సాహిత్యాభిలాషి. పలు కవితలు, గేయాలు, వివిధ

పత్రికలలో ప్రచురితం అయ్యాయి. 1976 ప్రాంతం లో హైదారాబాదులోని రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలోని న్యాయ విభాగంలో ఉద్యోగ బాధ్యాతలు నిర్వహించారు. తెలుగు సాహిత్యం పట్ల అభిమానం మెండుగా గల ఆయన హైదారాబాదు నగరంలో జరిగిన వివిధ సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో ప్రదాన పాత్రను పోషించారు. రచనలు: నిరపరాదులు (కథా సంపుటి), గ్రీష్మంలో ఓ వసంతం (నాటిక), కరిగిన మనసులు లాంటి గ్రంథాలను రాసి స్వయంగా వెలువరించారు. (సమాచారం: డాక్టర్‌ షేక్‌ మస్తాన్‌, అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీఘర్‌, 14.04.2010)

గఫూర్‌ యస్‌
కర్నూలు జిల్లా, పాత్రికేయులు. కథలు, వ్యాసాలు.

గయాజ్‌ బాషా షేక్‌: ప్రకాశం జిల్లా కనిగిరిలో 1962 ఆగస్టు ఒకిటిన జననం. తల్లితండ్రులు: మస్తాన్‌ బీ, షేక్‌ పాచ్ఛామియా. కలంపేరు: కనిగిరి గయాజ్‌. చదువు:

ఇంటర్మిడియట్., డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రానిక్స్‌. ఉద్యోగం: వ్యాపారం.

చిన్నతనం నుండి కళారంగం, సాహిత్యం మీద దృష్టి. పలు పాటలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితం. రచనలు: 1.స్వర కవనం (పాటల సంపుటి, 2010), 2. నువ్వు-నేను-ఆకాశం (పాటల సంపుటి, 2010). అవార్డులు: రాష్ట్ర ఉత్తమ పౌరుడు, సేవారత్న, కళారత్న అవార్డులు. లక్ష్యం: సామాజిక సమస్యలకు రచనల ద్వారా, కళారూపాల ద్వారా పరిష్కార మార్గాలను చూపించడం. చిరునామా: షేక్‌ గయాజ్‌ బాషా, ఇంటి నం. 4-125, నాల్గవ వారు, బాదుల్లా వారీ వీధి, కనిగిరి-523230, ప్రకాశం జిల్లా. సంచారవాణి: 99664 27276.

ఘన్‌ షైదా షేక్‌ (గని)
గుంటూరు జిల్లా గుంటూరులో 1954లో జననం. పూర్తిపేరు:

షేక్‌ ఘన్‌ షైదా. తల్లితండ్రులు: షేక్‌ ఫాతిమాబీ, అబ్దుల్‌ రహిమాన్‌. చదువు: ఇంటర్మీడియెట్.

67