పుట:అక్షరశిల్పులు.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

జాతి ప్రయోజనాల కోసం పని చేయడం, మతసామరస్య-లౌకిక వ్యవస్థలను మరింతగా పటిష్టపర్చడం కోసం రచనా వ్యాసంగాన్ని విస్తృతంగా సాగించడం. చిరునామా: ఇంటి నం.15/248, బెస్తవీధి, పోరుమామిళ్ళ-516193, కడప జిల్లా. దూరవాణి: 08569- 285241, సంచారవాణి: 94416 83183.

గఫార్‌ సయ్యద్‌
నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లిలో 1956 జనవరి

మూడున జననం. తల్లితండ్రులు: సయ్యద్‌ మాలన్‌బి, సయ్యద్‌ అయూబ్‌ అలి. చదువు: బిఏ., విద్వాన్‌., డిఓయల్‌. చిన్నవయస్సు నుండి సాహిత్యపఠనం పట్ల ప్రత్యేకాభిలాష.

అక్షరశిల్పులు.pdf

1973లో కళాశాల లిఖిత మాసపత్రికలో 'లే ఖ ' కవిత

ప్రచురితమైంది. అప్పటినుండి వివిధ పత్రికలలో, కధా-కవితా సంకలనాల్లో కవితలు, కథలు చోటు చేసుకున్నాయి. పలు నాటికలను స్వయంగా రాసి నటించి, ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కవితల్లో 'అంగట్లో దొరికే సరుకు కాదు దేశభక్తి' (జల్‌జలా కవితా సంకలనం), 'అమ్మా... నేనే...నే' (అజాం), 'జనన వాగ్మూలం' (జిహద్‌) లాంటి కవితలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.ఫొటోగ్రాఫర్‌గా, నాటక రచయితగా, నటుడిగా సుప్రసిద్దులు. చలనచిత్రాలలో నటించారు. 'పంచాయితీ రాజ్‌ లీడర్‌' మాసపత్రిక సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. లక్ష్యం: సామాజిక చైతన్యం కలుగచేయగల సత్తా ఉన్నరచనలు పాఠకులకు అందించాలన్నది. చిరునామా: సయ్యద్‌ గఫార్‌, క్లిక్‌ అండ్‌ ఫ్లాష్‌ డిజిటల్‌ స్టూడియో, మిర్యాలగూడ-508207, నల్లగొండ జిల్లా. సంచారవాణి: 90108 83848. Email: panachayathrajleader@gmail.com.

గఫూర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ షేక్‌
కరీనంగర్‌ జిల్లా సిరిసిల్లాలో 1978 జూన్‌ ఒకిటిన

జననం. తల్లితండ్రులు: షేక్‌ రజియాబీ, షేక్‌ అబ్దుల్‌ రషీద్‌. కలంపేరు: సిరిసిల్లా గఫూర్‌

అక్షరశిల్పులు.pdf

శిక్షక్‌. చదువు: ఎం.ఏ (హిందీ). వృత్తి: ఉపాధ్యాయులు.

1980లో 'బాలభారతి' మాస పత్రికలో రాసిన 'హిట్లర్‌- నెపోలియన్‌' వ్యాసంతో రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటి నుండి బాల బాలికలకు ఉపయుక్తమగు చరిత్రకు సంబంధించిన పలు వ్యాసాలు రాసి వివిధ పత్రికలలో వెలువరించారు. రాష్ట్రంలోని వివిధ పత్రికల్లో పలు కవితలు, సాహిత్యవ్యాసాలు సమీక్షా వ్యాసాలు ప్రచురితం. సంకనాల్లో కవితలు చోటు చేసుకున్నాయి. రచనలు: తబ్దీల్‌ (వచన కవితా సంపుటి, 2009). పురస్కారాలు: ఇందూరు సాహితీ పురస్కారం (నిజామాబాద్‌ జిల్లా). లక్ష్యం: గ్రామీణ

66