పుట:అక్షరశిల్పులు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

22 ఏళ్ళపాటు విప్లవ రచయితల సంఘం సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. పలు ప్రజా సంఘాలతో సంబంధాలు కలిగి ఆయా సంఘాలు నిర్వహించిన ఉద్యమాలకు సాహిత్య పరిపుష్టి కల్గించేందుకు రచయిత-కవిగా చేయూతనిచ్చారు. స్వయంగా సంఘాలు-సంస్థలు స్థాపించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేశారు. ప్రస్తుతం 'వనిత' టివీలో అవుట్ పుట్ ఎడిటర్‌గా భాధ్యతలను నిర్వహిస్తూ, ఎన్‌టీవిలో 'లల్లూ బ్రదర్స్‌' ప్రోగ్రాం ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. రచనలు: జూలియస్‌ ఫ్యూజిక్‌ (1981), ప్రహ్లాదుడు (1981) లక్ష్యం: అసమాన సమాజాన్ని సమసమాజం దిశగా నడిపంచేందుకు అవసర,మైన విధంగా ప్రజానీకాన్ని చైతన్యపర్చడం. చిరునామా : అహ్మద్‌ మొహిద్దీన్‌ ఖాన్‌ యజ్దానీ జర్రానీ, 616, థర్డ్‌ ఫ్లోర్‌, శివా ప్యాలెస్‌ ఎక్స్‌టెన్షన్‌ లేన్‌, స్ట్రీట్ నం.10, గగన్‌ మహల్‌, దోమలగుడ, హైదారాబాద్‌-500029. సంచారవాణి: 98665 41148, 99480 92615 (పిప). Email: khanyazdani@yahoo.co.in

దరియా హుస్సేన్‌ షేక్‌
గుంటూరు జిల్లా వినుకొండ జన్మస్థలం. తల్లితండ్రులు:

మౌలాబి, ఇమాం సాహెబ్‌. పుట్టిన తేది: 01-07-1933. చదువు: వినుకొండ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సి, నరసరావుపేట ఎస్‌ఎస్‌యన్‌ కళాశాలలో బి.ఎ., రాజమండ్రిలో బి.ఇడి చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమితిలో విస్తరణాధికారి (విద్యాశాఖ) గా ఉద్యోగం చేశారు. అష్టావధానాలు, కవి సమ్ళేళనాలలో చురుగ్గా పాల్గొనడం మాత్రమే కాకుండా 'రాయల్‌ కళాగోష్టి' (అనంతపురం) కార్యదర్శిగా సాహిత్య-సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో మిక్కిలి ఆసక్తి చూపారు. రచనలు: పురుషోత్తముడు, విశ్వనాధ విజయము.

దస్తగిరి అచ్చుకట్ల చిన్న: కడప జిల్లా రాజుపాలెం మండలం దద్దనాల గ్రామంలో 1939 జూన్‌ 15న జననం. కలంపేరు: ఎసి దస్తగిరి. తల్లితండ్రులు: ఖాదర్‌బి, మహబూబ్‌ సాహెబ్‌ . చదువు: భాషాప్రవీణ., పి. ఓ.ల్‌ . ఉద్యోగం :

అధ్యాపకులు, 1997లో విరమణ. విద్యార్థిగా 'సుషమ' సాహిత్య

మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తూ, పద్యాలు రాస్తూ రచనా రంగంలో ప్రవేశించారు. 1961లో ప్రతాప వెంకటయ్య శాస్త్రితో కలసి 'వర్తమానం' పద్యకావ్యం ప్రచురించారు. అప్పటినుండి సాహిత్యసేవలో భాగంగా సాహిత్యసభలునిర్వహణ, అష్టావధానాలలో పాల్గొనడం, సాహిత్య-ధార్మిక ఉపన్యాసాలు చేయడంలో ఆసక్తి చూపడంతో పలు సాహిత్య ప్రసంగ వ్యాసాలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి.1973లో 'నవ్య సాహితీ సమితి' (ప్రొద్దుటూరు) స్థాపించి పలు సాహిత్య కార్యక్రమాల నిర్వహణ. కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ

59