పుట:అక్షరశిల్పులు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

కథా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితం. ఈ కథను ఆ ఏటి ఉత్తమ భారతీయ కథాల్లో ఒకిగా 'జ్ఞానపీఠ్‌' వారు ఎంపికచేసి, హిందీలోకి తర్జుమా చేసి 1983 నాటి జాతీయ కథా సంకలనంలో చోటు కల్పించారు. అన్నిభారతీయ భాషల్లో ఈ కథ అనువాదామై

ఆయా భాషల పత్రికల్లో ప్రచురితమైంది. అప్పటినుండి వివిధ పత్రికలలో, కథా సంకలనాలలో పలు కవితలు, కథానికలు, కథలు, సాహిత్య వ్యాసాలు, సమీక్షలు ప్రచురితం. అహింస, గుక్కెడు నీళ్ళు, మసీదు పావురం, మురళి వూదే పాపడు, ఎల్లువ, ఏి ఒడ్డు చేపలు, వారసత్వంలాంటి కథలు గుర్తింపు తెచ్చి పెట్టాయి. 'మసీదు పావురం' కథని సాహిత్య అకాడమీ ఎంపిక చేసి హిందీలోకి అనువదించి ప్రచురించగా, 'ఎల్లువ కథ' తెలుగులోకి వచ్చిన నూరు మంచి కథలలో ఒకటిగా 'విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్‌' ఎంపిక చేసి సంకలనంలో స్థానం కల్పించింది. ప్రచురితమైన కథలలో సుమారు 20 కథలు ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి. తెలుగులో ఇతరులు రాసిన మంచి కథలను ఆంగ్లంలోకి స్వయంగా అనువదించి వెలువరించారు. లక్ష్యం: తెలుగు కథకు విశ్వవ్యాప్తంగా ఖ్యాతి రావాలన్న బలమైన ఆకాంక్షకు తగిన కృషి. చిరునామా: యన్‌. దాదా హయాత్‌, న్యాయవాది, ఇంటి నం. 3/400-12, సహారా రెసిడెన్సీ, సాయి కుటీర్‌ రోడ్డు, ప్రొద్ధుటూరు-516360, కడప జిల్లా. దూరవాణి: 08564-257432. 9490004826,

డానీ యస్‌
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 1951 ఆగస్టు27న జననం.

పూర్తిపేరు: అహ్మద్‌ మొహిద్దీన్‌ ఖాన్‌ యజ్దానీ జర్రానీ. కలంపేరు. ఉషా యస్‌ డానీ, ఆషా, అజిత, ఫిదాయి, వశిష్టా నర్సాపురి. యజ్దానీ అనేది కాలక్రమంలో 'యస్‌.దానీ' గా,

'

యస్‌ డానీ' గా, మారి చివరకు 'డానీ'గా ప్రాచుర్యం తల్లితండ్రులు: సూఫియా బేగం, తరాజేష్‌ అలీ ఖాన్‌. చదువు: పియుసి. వృత్తి : జర్నలిస్ట్‌. పన్నెండో ఏట విద్యార్థిగా నాటిక రాసి పాఠశాలలో ప్రదర్శించడంతో రచనా వ్యాసంగం ఆరంభం. 1972లో రాసిన 'ప్రగతి' నాటిక బహుళ ప్రచారం పొంది బహుమలు అంసుకుంది. 1978 నుండి మార్కిస్టు (కార్మికవర్గ) దృక్పథంతో రచనలు చేయడం ఆరంభించగా వివిధ పత్రికలు, ఉద్యామ పత్రికలు, సంకలనాలలో పలు కవితలు, కథలు, నాటికలు, గేయాలు, సమీక్షలు, ప్రచురితం అయ్యాయి. ఆంగ్లంలోనూ పలు వ్యాసాలు రాశారు. ఆంగ్లం నుండి తెలుగులోకి పలు వ్యాసాలను అనువదించారు. 1978 నుండి

58