పుట:అక్షరశిల్పులు.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పలువురి రచనలను నవ్య సాహితీ సమితి పక్షాన ప్రచురించి తోడ్పాటు అందించారు. స్వీయ రచనలు: 1. పద్యోపహరణము (1961), 2. వర్తమానం (1965), 3. అమృతమూర్తి, 4. కవితా భారతి (పద్యకావ్యాలు), 5. మణి మంజూష (ఖండ కావ్యం). ఈ రచనలలో 'అమృతమూర్తి' గుర్తింపు, ఖ్యాతిని తెచ్చిట్టింది. లక్ష్యం: సర్వమానవ సౌభ్రాతృత్వము -మానవతా దాష్టి-దేశభక్తి పెంపుదల దిశగా సాహిత్య కృషి. చిరునామా : అచ్చుకట్ల దస్తగిరి, ఇంటి నం.26/210, నేతాజీనగర్‌, ప్రొద్దుటూరు-516360, కడప జిల్లా, సంచారవాణి: 98494 37454.

దావూద్‌ అలీ సయ్యద్‌
ఖమ్మం జిల్లా సత్తుపల్లి. తల్లితండ్రులు: ఇమాంబి, అబ్బాస్‌.

చదువు: బి.ఎ, సాహిత్యరత్న (హింది). కాశ్మీరి భాషలో ప్రత్యేక డిప్లొమా. హిందీ పండితులు. కలం పేరు: మంజు. రచనలు: కవితలు, గేయాలు.

దావూద్‌ ఇనగంటి
ప్రకాశం జిల్లా నాగులపాలెంలో 1928 ఫిబ్రవరి 20న జననం.

తల్లి తండ్రులు: మదార్‌బి, ఖాశిం సాహెబ్‌. చదువు: బి.ఏ. ఉద్యోగం: 1950లో మద్రాస్‌ సచివాలయం అధికారిగా ఉద్యోగం చేపట్టి 1986లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో

అక్షరశిల్పులు.pdf

జాయింటు సెక్రటరీగా రిటైర్డ్‌ ఆయ్యారు. 1967లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను

విశ్లేషిస్తూ తెలుగు, ఆంగ్ల బాషల్లో వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. వక్ప్‌ ఆస్తుల పరిరక్షణ, సద్వినియోగం గురించి రాసిన ఆంగ్ల వ్యాసం రాష్ట్రపతి డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ ప్రశంసలందుకుంది. ఇస్లాం, క్రైస్తవం, హిందూ మతాలకు చెందిన ధార్మిక గ్రంథాలను 1076 సమన్యయ పరుస్తూ రాసిన వ్యాసాల విశిష్టత వలన ఆయా ధార్మిక సంస్థల సన్మానాలు పొందారు. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతినిధిగా హాజరయ్యారు. ఆకాశవాణి ద్వారా ప్రసంగవ్యాసాలు ప్రసారం అయ్యాయి. రచనలు: నూర్‌ బాషీయుల చరిత్ర-సంస్కృతి (2001). లక్ష్యం: అన్నిరంగాలలో అసమానతలు తొలిగిపోవాలి. చిరునామా: ఇనగిం దావూద్‌, ఇంటి నం.198/3, ఆర్టీ, విజయనగర్‌ కాలనీ, హైదారాబాద్‌-500057. దూరవాణి: 040-23345660.

దావూద్‌ సాహెబ్‌ షేక్‌
కర్నూలు జిల్లా చిట్వేలు జన్మస్థలం. తల్లితండ్రులు: ఖాదర్‌బి,

సుల్తాన్‌ సాహెబ్‌. పుట్టిన తేది: 01-07-1916. చదువు: విద్వాన్‌ (తెలుగు-హిందీ), తెలుగు అధ్యాపకులు. కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన గావించారు. అరబిక్‌, ఉర్దూ, తెలుగు భాషల్లో మంచి విద్వత్తును సంపాదించిన

60