పుట:అక్షరశిల్పులు.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నన్మానాలు, పురస్కారాలందుకున్నారు. లలక్ష్యం: సామాజిక రుగ్మతలకు పరిష్కారాలు చూపడం. చిరునామా : షేక్‌ అల్లా బక్షి బేగ్, ఇంటి నం.13-8-20, ఫిష్‌ మార్కెట్ వద్ద, మార్కెట్ వీధి, బాపట్ల-522101, గుంటూరు జిల్లా. సంచారవాణి: 93469 10500.

అమీన్‌ సాహెబ్‌ సయ్యద్‌: 'జీవామృతం సంజీవని' ఆయన రచన. అమిరి మువ్వలున్‌: మద్రాసులోని రైల్వేలో ఉద్యోగి. ఆయన అలనాటిచిరునామా: 302-ఎ, దక్షిణ రైల్వే భవనాలు, విల్లిపక్రమ్‌, మద్రాసు-10. రచన : విశ్వప్రవక్త.

అనిస్‌ ముఖ్తదిర్‌ మహమ్మద్‌: నల్గొండ జిల్లా నల్గొండలో 1967 మార్చి23న జననం. తల్లితండ్రులు: అహమ్మదున్నీసా బేగం, మహమ్మద్‌ ఖయ్యూం. చదువు: బి.ఏ.

ఉద్యోగం: రాష్ట్ర ప్రభుత్వ వ్యయసాయశాఖ నుండి స్వచ్ఛంద విరమణ. ప్రసుతం రియల్‌ ఎస్టేట్ వ్యాపారం, సామాజిక కార్యకర్త. ఉద్యోగుల సమస్యల మీదవ్యాసాలు రాయడం ఆరంభించి సామాజిక అంశాల మీద 'ఇస్లామిక్‌ వాయిస్‌' పక్ష పత్రిక 2009 మార్చి సంచిక నుండి వరుసగా వ్యాసాలు రాశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముస్లింల సమస్యలను వివరిస్తూ, ఆ సమస్యల పరిష్కారం సూచిస్తూ 2009లో 'ముస్లిం మ్యానిఫెస్టో' చిరుపొత్తాన్ని రాసి ప్రచురించారు. లక్ష్య: సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా, అసమానతల తొలగింపు దిశగా ప్రజలను చైతన్యపర్చడం. చిరునామా: మహమ్మద్‌ అనిస్‌ ముఖ్తదిర్‌, ఇంటి నం. 6-2-853, మీర్‌బాగ్ కాలనీ, నల్లగొండ-508001, నల్లగొండ జిల్లా, సంచారవాణి: 94404 23687. Email: aneesmef@gmail.com

అన్వర్ పాష మహ్మద్‌: వరంగల్‌ పట్టణం శివనగర్‌లో 1968 న రెండున

జననం. తల్లితండ్రులు: కరీంబీ, జానీమియా. చదువు: బిఎస్సీ.,

బి.ఎ., ఎం.ఎ (తెలుగు)., ఎం.ఎ (సోషియాలజీ). ఉద్యోగం: రాష్ట్రప్రభుత్వ వైద్య- ఆరోగ్యశాఖలో ఆరోగ్య విస్తరణాధికారి. 1990లో సాహిత్యరంగ ప్రవేశం. అప్పటినుండి కథలు, కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో, కథా, కవితా, వ్యాసాలు వివిధ సంకలనాలలో ప్రచురితం. ఆంగ్లం , హిందీ భషాల్లోకి అనువదించబడిన కథానికలు, కవితలు ఆయా పత్రికల్లో ప్రచురితం. ప్రచురించిన గ్రంథాలు: 1. తలవంచని అరణ్యం (కవితా సంపుటి) 1999, 2. ముఠీస (కవితా సంపుటి) 2007, 3. 1969 వరంగల్‌ అమరవీరులు. స్వీయ సంపాదకత్వంలో వెలువడిన గ్రంథాలు: 1. అజాం (గుజరాత్‌ కవిత్వం)

44