పుట:అక్షరశిల్పులు.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

2002, 2. తెలంగాణా కవిత (2006), 3. నాయిన (కవితా సంకలనం) 2005. అవార్డులు-పురస్కారాలు: ఉమ్మడి శెట్టి సాహిత్య అవార్డు, రెండు సార్లు ఎక్స్‌రే ఆవార్డు. వరంగల్‌జిల్లా యువకవిగా ఎంపిక. ఆ తరువాత వరంగల్‌ జిల్లా 'ఉత్తమ కవి' గా నాలుగుసార్లుఎంపికయ్యి ఘన సత్కారం పొందారు. రాష్ట్రస్థాయి సాహిత్య సంస్థల ద్వారా పలు సన్మానాలు అందుకున్నారు. లక్ష్యం: కవిత్వంశరీరంలో రక్తనిష్టగా ప్రవహించాలన్న ఆశయంతో, జీవిత మూలాలకు సంబంధించిన విషయాల్ని కవిత్వీకరించడం, ముస్లింల జీవన, సామాజిక, ఆర్థిక, సాంఫిుక విషయాల వ్యక్తీకరణ. చిరునామా : మహ్మద్‌ అంవర్‌ పాష, ఇంటి నం.16610-374, శివనగర్‌, వరంగల్‌-506002, వరంగల్‌ జిల్లా, సంచారవాణి: 98660 89066, Email: anwarwarangal@ gmail.com.

అన్వర్ పాష మహ్మద్‌
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో 1959 లై 22న జననం. తల్లి తండ్రులు: జైబుబున్నీసా, ఎం.ఎ సలీం. చదువు : ఎం.ఎ (చరిత్ర)., ఎం.ఎ (ఆర్కియాలజీ)., ఎం.ఎ. (రాజనీతి శాస్త్రం)., ఎల్‌ఎల్‌.బి. ఉద్యోగం: రాష్ట్ర వాణిజ్య

పన్నులశాఖలో ఉన్నతాధికారి. మంచి వక్త, ప్రయోక్త. 1977లో

'స్మశానం' కవిత ప్రచురితం అయినప్పటినుండి కవితలు, కథానికలు, వ్యాసాలు పత్రికలలో ప్రచురితం. ప్రచురణ: వస్తుసేవల చట్టం (2010). రాష్ట్ర వాణిజ్యశాఖాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజల ప్రయోజనార్థం తెలుగులోకి అనువదించి గ్రంథాలను ప్రచురించారు. లక్ష్యం: సర్వమానవ సమానత్వం, సర్వజనావళి సౌభాగ్యం. చిరునామా: మహమ్మద్‌ అన్వర్ పాషా, ఇంటి నం.7-21-315, ప్రశాంత్‌ హిల్స్‌, రాయదర్గా, గోల్కోండ పోస్ట్‌, హైదారాబాద్‌- 500028. సంచారవాణి : 99499 92844, Email: mdanwar315 @yahoo.com

ఆరిఫ్‌ బాష షేక్‌
ప్రకాశం జిల్లా గిద్దలూరులో 1970 డిసెంబర్‌ 20న జననం.

తల్లితండ్రులు: షేక్‌ జులేఖాబి, షేక్‌ అబ్దుల్‌ రహీం. చదువు:

ఎంఎ., ఎంపిఎ., ఎం.బి.ఎ., పిజిడిఎ. ఉద్యోగం: అధ్యాపకులు


(హైదారాబాద్‌). చిన్నతనం నుండి రచనా వ్యాసంగం పట్ల అభిలాషతో వ్యాసాలు రాయడం ఆరంభించి 1992లో 'పాలపిట్ట' ప్రచురణ. రచనలు: 1992లో 'పాల సముద్రం' (నవల, 1992), 2. జీవితాలాపన, నవల (1999), 3. భారత ప్రభుత్వం - రాజకీయాలు (2001), 4.రాజనీతి సిద్ధాంతాలు (2004), 5. వ్యక్తి వికాసం (ఇంటర్యూ టెక్నిక్స్‌ 2010), 6. నాయకత్వ


45