పుట:అక్షరశిల్పులు.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


అలీ సయ్యద్‌: నల్గొండ జిల్లా దేవరకొండ జన్మస్థలం. రచనలు: జలంధరాసుర వధ, ప్రమీల, దిగంబరమోహిని, నవీన సత్యహరిశ్చంద్ర, నల చక్రవర్తి, భీమ పరమ మహాత్యము, బబ్రువాహన, ధృవ, నగర, ఆనందగురు గీత, ముక్తి ప్రదాయిని, సత్యాద్రౌపది సంవాదము, కాళింది, సిరిసినగండ్ల నలనాటకము, సీతారామ శతకము, సురభాండేశ్వరము, మానసిక రాజయోగము.

అల్లా బక్ష్ షేక్‌: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 1971 న్‌ 15న జననం. తల్లి తండ్రులు: షేక్‌ ఫాతిమా, షేక్‌ అబ్దుల్‌ కలాం. వ్యాపకం:

జర్నలిస్ట్‌. 1982లో కళాశాల పత్రికలో కవిత రాయడం ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం. అప్పిటి నుండి కవితలు, కథానికలు, వ్యాసాలు వివిధవార పత్రికలలో, సంకలనాలలో ప్రచురితం అయ్యాయి. లక్ష్యం: అట్టడుగు జీవితాల బాధల గాధలను వెలుగు లోకి తీసుకరావడం, బాధిత ప్రజానీకం జీవితాల్లో మార్పు కోరుతూ సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం. చిరునామా: ఇంటి నం. 16-438, భగత్‌సింగ్ రోడ్‌, చిలకలూరిపేట-522616, గుంటూరు జిల్లా. సంచారవాణి: 92905 92576, Email: allbaskhsu@gamail.com., s.allabaskshu@rediffmail.com

అల్లా బక్షి బేగ్ షేక్‌: గుంటూరు జిల్లా బాపట్లలో 1952 సెప్టెంబర్‌ 12న జన్మించారు. తల్లితండ్రులు: షేక్‌ మస్తాన్‌ బీ, ఖాశిం బేగ్. చదువు: బి.ఏ. వ్యాపకం: జర్నలిస్ట్‌, నాటక రచయిత-నటుడు. కలంపేరు: ఆనంద బక్షి. డా|| కొర్రపాటి గంగాధార రావు, కె.యస్‌టి శాయిల ప్రేరణ, ప్రోత్సాహంతో 1978 నుండి నాటకాలు

రాయడం, నటించడం, ఆరంభం. 1980లో తొలిసారిగా రాసిన

'సంఘర్షణ' (నాటకం) 1983 ఆగస్టు 2న 16 భాషల్లోకి అనువాద మై ఆకాశ వాణిద్వారా జాతీయ నాటకంగా ప్రసారమైంది. కవితలు, వ్యాసాలు, కథానికలు వివిధ పత్రికలలో ప్రచురితం. కవితల్లో స్నేహదీపం, ఎవరు దేవుడు? గుర్తింపు తెచ్చాయి. 1994లో రాసిన 'కార్మికులారా ఏకంకండి' నాటకం ప్రజాదారణ పొందింది. తీరం చేరని కెరటాలు, ఛైర్మన్‌ చంద్రయ్య ఉత్తమ నాటికలుగా ఎంపికయ్యాయి. 23 రేడియో నాటికలు, 8 నాటకాలు రాశారు. అన్ని ప్రదర్శనలు, ప్రసారం అయ్యాయి. ఉత్తమ రచయితగా, నటుడిగా పలు విజయాలను నమోదు చేసుకున్నారు. నటుడిగా, నాటక రచయితగా సాహితీ-సాంస్కృతిక సంస్థలచే


43