పుట:అక్షరశిల్పులు.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


ఉస్మాన్‌ ఖాన్‌ ముహమ్మద్‌ (పాషా): ఖమ్మం జిల్లా నల్లముడి జగన్నాధపురంలో 1968లో జననం. తల్లితండ్రులు: వజీరున్నీసా బేగం, ముహమ్మద్‌ గౌస్‌ ఖాన్‌. కలంపేరు: సంధ్య, కారుణ్య. చదువు: 5వ తరగతి. వృత్తి: వ్యాపారం. ఉర్దూ, అరబిక్‌, హిందీ, తెలుగు భాషల్లో ప్రవేశం.1988లో 'ఉదయం' దినపత్రికలో రాసిన 'ప్రతి మొగ్గను వికసించనీయండి' ప్రచురితం అయినప్పటినుండి వ్యాసాలు కథలు, కవితలు వివిధ పత్రికల్లో చోటు చేసుకున్నాయి. తెలుగు పత్రికల్లో (ఆంధరాజ్యోతి దినపత్రిక, నది మాసపత్రిక) ధార్మిక అంశాల

మీద కాలమ్స్‌ నిర్వహిస్తున్నారు. ఉర్దూ, అరబిక్‌ భాషల్లో వచ్చిన సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి పలు గ్రంథాలను వెలువరించారు. 'గీటురాయి'

వారపత్రిక (హైదారాబాద్‌) లో 1. ద ట్రెంచెస్‌, 2. వేగుచుక్క, 3. ఆశాకిరణం, 4. దేవతలు, 5. పూలరేకు (ధార్మిక నవలలు) ధారావాహికంగా ప్రచురితం అయ్యాయి. వీటిలో 'ద ట్రెంచెస్‌' గుర్తింపు తెచ్చి పెట్టింది. మంచి వక్త. ఆకాశవాణి, దూరదర్శన్‌, టివీ ఛానెల్స్‌లలో పలు ధార్మిక ప్రసంగాలు (110) ప్రసారం అయ్యాయి. రచనలు: స్వతంత్ర గ్రంథాలు: 1. ఇస్లాం మార్గం (వ్యాససంపుటి), అనువాద గ్రంథాలు: 1. సత్యాంవేషణ, 2. దాంపత్య నియమాలు, 3. మేరాజ్‌ సందేశం, 4. కందకం సంకేతాలు, 5. మిలాదున్నబి, 6. హజ్రత్‌ ఇమామ్‌ హుసైన్‌ (రజి), 7. ఉమ్మడి కుటుంబం, 8. రమ్‌జాన్‌ సత్కార్యాల సమాహారం, 9. రమ్‌జాన్‌ శుభాలకు అర్హులు, 10. మగువల మాటలు, 11. పరిస్థితులు -బాధ్యతలు, 12. తల్లితండ్రులు -సంతానం హక్కులు, 13. హదీసు పరిమళం (నాలుగు సంపుటాలు). ఈ గ్రంథాలలో 'ఇస్లాం మార్గం', 'హదీసు పరిమళం' బహుళ పాఠకాదరణ పొందాయి. లక్ష్యం: ఎలాంటి అసమానతలు, వివక్ష లేని, దైవ భీతి పునాదుల మీద ఏర్పడే ఒక సుందర సత్సమాజ నిర్మాణం కోసం ధార్మిక-సాహిత్య సేవ. చిరునామా: ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌, ఇటి నం.1-153, నల్లముడి జగన్నాధపురం-507115, ముల్కాలపల్లి మండలం, ఖమ్మం జిల్లా. దూరవాణి: 08744-276315, సంచారవాణి: 9912580645.

ఉస్మాన్‌ సయ్యద్‌
హైదారాబాద్‌లో 1967లో జననం. తల్లి

తండులు: యూసుఫ్‌బి, సయ్యద్‌ యూఖూబ్‌ అలీ. చదువు: 9వ తరగతి. వృత్తి: ఎలక్ట్రిషియన్‌. చిన్నప్పటినుండి కవితలను రాయడం పట్ల ఆసక్తి చూపుతూవచ్చినా 1978 నుండి మాత్రమే వివిధ పత్రికల్లో, సంకలనాల్లో ప్రచురితం కావడం ఆరంభమైంది. రచనలు: 'కవితా రాణి (కవితా సంపుటి, 1988), సూర్యవాణి (కవితా సంపుటి 1989)' లక్ష్యం: అసమానతలను తొలగింపుకు


155