పుట:అక్షరశిల్పులు.pdf/155

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

కావడం లేదన్నారు. ప్రస్తుతం ఉమర్‌ అలీషా రాసిన మొత్తం పుస్తకాలలో 23 గ్రంథాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మౌల్వీ మునిమనువడు డాక్టర్‌ ఉమర్‌ అలీషా (పిఠాపురం) తెలిపారు. మౌల్వీ ఉమర్‌ అలీషా 1.అనసూయాదేవి, 2.కళ, 3.చంద్రగుప్త 4.ప్రహ్లాద లేక దానవవధ, 5.మణిమాల, 6.మహాభారత కౌరవరంగము, 7.విచిత్ర బిల్హణీయము, 8.విషాద సౌందర్యము (నాటకాలు), 1.నరకుని కాంతాపహరణ, 2.బాగ్దాదు మదువీధి, 3.విశ్వామిత్ర (ఏకాంకికలు), 1.వరాన్వేషణ అను ప్రహసనం, 1.ఖండ కావ్యములు, 2.తత్త్వ సందేశము, 3.బర్హిణి దేవి, 4.బ్రహ్మ విద్యావిలాసము, 5.మహమ్మద్‌ రసూల్‌ వారి చరిత్ర, 6.సూఫీ వేదాంత దర్శనము, 7. స్వర్గమాత, 8.హాలీ (పద్యగ్రంథాలు) రచించారు. ఆ తరువాత 1.ఈశ్వరుడు, 2.మహమ్మద్‌ వారి చరిత్ర, 3.సాధన పథము (గద్యములు), 1.తారామతి, 2.పద్మావతి, 3.శాంత (నవలలు), 1.ప్రభాత కథావళి (కథల సంగ్రహము) లను వెలువరించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా బహుభాషా పండితుడు కావడం వలన ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదం చేసిన గ్రంథాలలో 1. ఉమర్‌ఖయ్యామ్‌, 2.ఖురాన్‌ -ఏ-షరీఫ్‌, 3. గులిస్తా ప్రధానమైనవి. ఆయనకు వైద్యశాస్త్రంలో కూడా అనుభవం ఉన్నందున 1.'ఇలాజుల్‌ గుర్‌భా' అను వైద్య గ్రంథాన్ని (అనువాదం) వెలువరించారు. ఈ రచనలే కాకుండా ఆయడన సృజించిన వందకు పైగా వ్యాసాల సంపుటి, హిందీలో ఆయన చేసిన ఉపన్యాసాల సంగ్రహం, ఆంగ్ల ఉపవ్యాసాల సంగ్రహం వేర్వేరుగా ఉన్నాయని, ఇవికాక 'మదాల', 'మనద్ధాస్‌ అలీ', 'ఉరుమత్తూరు చక్రవర్తి', 'శ్రీ మద్వాల్మీకి రామాయణము' అను గ్రంథాలను కూడా ఉమర్‌ అలీషా రచించినట్టు డాక్టర్‌ మహమ్మద్‌ ముస్తఫా, డాక్టర్‌ యస్‌.యం.ఇక్బాల్‌ లాంటిపరిశోధకుల ద్వారా తెలుస్తుంది. 1924లో All India Oriental Conference 'పండిట్' బిరుదుతో సత్కరించింది. అలీఘర్‌ విశ్వవిద్యాలయం 'మౌల్వీ' బిరుదునిచ్చి గౌరవించింది. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆర్యన్‌ విశ్వవిద్యాలయం(Aryan University of France) Professor in Hindu-Muslim Culture అవార్డును అందించి గౌరవించింది. ఉమర్‌ అలీషా విద్వత్తును గుర్తించి 1936లో ACADEMIA INTERNATIONAL AMERICANA ఆయనను DOCTOR LITIERARUM (DOCTOR OF LITERATURE)) తో గౌరవించింది. ఉమర్‌ అలీషాకు మౌల్వీ, బ్రహ్మరుషి, ఆశుకవి, మహాకవి లాంటి బిరుదులు సాహిత్యలోకం నుండి లభించాయి. ఆయనకు పూల కిరీటాలు, సింహతలాలు, గజారోహణలు, కనకాభిషేకాలతో లెక్కలేనన్నిసన్మానాలు జరిగాయి. కవి, రచరచయిత , అనువాదకుడు, సంస్కర్త, ఆష్యాత్మికవేత్త , రాజకీయనాయకుడు, ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితాలను ప్రభావితం చేసిన మౌల్వీ ఉమర్‌ అలీషా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగడించారు. చివరివరకు సాహిత్య- ఆధ్యాత్మిక రంగాలతో మమేకమైపోయి గడిపిన మౌల్వీ ఉమర్‌ అలీ షా 1945 జనవరి 23న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో కన్నుమూశారు.

154