పుట:అక్షరశిల్పులు.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు


షఫీ అహమ్మద్‌ ముహమ్మద్‌
ఖమ్మం జిల్లా చండ్రగొండలో 1967 నవంబరు

22న జననం. తల్లితండ్రులు: ఆశియా బేగం, ముహమ్మద్‌

మౌలానా. కలంపేరు: యం.డి సైఫుల్లా. చదువు: బిఎస్సీ. వృత్తి: జర్నలిజం (వార్త దినపత్రిక, విజయవాడ). 1988లో 'గీటురాయి' వార పత్రికలో వ్యాసం ప్రచురితమైనప్పటి నుండి వివిధ పత్రికలలో, కవితా సంకలనాలల్లో కవితలు, వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు, చోటు చేసుకున్నాయి. రచనలు: ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లు (2005). ఈ గ్రంథం మంచి ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. లక్ష్యం: ఇస్లామీయ మార్గాన సమాజ చైతన్యం, సర్వతోముఖాభివృద్ధి. చిరునామా: యం.డి షఫీ అహమ్మద్‌, ఇంటి నం. 40-1-172, లబ్బీపేట, హుసైనీ స్ట్రీట్, విజయవాడ-10, కృష్ణా జిల్లా. సంచారవాణి: 99484 61699, 93964 29916. Email: news.shafi@gmail.com.

షహ్‌నాజ్‌ బేగం
వరంగల్‌ జిల్లా హన్మకొండలో 1976

జూన్‌ 26న జననం. తల్లితండ్రులు: చాంద్‌ సుల్తానా, ఇక్బాల్‌ మొయినుద్దీన్‌. కలంపేరు: వెన్నెల. చదువు: బిఎస్సీ. 1997లో 'తాడు బొంగరం లేని జీవితం' వ్యాసం 'గీటురాయి' వారపత్రికలో ప్రచురితమైనప్పటినుండి వివిధ పత్రికల్లో వ్యాసాలు చోటు చేసుకున్నాయి. లక్ష్యం: సత్య సందేశ పరిచయం. చిరునామా: షహ్‌నాజ్‌ బేగం, ఇంటి నం.14-4-74, మండి బజార్‌, వరంగల్‌, వరంగల్‌ జిల్లా. సంచారవాణి: 99089 53499.

షెహనాజ్‌ బేగం పఠాన్‌
అనంతపురం జిల్లా అనంతపురంలో 1953 జూలై రెండున

జననం. తల్లితండ్రులు: ఖుర్షీద్‌, ఎం.ఏ అజీజ్‌ ఖాన్‌. కలంపేరు: షెహనాజ్‌. చదువు:

బి.ఏ. వృత్తి: రాజకీయాలు (ప్రస్తుతం అనంతపురం మున్సిపల్‌


కార్పోరేషన్‌ కార్పొరేటర్‌). తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రవేశం. ఉన్నత పాఠశాల విద్యార్థిగా కథలను అల్లి చెప్పడం ఆరంభించగా 1981లో ఆంధ్రభూమి వారపత్రికలో 'త్యాగం' శీర్షికన కథ ప్రచురితమైనప్పటినుండి ఇప్పటివరకు పలు పత్రికల్లో, కథా సంకలనాల్లో రెండు వందలకు పైగా కథలు, కథానికలు చోటుచేసునికున్నాయి. ఈ కథలలో 'రెండు దారులు', 'ఇదెక్కడి న్యాయం', 'మబ్బుచాటు నక్షత్రం', 'అమ్మ సమాధి', కథలు ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టాయి. పలు కథలు కన్నడం, ఉర్దూ భాషల్లోకి అనువదించిబడి ఆయా

141