పుట:అక్షరశిల్పులు.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

బాషా పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఉర్దూలోకి తర్జుమా చేసిన పలు తెలుగు కథలు ప్రముఖ ఉర్దూ పత్రికలలో వెలువడ్డాయి. రచనలు : 1. మౌన పోరాటం (నవలిక, 1991), 2. అనుమానం కాటేసిన వేళ (కథా సంపుటి, 1997), 3. శేషప్రశ్న (కథా సంపుటి,2004). అవార్డులు-పురస్కారాలు: బీనాదేవి రాష్ట్రస్థాయి అవార్డు (అనంత కళాపీఠం, 1991), అనంత ఆణిముత్యం అవార్డు (పెనుగొండ, 2000), వాసిరెడ్డి ధార్మనిధి పురస్కారం (పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, 2006). లక్ష్యం: మంచి కథలు రాయాలని. చిరునామా : పఠాన్‌ షెహనాజ్‌, ఇంటి నం. 27, స్టేట్ బ్యాంక్‌ కాలనీ, అనంతపురం-515001, అనంతపురం జిల్లా. సంచారవాణి: 93462 63070, 98492 29786.

షహనాజ్‌ బేగం షేక్‌
నల్గొండ జిల్లా కోదాడలో 1975 జూలై ఐదున జననం.

తల్లితండ్రులు: మహమూదా బేగం, అబ్దుల్‌ మియా. చదువు: బి.ఏ., హిందీ పండిట్.

వృత్తి : జర్నలిజం. 1995 నుండి రాసిన పలు కవితలు,

వ్యాసాలు, కథలు వివిధ పత్రికల్లో, అలాగే వివిధ కవితా సంకలనాల్లో ప్రచురితం. ముస్లిం మహిళలు ధరిస్తున్నపర్దా మీద వస్తున్న విమర్శల నేపధ్యంలో రాసిన 'నేనొక్కత్తినే' కవిత, ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన 'గుడియా' లాంటి కవితలు వివిధ పత్రికలకు రాస్తున్న పలు కథనాలు, సాహిత్య-సమీక్షా వ్యాసాలు, నిర్వహిస్తున్న రెగ్యులర్‌ ఫీచర్స్‌ కాలమ్స్‌ గుర్తింపు తెచ్చిపెట్టాయి. లక్ష్యం: సత్యాన్నిసత్యంగా ప్రజలు-పాఠకుల ఎదుట ఉంచడం. చిరునామా: షేక్‌ షహనాజ్‌, ఇంటి నం. 3-7-255, మన్సూరాబాద్‌, ఎల్బీనగర్‌ మున్సిపాలిటీ, హైదారాబాద్‌-68, రంగారెడ్డి జిల్లా. సంచారవాణి: 92462 13493. sahayaa@yahoo.co.in

షహ్‌నాజ్‌ ఫాతిమా
కరీంనగర్‌ జిల్లాలో సిరిసిల్లాలో 1965 నవంబర్‌ 23న

జననం. తల్లితండ్రులు : జులేఖా, ఖాజా బద్రుద్దీన్‌. చదువు: బియస్సీ,, విద్యాన్‌.,టిటిసి. ఉద్యోగం: ఉపాధ్యాయురాలు. 1979లో 'ప్రభవ' మాసపత్రికలో

'రానిఊహలు'శీర్షికన తొలి కవిత రాసినప్పటినుండి వివిధ

సంకలనాల్లో, పత్రికల్లో చోటుచేసుకున్నాయి. ఆమె రాసిన 'కరీంనగర్‌ జిల్లాలో మహిళా సాధికారత' పరిశోధనా వ్యాసం మంచిగుర్తింపుతెచ్చిపెట్టింది. కవితలలో 'ఔరత్ ' , 'ఆత్మాభిమానం', 'నా వూరు' కవితలు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాయి. రచనలు: 1. కెరటాలు (కవితా సంకలనం, 2004), 2. మౌన శబ్దాలు (నానీలు, 2006), 3. చెలిమ (కవితా సంకలనం, 2007). పురస్కారాలు: మహిళా దినోత్సవ పురస్కారం (కరీంనగర్‌ 2006),

142