పుట:అక్షరశిల్పులు.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

మానేరు టైమ్స్‌ పురస్కారం (2006), అప్టా సత్కారం (2006). లక్ష్యం: సత్సమాజ నిర్మాణంలో పాల్గొనడం. సత్సాహిత్యాన్ని ప్రజలకు అందించడం. చిరునామా: షహనాజ్‌ ఫాతిమా, ఇంటి నం. ఎ-99, ఎల్‌.ఎం.డి కాలనీ-505527, తిమ్మాపూర్‌ మండలం, కరీంనగర్‌ జిల్లా. సంచారవాణి: 94403 70137

షాజహానా
ఖమ్మం జిల్లా పాల్వంచలో 1974 జూన్‌ 14న జన్మించారు. తల్లితండ్రులు:యాకూబీ, డాక్టర్‌ దిలావర్‌. చదువు: ఎం.ఏ (తెలుగు)., ఎంఫిల్‌. 'తెలుగులో ముస్లింవాద

సాహిత్యం-ఒక పరిశీలన' అను అంశం మీద పరిశోధన చేస్తున్నారు. 2004లో 'వతన్‌' ముస్లిం కథల పుస్తకాన్ని వెలువరించారు. 2005లో స్వీయ కవితా సంకలనం 'నఖాబ్‌' ప్రచురించారు. 2006లో 'అలవా' కవితా సంకలనాన్ని, 2009 మిని కవితలతో 'చాంద్‌ తారా' అను శీర్షికన చిరు పుస్తకాన్ని కవి స్కైబాబతో కలసి తెచ్చారు. రంగవల్లి స్మారక సాహిత్య పురస్కారం, సంస్కృతి అవార్డు (న్యూఢిల్లీ) లభించాయి. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రత్యేక ఆహ్వానం మీద జర్మనీలో జరిగిన సాహిత్య సదస్సులో పాల్గొన్నారు. పలు కవితలు హిందీ, ఇంగ్లీష్‌, జర్మనీ భాషలలో అనువదించబడి ఆయా భాషా పత్రికలలో, సంకనాల్లో చోటు చేసుకున్నాయి. 2009లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ సాహిత్యసదస్సులో పాల్గొన్నారు. చిరునామా: షాజహాన, ఇంటి నం.6-3-609/1/ఏ, అనందనగర్‌ కాలనీ, ఖైరతాబాద్‌, హైదారాబాద్‌-5000 004, సంచారవాణి: 98854 20027, 99859 21379.

షమీం షేక్‌
కడప జిల్లా బలపనూరులో 1982 జూలై 31న జననం. తల్లితండ్రులు: షేక్‌ హజిరాం బీ, షేక్‌ దస్తగిరి సాహెబ్‌. కలం పేరు: షమీం. చదువు: ఎమెస్సీ (బయో

టెక్నాలజీ), ఎమ్మెస్సీ (బయో ఇన్‌ఫర్‌ మ్యాటిక్స్‌). గత రెండు సంవత్సరాలుగా తాను రాసిన కవితలను అక్షర బద్దం చేసి తొలిసారిగా 'ప్రేమ కెరటాలు' కవితా సంపుటిని 2009లో వెలువరించారు. చిరునామా: షేక్‌ షమీం, పోస్టు బాక్స్‌ నం.001, సింహాద్రిపురం (పోస్టు)- 516 484, కడప జిల్లా.

షమీవుల్లా షేక్‌ డాక్టర్‌
అనంతపురం జిల్లా హిందూపురంలో 1972 జూన్‌ ఐదున జననం. తల్లితండ్రులు: షేక్‌ మెహరూన్‌, షేక్‌ అమీర్‌ జాన్‌.

కలం పేరు: షమీవుల్లా. చదువు: యం.ఏ., పిహెచ్‌.డి.,టిపిటి. వృత్తి : అధ్యాపకులు. విద్యార్థిగా కవిత్వం రాయడం ఆరంభించగా 1989లో తొలికవిత 'జ్ఞాపకం' ప్రచురితం అయ్యింది. అప్పటి నుండి వివిధ పత్రికల్లో, వివిధ కవితా సంకలనాలల్లో కవితలు, సాహిత్య విమర్శనా వ్యాసాలు చోటు చేకున్నాయి. ఆకాశవాణిలో పలు కవితలు, సాహిత్య వ్యాసాలు ప్రసారం కాగా

143