పుట:అక్షరశిల్పులు.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నాటక రచయిత, నటుడిగా బహుమతులు అందుకున్నారు. 1968-70 వరకు వెలువడిన 'చక్రవర్తి' (సామాజిక-సాంస్కృతిక పక్షపత్రిక) సంపాదకునిగా వ్యవహరించారు. జర్నలిస్టుగా, కవి-రచయితగా రాష్ట్రంలోని వివిధ పత్రికలలో వ్యాసాలు, కథలు, కవితలు, కథానికలు చోటు చేసుకున్నాయి. నాటికలు-నాటకాలు రాయడం, నటించడం-ప్రదర్శించడం మాత్రమే కాకుండా చలనచిత్ర రంగంలో కూడాపలు చిత్రాలకు అసోసియేట్-అసిస్టెంటు డైరక్టర్‌గా వ్యవహరించారు. రచనలు: 1. భగ్న వీణ (గేయ కావ్యం, 1965), 2. అగ్ని సరస్సు (కథా సంపుటి, 1987), 3. పాచికలు (కథా సంపుటి, 1988), 4. మజ్నూషా (చారిత్రక నాటకం, 1990), 5. సత్యాగ్ని గీతాలు (2000). ఈ గ్రంథాలలో దళిత ప్రజానీకం వెతలను వివరిస్తూ రాసిన 'అగ్నిసరస్సు' కవితా సంపుటి, ముస్లిం మహిళల మనస్సును, వేదనలను వెల్లడిస్తూ రాసిన 'పాచికలు',బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో శిఖరాయమానంగా చెప్పుకోదగ్గ 'ఫకీర్లు -సన్యాసుల' ప్రజాపోరాటానికి నాయకత్వం వహించిన వారిలో అగ్రగణ్యుడు, ఫకీర్ల మహానాయకుడు 'మజ్నూషా ఫకీర్‌' పోరాట జీవితాన్ని 'మజ్నూషా' పేరిట 1990లో రాసిన చారిత్రక నాటకం గుర్తింపును తెచ్చిపెట్టాయి. మంచి నటుడిగా ఖ్యాతిగడించిన సత్యాగ్ని హుస్సేన్‌ 'మజ్నూషా' చారిత్రక నాటకాన్ని రచించడం మాత్రమే కాకుండా మflమజ్నూషా పాత్రను స్వయంగా పోషించి రాష్ట్రంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఈ నాటిక ఆకాశవాణిలో కూడాపలు ప్రసారాలకు నోచుకోగా అది కాస్తా బాగా ప్రాచుర్యం పొందిన కారణంగా 2007లో 'మజ్నూషా' పునర్ముద్రణయ్యింది. సాహితీ-సాంస్కృతిక సంస్థలను ఏర్పాటు చేసి కవులు -రచయితలను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తున్నారు. లక్ష్యం: ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం. చిరునామా : షేక్‌ హుస్సేన్‌, ఇంటి నం. 7-1-34, ఎన్‌జీవో కాలనీ, కడప- 516001, కడప జిల్లా. సంచారవాణి: 094404 11877.

సత్తార్‌ షేక్‌
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో 1968 మే ఆరున జననం.

తల్లితండ్రులు: షేక్‌ సిలార్‌ బి, షేక్‌ దస్తగిరి సాహెబ్‌. చదువు:

బి.ఏ. వృత్తి: వైద్యం. 1984 నుండి రాస్తున్నా 2002 ఏప్రిల్‌ 18 'వార్త' దినపత్రికలో ప్రచురితమైన 'నా రాజ్యం తప్పిపోయింది' కవితతోమంచి ప్రాచుర్యంలభించింది. అప్పటి నుండి రాష్ట్రంలోని వివిధ పత్రికలలో, కవితా సంకలనాలలో పలు కవితలు చోటు చేసుకున్నాయి. ఈ కవితల్లో 'తాళి తెంచినోడ నీకు ఆలి ఎక్కడుందిరా? ప్రముఖుల, ప్రశంసలు అందుకుంది. లక్ష్యం: సమసమాజ స్థాపన ధ్యేయంగా ప్రజలను రచనల ద్వారా చైతన్యవంతుల్ని చేయడం. చిరునామా: షేక్‌ సత్తార్‌, చాణుక్యపురి, ఎకె నగర్‌ (పోస్టు), నెల్లూరు-524004, నెల్లూరు జిల్లా. సంచారవాణి: 94414 42932.

140