పుట:అక్షరశిల్పులు.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

రాసిన 'విశ్వ దర్శనం' కవితా సంపుటి గుర్తింపు తెచ్చిపెట్టింది. అవార్డులు -పురస్కారాలు: రాష్ట్ర ప్రభుత్వ ఉగాది కవి పురస్కారం (హైదారాబాద్‌), జ్యోత్స్న కళా పీఠం అవార్డు, స్వర్ణ కంకణ పురస్కారం, సరస్వతీ పీఠం అన్నా సాగర్‌ అవార్డు. లక్ష్యం: కావ్యం విశ్వశ్రేయ సాధకంగా మలచాలని, అది సామరస్య సహజీవన సాధకంగా ఉండాలన్నది. చిరునామా: డాక్టర్‌ కె.రున్నుద్దీన్‌, గాలిబ్‌ మంజిల్‌, ఇంటి నం.4-123/ఇ/56, స్వరూప్‌ నగర్‌, ఉప్పల్‌, హైదారాబాద్‌-39. సంచారవాణి: 94403 55758. Email: drkruknuddin @yahoo.com.

సాబిర్‌ హుసేన్‌ సయ్యద్‌: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 1970 ఆగస్టు 12న జననం. తల్లితండ్రులు: సయ్యద్‌ ఫాతిమా బీ, సయ్యద్‌ బాషా హుసేన్‌. చదువు: బి.ఏ.,

డిప్లొమా ఇన్‌ ఆయుర్వేదిక్‌. వృత్తి: జర్నలిజం-వైద్యం. 1990లో

విశాలాంధ్రలో కవిత ప్రచురితం కావడంతో రచనా వ్యాసంగం ఆరంభం. అప్పటినుండి వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు చోటు చేసుకున్నాయి. రచనలు: 1. ఖిబ్లా (కవితా సంకలనం, 2006, సంపాదకత్వం), 2. నిప్పు (కవితా సంపుటి,2007), 3. జంగ్ (కవితా సంకలనం, 2007, సంపాదకత్వం). 'నిప్పు' కవితా సంపుటి గుర్తింపు తెచ్చిపెట్టింటిెంది. లక్ష్యం: ఇస్లాం ప్రభొదిస్తున్న లౌకికస్వభావాన్ని వివరిస్తూవిభిన్న జన సముదాయాల మధ్య సఖ్యత-సమైక్యత కోసం పాటుపడడం. చిరునామా: సయ్యద్‌ సాబిర్‌హుసేన్‌, అమ్మ ప్రజావైద్యాశాల, ఫస్టువార్డు స్కూలు ఎదురు వీధి, వినుకొండ- 522647, గుంటూరు జిల్లా. సంచారవాణి: 96034 62053.

సాదిఖ్‌ ఎం.: తూర్పుగోదావరి జిల్లా చంద్రమాంపల్లిలో 1938లో జన్మించారు. తల్లి తండ్రులు: కందికొండ పద్మరాజు, కందికొండ వెంకాయమ్మ. ఇరవై ఏండ్ల వయస్సులో ఇస్లాం స్వీకరించిన ఆయన ఎండి. సాదిక్‌గా తన పేరు మార్చుకున్నారు. ఆర్టీసి ఉద్యోగి. రచనలు: వెలుగుబాట (1993). వివిధపట్రితికలలో పలూధ్యాత్మిక వ్యాసాలు వెలువరించారు. ధార్మిక ప్రసంగాలు చేశారు. ఆయన వెలువరించిన 'వెలుగుబాట' పలు ముద్రణలకు నోచుకుంది. చివరివరకు రచనా పరంగా, ప్రసంగాల ద్వారా ధార్మిక ప్రచారంలో నిమగ్నమైన ఎండి. సాదిఖ్‌ 1995 జూన్‌ 16న కన్నుమూశారు.

సాగర్‌ జయ్యాది డాక్టర్‌: కడప జిల్లా కడపలో 1941 ఏప్రిల్‌ నాల్గున జననం. తల్లి తండ్రులు: రొఖయాబీ, ఎన్నెస్‌ అబ్దుల్‌ ఖాలిద్‌. పూర్తిపేరు ఎన్నెస్‌ ఖాదిర్‌ హుస్సేన్‌ అయినప్పటికి 'డాక్టర్‌ సాగర్‌ జయ్యాది' పేరుతో స్థిరపడ్డారు. కలంపేర్లు: ఇండియన్‌ ముస్లిమ్‌, సాగర్‌ జయ్యాది. చదువు: ఎస్‌ఎస్‌యల్‌సి., రాష్ట్ర భాషాప్రవీణ, యూనాని వైద్యంలో డిప్లొమా.

132