పుట:అక్షరశిల్పులు.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్షరశిల్పులు

వృత్తి : వైద్యం. ఉర్డూ, తెలుగు, హిందీ భాషాల్లో మంచి ప్రవేశం.

1972లో 'లలిత ప్రతానని' కవితల సంపుటిద్వారా తెలుగు సాహిత్య రంగ ప్రవేశం. 1972 నుండి రాసిన కవితలు, వచన కవితలు, పద్యాలు పలు పత్రికలలో ప్రచురితం. రచనలు: 1. లలిత ప్రతానాని (కవితా సంపుటి, 1988), 2. పరిమళ వీచికలు (హల్కూ, 1994), 3.అనంత తరంగణి (హల్కూ పద్యాలు), 4. తెల్లవారలేదు(కవితా సంపుటి, 1997), 5. సూఫి ధాగే (వచన కవిత్వం, 2004), 6. హిరోంకా తాజ్‌ (వచనం, 2006), 7. ఆకలి రంగు (తెలుగు గజళ్ళు, 2007), 8. వెలుగు వాసన (కవితా సంపుటి, 2008). 1974 నుండి 2007 వరకు ఉర్దూలో వివిధ సాహిత్య ప్రక్రియల్లో మొత్తం పది గ్రంథాలు, 2005లో హిందీలో మరో గ్రంథం ప్రచురించారు. పలు సాహిత్య సంస్థల నుండి అవార్డులు- పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు. లక్ష్యం: మనిషి మనసును తాకే రచనలు చేయాలన్నది. చిరునామా: డాక్టర్‌ సాగర్‌ జయ్యాది, ఇంటి నం.20/369, మస్తాన్‌వలి వీధి, కడప-516001, కడప జిల్లా. సంచారవాణి: 98851 59960.

సైదా సాహెబ్‌ షేక్‌
చిత్తూరు జిల్లా పలమనేరు నివాసి. ఉద్యోగం : ఉపాధ్యాయులు.

కవి సైదాన్నగా విఖ్యాతులు. రచన: శ్రీ శంకరపురా సాfiమి పూజా మహిమ (బుర్రకథా).

సైఫ్‌ అలీ గోరే సయ్యద్‌ 1978 జనవరి ఒకటిన ఖమ్మం జిల్లా ఖమ్మంలో జననం.

తల్లితండ్రులు: హనీఫున్నీసా బేగం, సయ్యద్‌ సయీద్‌. చదువు:

ఎం.ఏ(లిట్)., డిప్లొమా ఇన్‌ మల్టీమీడియా. ఉద్యోగం: జర్నలిస్ట్‌. చిన్ననాటినుండి కవితలు రాయడం ఆరంభం. వివిధ పత్రికలు, సంకలనాలలో కవితలు, వ్యాసాలు, సమీక్షలు ప్రచురితం. రాష్ట్రం లోని కవులు, రచయితల వివరాలను, నిక్షిప్తం చేసేందుకు www. poetsinda.com వెబ్‌సైటు ఏర్పాటు చేశారు. లకక్ష్యం: ఆలోచింప చేయగల రచలను చేయడం, ప్రోత్సహించడం. చిరునామా : సయ్యద్‌ సైఫ్‌ అలీ గోరే, తండ్రి పేరు సయ్యద్‌ సయీద్‌, ఇంటి నం. 7-6-66, పరకంబండ వీధి, ఖమ్మం-507001, ఖమ్మం జిల్లా. సంచారవాణి: 99121 85829.Email:postsaif@qmail.com

సాజిదా సికిందర్‌
మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో 1967 డిసెంబర్‌ 12న

జననం. తల్లితండ్రులు: జహిరా బేగం, ఎండి. మొయినుద్దీన్‌. కలంపేరు: సికిందర్‌. చదువు: బి.ఏ. కవిసమ్మేళనాలకు, ప్రసంగాలకు పరిమితమైన రచనలు 2006లో స్వయంగా

133

6